GUNTUR YOUTH IDENTIFIED AFTER PLAYING KIDNAP DRAMA FOR CRICKET BETTING MONEY IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Cricket Betting: క్రికెట్ పిచ్చి ఉండొచ్చుగానీ మరీ ఇంతలానా..? పోలీసులను పరుగులు పెట్టించాడు..!
ప్రతీకాత్మకచిత్రం
అతడికి క్రికెట్ (Cricktet) అంటే పిచ్చి.. క్రికెట్ ఆడటంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఇలా తన ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాడు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు టీవీకి అతుక్కుపోతాడు. ఈ క్రికెట్ పిచ్చి మనోడ్ని బెట్టింగ్ (Cricket Betting) వరకు తీసుకెళ్లింది.
దుర్వ్యసనాలు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి. వ్యక్తిత్వాన్ని స్పృహను కోల్పోయేట్లు చేస్తా యి. సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఆందోళన కలగకమానదు. ముఖ్యంగా యువత చాలా చిన్నవయసులోనే పెడదోవ పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగులు ఆన్ లైన్ రమ్మీ వంటి వాటి మత్తులో పడి తమ బంగారు జీవితాన్ని బుగ్గి పాలు చేసుకుంటున్నారు. డబ్బు కోసం కొందరు తామేంచేస్తున్నామన్నది కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఓ కుర్రాడు.. ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడాడు. తల్లిదండ్రులు పోలీసులను పరుగులు పెట్టించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) మార్కాపురం మండలం ఇరువురు చెందిన విద్యార్థి మార్కాపురంలో ఇంటర్ చదువుతున్నాడు.
అతడికి క్రికెట్ అంటే పిచ్చి.. క్రికెట్ ఆడటంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఇలా తన ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాడు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు టీవీకి అతుక్కుపోతాడు. ఈ క్రికెట్ పిచ్చి మనోడ్ని బెట్టింగ్ వరకు తీసుకెళ్లింది. ఇటీవల జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ సమయంలో తన క్రికెట్ పిచ్చిని బెట్టింగ్ లో పెట్టాడు. ఈజీగా డబ్బు సంపాదించాలని చూశాడు. కానీ మనోడు అనుకున్నది ఒకటి అయినది మరొకటి. ఇలా బెట్టింగ్ లో దాదాపు లక్ష రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా అప్పులు చేసి మరీ డబ్బులు బెట్టింగ్ లో పెట్టాడు.
ఐతే అప్పులిచ్చిన వారు డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో ఓ కన్నింగ్ ఐడియా వేశాడు. కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని.. రూ.5లక్షలు ఇస్తే వదిలేస్తామంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేశాడు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేసేజ్ వచ్చి నెంబర్ పై పోలీసులు నిఘా ఉంచగా.. సదరు యువకుడు పక్కింట్లో ఉండే ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు. దాని ఆధారంగా అతడు హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడికెళ్లి తీసుకొచ్చారు. కిడ్నాప్ డ్రామాపై ఆరా తీయగా.. క్రికెట్ బెట్టింగ్ లో చేసిన అఫ్పులు తీర్చేందుకు ఇలా చేసినట్లు తేలింది.
ఐతే యువకుడు సొంతగానే ఈ డ్రామా ఆడాడా.. లేక అప్పులిచ్చిన తమ డబ్బులు వసూలు చేసుకునేందుకు అలా చేయించారా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇంటర్ చదువుకే బెట్టింగులు, అప్పులు అంటూ తల్లిదండ్రులను యువకుడు పరుగులు పెట్టించాడు. ఐతే పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు..? అనే అంశాలపై తల్లిదండ్రులు దృష్టిపెడితే ఇలాంటి ఘటనలు జరగవని పోలీసులంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.