హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి.. ఎనిమిది నెలలు తిరిగే సరికి సీన్ రివర్స్.. పాపం సమంత..

Guntur: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి.. ఎనిమిది నెలలు తిరిగే సరికి సీన్ రివర్స్.. పాపం సమంత..

భర్తతో సమంత (ఫైల్)

భర్తతో సమంత (ఫైల్)

సోషల్ మీడియా (Social Media) లో ఏర్పడే పరిచయాల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని ఎవరెన్ని చెబుతున్నా ఈ కాలం యూత్ మాత్రం వాటిని పట్టించుకునే స్థితిలో లేదు. ఫేస్ బుక్ (Facebook) లో ఫ్రెండ్ షిప్ చేయడం, చాటింగ్ చేయడంతో ఆగకుండా ఫోన్లు, మీటింగులు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  సోషల్ మీడియా (Social Media) లో ఏర్పడే పరిచయాల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని ఎవరెన్ని చెబుతున్నా ఈ కాలం యూత్ మాత్రం వాటిని పట్టించుకునే స్థితిలో లేదు. ఫేస్ బుక్ (Facebook) లో ఫ్రెండ్ షిప్ చేయడం, చాటింగ్ చేయడంతో ఆగకుండా ఫోన్లు, మీటింగులు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా అయిన పరిచయం ప్రేమగా మారింది. అతని ప్రేమ నిజమని నమ్మింది తనవారికన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. చివరికి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) మంగళగిరికి చెందిన శాల సమంతకు పశ్చిమ గోదారి జిల్లా (West Godavari District) తణుకు సమీపంలోని వేల్పూరు సాలిపేటకు చెందిన నవీన్ అనే యువకుడితో ఫేస్‌బుక్‌ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

  ఐతే తమ ప్రేమ గురించి ఇంట్లో చెబితే ఒప్పుకోరని భావించిన సమంత.. ఎనిమిది నెలల క్రితం తల్లికి చెప్పకుండా నవీన్ వద్దకు వెళ్లిపోయింది. దీంతో నవీన్-సమంత ద్వారకా తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. అతంనరం తణుకు పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో ఇరువైపుల పెద్దలను పిలిపించిన పోలీసులు.. వాళ్లిద్దరూ మేజర్లని పెళ్లికి చట్టబద్ధత ఉందని చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత సమంతను.. నవీన్ ఇంటికి పంపారు. లవ్ మ్యారేజ్ అయిన రెండు నెలల వరకు అంతా బాగానే ఉంది.

  ఇది చదవండి: వాట్సాప్ కు అమ్మాయిల ఫోటోలు పెడితే థ్రిల్ అయ్యాడు..


  ఆ తర్వాత క్రమంగా తనలోని మృగాన్ని బయటపెట్టాడు నవీన్. కట్నం తీసుకురావాలంటూ సమంతను వేధించడం మొదలుపెట్టాడు. ఐతే ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కావడంతో సమంత ఇవన్నీ భరిస్తూ వస్తోంది. భర్త మెల్లగా మారతాడునుకొని భావించింది కానీ నవీన్ లో మార్పు రాలేదు. ఇంతలో ఆషాఢమాసం రావడంతో పుట్టింటికి వచ్చింది సమంత. ఇంటికి వచ్చీరాగానే తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. డబ్బుగానీ, బంగారంగానీ తీసుకురావాలంటున్నాడంటూ బోరున విలపించింది. ఐతే కూతురికి నచ్చజెప్పిన తల్లి లావణ్య.. అంతా సర్దుకుంటుందని భావించింది. ఐతే ఇంతలోనే ఎంత బాధపడిందో ఏమో.. ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

  ఇది చదవండి: భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని 15 కత్తిపోట్లు.. నడిరోడ్డుపై దారుణం...


  ఐతే తాను చనిపోతున్నానని భర్త నవీన్ కు మూడు రోజుల క్రితమే ఫోన్ లో సందేశం పంపినట్లు పోలీసులు చెపుతున్నారు. ఐతే పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రేమ పేరుతో తనకు కుమార్తెను పెళ్లి చేసుకున్న నవీన్.. కట్నం కోసం వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడంటూ సమంత తల్లి లావణ్య బోరున విలపించింది. నవీన్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Wife suicide

  ఉత్తమ కథలు