Home /News /andhra-pradesh /

GUNTUR YOUNG WOMAN COMMITS SUICIDE AFTER LOVER DEMANDS DOWRY FOR MARRIAGE IN GUNTUR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Guntur Student: ప్రేమించినవాడే సర్వస్వం అనుకుంది.. పెళ్లికి ముందు ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Love: ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగే ఆ యువతి కూడా మనసుకు నచ్చిన వాడినే మనువాడాలని భావించింది. అతడి కులం వేరైనా తల్లిని ఒప్పించింది. కానీ పెళ్లికి ముందు అనుకోని ఘటన ఆమె ప్రాణాలు తీసింది.

    ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగే ఆ యువతి కూడా మనసుకు నచ్చిన వాడినే మనువాడాలని భావించింది. అతడి కులం వేరైనా తల్లిని ఒప్పించింది. అంతా సరే అనుకున్నట్లే జరుగుతుందని.. ప్రేమించిన వాడితోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని భావించింది. కానీ పెళ్లికి సిద్ధమైన అతడు.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో తట్టుకోలేకపోయిన యువతి.. నరకయాతన అనుభవించలేక కఠిన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన పటేల్ నగర్ కు చెందిన హనుమంతు సాయిరాం చేస్తూ కొన్నేళ్ల క్రితం చనిపారు. దీంతో ఆయన భార్య శివపార్వతి కోర్టులో ఉద్యోగం చేస్తూ ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేసింది.

    ప్రస్తుతం పెద్దకుమార్తె శ్రావణి ఓ కాలేజీలో ఎల్.ఎల్.బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీతో తన క్లాస్ మేట్ అయిన తేజను ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించింది. కులాలు వేరైనా కుమార్తె ప్రేమను తల్లి అంగీకరించింది. అంతా సవ్యంగా జరుగుతందనుకున్న సమయంలో తేజ బాంబు పేల్చాడు. పెళ్లి చేసుకోవాలంటే రూ.15 లక్షలు కట్నంగా తీసుకురావాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగుతిన్న శ్రావణి.. ప్రస్తుతం తమ దగ్గర అంత డబ్బులేదని చెప్పింది. ఐతే పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పిన తేజ.. తనను మర్చిపోవాలన్నాడు.

    ఇది చదవండి: ఆమెకు ఒకేసారి ఇద్దరితో సీక్రెట్ ఎఫైర్.. మరో లవర్ తో కలిసి మర్డర్ స్కెచ్.. చివర్లో ట్విస్ట్..


    ప్రియుడు అలా అనడం డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శ్రావణి కొన్ని రోజులుగా రూమ్ కే పరిమితమైంది. తల్లి, చెల్లెలు ఆమెకు ధైర్యం చెబుతూ వస్తున్నారు. ఐతే ఈనెల 6న ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అడ్మిట్ చేసుకోలేదు. అక్కడి నుంచి బాపట్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

    ఇది చదవండి: ఏపీలో వాలంటీర్ నిర్వాకం.. పెన్షన్ డబ్బులు తీసుకొని ప్రియురాలితో పరారీ.. చివర్లో మరో ట్విస్ట్..



    పెళ్లీడుకొచ్చిన కుమార్తె కళ్ల ఎదుటే ప్రాణం తీసుకోవడంతో పార్వతి విషాదంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చడం బంధువుల వల్లకాలేదు. దీనిపై సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను విచారించారు. శ్రావణి తల్లి ఫిర్యాదు మేరకు తేజపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గతంలో పలుచోట్ల ప్రేమించినవాళ్లు మోసం చేయడంతో యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఏపీలో చాలా చోట్ల వెలుగుచూశాయి. గుంటూరు జిల్లాలోనే  యువతి ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. చివరి నిముషంలో కుటుంబ సభ్యులు స్పందించడంతో ప్రాణాలతో బయటపడింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు