Home /News /andhra-pradesh /

Affair: తన కన్నా చిన్నవాడితో మహిళ ఎఫైర్.. ఇద్దరకీ ఎక్కడ చెడాలో అక్కడ చెడింది.. చివరికి అనుకోని ట్విస్ట్..!

Affair: తన కన్నా చిన్నవాడితో మహిళ ఎఫైర్.. ఇద్దరకీ ఎక్కడ చెడాలో అక్కడ చెడింది.. చివరికి అనుకోని ట్విస్ట్..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

సోషల్ మీడియా (Social Media) లో ఏర్పడిన పరిచయాలు జీవితాలను ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఫేస్ బుక్ (Facebook), వాట్సాప్ (What’s App), ఇన్ స్టాగ్రామ్ (Instagram), షేర్ చాట్ (Shar Chat) ఇలా సోషల్ మీడియా వేదికలపై మొదలవుతున్న పరిచయాలు వివాహేతర సంబంధాలకు (Extramarital Affairs) దారితీస్తున్నాయి. అవి అక్కడితో ఆగడం లేదు. ఆర్ధిక వ్యవహారాల వరకు వెళ్లి హత్యలతో ముగుస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  సోషల్ మీడియా (Social Media) లో ఏర్పడిన పరిచయాలు జీవితాలను ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఫేస్ బుక్ (Facebook), వాట్సాప్ (What’s App), ఇన్ స్టాగ్రామ్ (Instagram), షేర్ చాట్ (Shar Chat) ఇలా సోషల్ మీడియా వేదికలపై మొదలవుతున్న పరిచయాలు వివాహేతర సంబంధాలకు (Extramarital Affairs) దారితీస్తున్నాయి. అవి అక్కడితో ఆగడం లేదు. ఆర్ధిక వ్యవహారాల వరకు వెళ్లి హత్యలతో ముగుస్తున్నాయి. తాజాగా ఓ మహిళ.. సోషల్ మీడియాలో పరిచయమైన తనకంటే చిన్నవాడితో సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం పక్కదారి పట్టి హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని గుంటూరు జిల్లాకు (Guntur District) చెందిన నూటి కోటీశ్వరి అనే మహిళకు.. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అఖిల్ కు దాదాపు మూడు నెలల క్రితం షేర్ చాట్ యాప్ ద్వారా పరిచయమైంది.

  ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని తరచూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో కోటీశ్వరి తనకు డబ్బులు అవసరముందని సర్దుబాటు చేయమని అఖిల్ ను కోరింది. దీంతో అతడు ఒకసారి రూ.35 వేలు, మరోసారి రూ.44 వేలు ఆమెకు ఇచ్చాడు. ఐతే ఆ డబ్బును అఖిల్ కుటుంబ సభ్యులు వ్యవసాయ ఖర్చు నిమిత్తం అప్పుగా తీసుకొచ్చారు. దీంతో ఆ డబ్బు కోసం తల్లిదండ్రులు అతడ్ని నిలదీశారు. తల్లిదండ్రుల ఒత్తిడితో అఖిల్.. తన డబ్బు తిరిగివ్వాలని కోటేశ్వరిని నిలదీశాడు.

  ఇది చదవండి: భర్తతో భార్య గొడవ.. మధ్యలో ప్రియుడు ఎంట్రీ.. తల్లిబాగోతాన్ని బయటపెట్టిన కొడుకు..


  ఈ క్రమంలో ఆమె ఈనెల 19న గుంటూరు వస్తే డబ్బులు తిరిగిస్తానని చెప్పింది. దీంతో అఖిల్ గుంటూరులో కోటేశ్వరి ఇంటికి వచ్చాడు. తన దగ్గరున్న నగలను తీసుకున్న కోటేశ్వరి మధ్యాహ్నం అఖిల్ తో కలిసి బంగారు దుకాణం వద్దకు వెళ్లి వాటిని రిపేర్ చేయమని అడిగింది. అందుకు రూ.50వేలు కావాలని అఖిల్ ను కోరింది. అందుకు నిరాకరించిన అఖిల్.. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని నిలదీశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేశారు.

  ఇది చదవండి: నెలరోజులుగా చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీ... అసలు మిస్టరీ ఇదేనా..?


  అనంతరం డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోటేశ్వరిపై ఆగ్రహంతో ఊగిపోయిన అఖిల్ ఆమె ముఖంపై దిండును అదిమిపెట్టాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా ఆమె కిందపడిపోయింది. అనంతరం కోటేశ్వరి జుట్టుపట్టుకొని బలంగా నేలకేసి కొట్టాడు. చనిపోలేదన్న అనుమానంతో గొంతునలిమి హత్య చేశాడు.

  ఇది చదవండి: మ్యాట్రిమనీలో పరిచయం.. రెండు నెలలు సహజీవనం.. ఓ అర్ధరాత్రి ఊహించని ట్విస్ట్...


  అనంతరం ఆమె ఒంటిపై బంగారు నగలు తీసుకొని పాల్వంచ వెళ్లిపోయాడు. ఆ నగలను ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టి డబ్బుతీసుకొని ఇంట్లో ఇచ్చేశాడు. కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు మృతురాలి ఫోన్ కాల్ డేటాను విశ్లేషించారు. ఆమెకు అఖిల్ తో సంబంధం ఉన్నట్లు నిర్ధారించుకొని అతడ్ని అదుపులోకి తీసుకోని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.
  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  మీ నగరం నుండి (​గుంటూరు)

  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur

  తదుపరి వార్తలు