GUNTUR YOUNG MAN BOOK FOR BLACKMAILING A GIRL WITH MORPHED PHOTOS AFTER SHE REJECTING LOVE PROPOSAL IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Facebook Love: ఫేస్ బుక్ లో లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిన యువతి... ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
వాట్సాప్ (What’s APP), ఫేస్ బుక్ (Face Book), ఇన్ స్టాగ్రామ్ (Instagram), ట్విట్టర్ (Twitter) వంటి సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్ ఫాంల ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఐతే ఆన్ లైన్లో ఏర్పడిన పరిచయాలు రాంగ్ లైన్లో వెళ్తున్నాయి.
సోషల్ మీడియా.. ఎవరిని ఎవరితోనైనా కలుపుతుంది. ఎవరితోనైనా స్నేహం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అభిప్రాయాలు, అభిరుచులు పంచుకునేందుకు సోషల్ మీడియానే వేదిక. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఐతే ఆన్ లైన్లో ఏర్పడిన పరిచయాలు రాంగ్ లైన్లో వెళ్తున్నాయి. ఫేస్ బుక్ ద్వారా యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెచ్చిన ఓ యువకుడు ఆమెతో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు. నిత్యం చాటింగ్ చేస్తూ టైమ్ చూసుకోని లవ్ ప్రపోజ్ చేశాడు. అది నచ్చని సదరు యువతి అతడ్ని బ్లాక్ చేసింది. దీంతో అతడు.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదశ్ లోని గుంటూరు నగరం శ్రీనివాసరావు పేటకు చెందిన యువతి నర్సరావుపేటలోని ఓ కాలేజీలో డిగ్రీ చవుదుతోంది. ఆమెకు ప్రకాశం జిల్లాకు చెందిన శివరామకృష్ణ అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు.
అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన యువతి.. చాటింగ్ కూడా చేసేది. దీంతో కాస్త చనువు తీసుకున్న రామకృష్ణ.. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. ఐతే ప్రేమ, పెళ్లి తనకు ఇష్టం లేదని అతని ప్రపోజల్ ను తిరస్కరించింది. అంతేకాకుండా ఫేస్ బుక్ లో అతడ్ని బ్లాక్ చేసింది. దీంతో శివరామకృష్ణ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గుంటూరులోని తన మిత్రులను శ్రీనివాసరావుపేటలోని యువతి ఇంటికి పంపి ఆమె సెల్ ఫోన్ దొంగిలించాడు. అందులో యువతితో పాటు ఆమె సోదరి ఫోటోలను డౌన్ లోడ్ చేశాడు. తనను ప్రేమించకపోతే ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. అక్కడితో ఆగకుండా మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఆమెకు వాట్సాప్ లో పెట్టి బెదిరించాడు. దీంతో బాధితురాలు గుంటూరు అర్బన్ ఏఎస్పీ గంగాధర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
రెండు రోజుల క్రితం గుంటూరులోని ఇదే శ్రీనివాసరావుపేటకు చెందిన ఇంటర్ విద్యార్థినికి ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు ఆమె ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అలా ఆమె దగ్గరి నుంచి రూ.80వేలు తీసుకున్నాడు వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాని వినియోగించే యువతులు అపరిచిచుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వారితో అతి చనువు పనికిరాదని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి వారి ట్రాప్ లో పడితే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.