Home /News /andhra-pradesh /

GUNTUR YOUNG MAN BOOKED FOR THREATEN YOUNG WOMAN ON THE NAME OF LOVE IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Guntur: టెన్త్ క్లాస్ లో ప్రేమించాడు.. వాట్సాప్ లో నెంబర్ పట్టాడు.. ఓ అర్ధరాత్రి ఇంటికెళ్లి ఏం చేశాడో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guntur: ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకుంటే చంపేస్తామనడం, యాసిడ్ పోస్తామని బెదిరించడం, కొన్నిసార్లు గీతదాటి ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఓ యువకుడు తనను ప్రేమించకపోతే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ బెదిరించిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్. చదువుకునే సమయంలో, ఉద్యోగం చేసే చోట ఒకరినొకరు ఇష్టపడటం.. పరస్పర అంగీకారంతో విడిపోవడం వంటివి జరుగుతుంటాయి. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకుంటే చంపేస్తామనడం, యాసిడ్ పోస్తామని బెదిరించడం, కొన్నిసార్లు గీతదాటి ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఓ యువకుడు తనను ప్రేమించకపోతే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ బెదిరించిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) భట్టిప్రోలు పరిధిలోని క్రీస్తులంకకు చెందిన యువతి, గాజులలంకకు చెందిన సందీప్ పదవ తరగతి చదువుకునే సమయంలో ఒకే ట్యూషన్ లో చదువుకునేవారు. టెన్త్ పూర్తైన తర్వాత దారిన వాళ్లు వెళ్లిపోయారు.

    ఐతే ఆ యువతీ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల టెన్త్ క్లాస్ మేట్స్ అంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్ లో సందీప్ తో పాటు యువతి కూడా ఉంది. ఐతే ఎప్పటి నుంచో సందీప్ ఆ యువతిని ఇష్టపడుతున్నాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆమె నెంబర్ సంపాదించిన సందీప్.. ప్రతి రోజూ యువతికి గుడ్ నైడ్, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ లు చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. తరచూ ప్రేమ పేరుతో ఫోన్ చేసి వేధిస్తుండేవాడు.

    ఇది చదవండి: 15 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ ఎఫైర్.. గుడివాడ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. ఎక్కడ చిక్కారంటే..!


    యువతి వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈనెల 24న అర్ధరాత్రి కొందరు యువకులను వెంటబెట్టుకొచ్చిన సందీప్ అమె ఇంటికి వెళ్లి తనను ప్రేమించకపోయినా ఫర్వాలేదని.. పెళ్లి చేసుకోకపోతే నీఇష్టం అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాదు పెళ్లి చేసుకుంటే ఇంటిని పెట్రోల్ పోసి తగలబెడతానంటూ పెద్దపెద్దగా కేకలు వేస్తూ హడావిడి చేశాడు. అర్ధరాత్రి అరుపులు విన్న చుట్టుపక్కలవారు పరుగులు పెట్టుకుంటూ రావడంతో సందీప్ పారిపోయాడు. ఘటనతో ఒక్కసారి షాక్ కు గురైన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


    ఇది చదవండి: వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఒకే మహిళతో ఎపైర్.. ఓ రాత్రి ఊహించని ట్విస్ట్..


    కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువతులను వేధించడం సరికాదని.. చంపేస్తానని బెదిరించడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి పనులు చేసి జైలు పాలైతే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. గతంలో నెల్లూరు జిల్లాలో ఓయువకుడు తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Harassment

    తదుపరి వార్తలు