గుంటూరు జిల్లా (Guntur District) వైసీపీలో (YSRCP) కలకలం రేగింది. ఓ మహిళా ఎమ్మెల్యేపై కార్యకర్తలు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సీఎం జగన్ (CM YS Jagan) జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రభుత్వం నడుస్తోంది. 151 సీట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేతృత్వంలో అధికార పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతపక్షాలకు చెందిన కార్యకర్తల సంగతి పక్కనబెడితే.. అప్పుడప్పుడు వైసీపీ కార్యకర్తలకు కూడా వేధింపులు తప్పడం లేదు. తరచూ వారికి సంబంధించిన సెల్ఫీ వీడియోలు కలకలం రేపుతూనే ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పలువురు నేతలపై కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్న సెల్ఫీ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళా ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వైసీపీ కార్యకర్తస సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. గుంటూరు జిల్లా (Guntur District) చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ (Vidadala Rajini)పై ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బిరుదు అనంతబాబు అనే వైసీపీ కార్యకర్త విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు నెలల క్రితం అనంతబాబు కుటుంబంపై హత్యాయత్నం జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో బాధిత కుటుంబం ఎమ్మెల్యే విడదల రజనీని ఆశ్రయించారు. అయినా న్యాయం జరగకపోవడంతో సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
“పార్టీలో చేరిన తర్వాత మీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల్లో మేం ముందున్నాం.. నిద్రాహారాలు మాని మీ గెలుపుకోసం పనిచేశాం. మాకింత ద్రోహం, అన్యాయం చేస్తారని అనుకోలేదు. పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతున్న విషయాన్ని మీ కాళ్లమీదపడి వేడుకుంటే మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. మా ఎదుట నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఆదేశించిన మీరు.. మేం వెళ్లిన తర్వాత నిందితులను వదిలేయాలని పోలీసులకు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పై ప్రేమతో మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు కూడా మాకు అన్యాయం చేస్తున్నారు.” అని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో రెండుసార్లు జిల్లా ఎస్పీని కలిసి కలిసి ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆరోపింయారు. మాకు న్యాయం జరక్కపోవడానికి ఎమ్మెల్యే రజనినే కారణమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేనే పోలీసులకు ఫోన్ చేసి నిందితులను తప్పిస్తువ్నారని ఆరోపించారు.
సీఎం చర్యలు తీసుకోవాలి..
అనంతబాబు కుటుంబం సీఎం జగన్ ను కూడా న్యాయం కోసం వేడుకుంది. సీఎం జగన్ అంటే తమకు పిచ్చని.. ఆయన కోసం చనిపోవడానికైనా మేం సిద్ధమేనని.., కానీ మా నియోజకవర్గానికి ఇలాంటి ఎమ్మెల్యేను తీసుకొచ్చిపెట్టినందుకు మేం బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా నేరస్తులకు వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. మీరే మాకు న్యాయం చేయాలని సీఎం జగన్ ను వేడుకున్నారు. న్యాయం చేయకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.