Home /News /andhra-pradesh /

GUNTUR YSRCP ACTIVISTS ARRANGED FLEXIS AGAINST THEIR OWN PARTY MADE ALLEGATIONS THAT LOCAL YCP LEADERS CHEATED THEM FULL DETAILS HERE PRN GNT

YSRCP: మమ్మల్ని వాడుకొని వదిలేస్తారా..? వైసీపీపై కార్యకర్త ఆగ్రహం.. ఫ్లెక్సీలతో నిరసన

ముప్పాళ్లలో వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ముప్పాళ్లలో వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ఏరుదాటేదాక ఏటిమల్లన్న..ఏరుదాటాక బోడి మల్లన్న. గుంటూరు జిల్లా (Guntur District) ముప్పాళ్ళ గ్రామంలో మంగళవారం దళితులు వేసిన ఫ్లెక్సీలుపై సామెతకు సరిగ్గా సరిపోతుంది.ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ (YSRCP) కార్యకర్తల పరిస్థితి.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Guntur, News18

    ఏరుదాటేదాక ఏటిమల్లన్న..ఏరుదాటాక బోడి మల్లన్న. గుంటూరు జిల్లా (Guntur District) ముప్పాళ్ళ గ్రామంలో మంగళవారం దళితులు వేసిన ఫ్లెక్సీలుపై సామెతకు సరిగ్గా సరిపోతుంది.ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ (YSRCP) కార్యకర్తల పరిస్థితి. వివరంగా చెప్పాలంటే 2014 ఎన్నికలలో ఎన్నో అంచనాలతో అధికార పీఠం అంచులవరకు వచ్చిన వైసీపీ గెలుపు గుర్రం మాత్రం ఎక్కలేక పోయింది. అప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం వేధింపులు, కోర్టు కేసులు, ఆస్థుల ఎటాచ్ మెంట్ తో జగన్ పట్ల వై.ఎస్ అభిమానుల్లో సానుభూతి ఉండేది.వై.ఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన స్థానంలో జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని వై.ఎస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ అది సాధ్యపడలేదు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందని వై.ఎస్ అభిమానులు సర్దిచెప్పుకున్నారు.

    సొంత పార్టీ పెట్టి 2014 ఎన్నికలలో తెదేపా, భాజపా మరియు జనసేన కూటమికి గట్టిపోటీ ఇచ్చి తృటిలో గెలుపును చేజార్చుకున్నారు వైఎస్ జగన్. అప్పటి నుండి జగన్ ఏడాదికి పైగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. పాదయాత్ర ప్రభావం, గత ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు వెరసి వైసీపీ అభిమానుల్లో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే కసిని రెట్టింపు చేశాయి. మరీ ముఖ్యంగా దళితులు గంపగుత్తగా జగన్ కు ఓట్లు వేశారు.

    ఇప్పుడు అదే అభిమానులు వైసీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్లలో తమను వాడుకొని వదిలేశారంటూ దళిత యువకులు వైసీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం కలకలం రేపింది. ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని తమ ఓట్లతో అధికారం పొందిన వైసీపీ నాయకులు ఇప్పుడు తమని దూరంగా పెడుతున్నారని, ఒక చిన్న ఉద్యోగం విషయంలో తమని పదే పదే అవమానాలకు గురిచేసిన స్థానిక నేతలు.. ఇకపై తమ కాలనీలలో రాజకీయాలు చేయటానికి వీలు లేదని, ఒకవేళ వై.కా.పా నాయకులు తమ కాలనీల వైపు వస్తే గాడిదలతో సమానంగా చూడటమే కాక తమ కాలనీ మహిళలతో తగిన రీతిలో బుద్ది చెబుతామని రాయటం చర్చాంశనీయంగా మారింది. ఎన్నికల సమయంలో తప్పించి మిగతా సమయంలో దళితులమైన తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం దారుణమని, తమని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే అధికార పార్టీకి ఇకమీదట ఓటువేసేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.

    ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై జిల్లాస్థాయి నేతలుగానీ, ముప్పాళ్లలో ఉండే స్థానిక వైసీపీ నేతలు గానీ స్పందించలేదు. వైసీపీకి ప్రధాన బలమైన దళితుల నుంచి ఇలాంటి నిరసన వ్యక్తం కావడం ఆ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించే అంశమన్న చర్చ జరుగుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Ysrcp

    తదుపరి వార్తలు