Home /News /andhra-pradesh /

GUNTUR YOUNG MAN ARRESTED FOR MORPHING FRIENDS WIFE PHOTOS IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Friend Wife: స్నేహానికి అడ్డొస్తుందని ఫ్రెండ్ భార్యను ఇలా చేశాడేంటి..? మరీ అంత నీచమా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: స్నేహితుడి భార్యను చెల్లెలిలాగా భావించాల్సిన వాడు నీచంగా చూశాడు. ఆమె పరువు తీయాలని భావించి చివరకు కటకటాల పాలయ్యాడు.

    అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

    స్నేహం. (Friendship) రక్తసంబంధం కంటే ఎక్కువ. స్నేహం కోసం ప్రాణలిచ్చే స్నేహితులుంటారు. రక్తసంబంధీకులకంటే ఫ్రెండ్స్ నే ఎక్కువ అభిమానించే స్నేహితులుంటారు. కొన్నిసార్లు ప్రాణస్నేహమే శాపంగా మారుతుంది. ఫ్రెండ్స్ దూరమవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు నీచానికి ఒడిగట్టాడు. ప్రాణస్నేహితుడి పెళ్లైతే సంతోషించాల్సిన వాడు అసూయతో రగిలిపోయాడు. చెల్లెలిలాగా చూసుకోవాల్సిన స్నేహుతుడి భార్య పరువు తీశాడు. చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)లోని గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన బెజ్జం దేవా గాడ్విన్ అనే యువకుడికి 2017లో ఐటీఐ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో చదివే మరో యువకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కలిసి మెలిసి తిరిగారు. తక్కువ కాలంలోనే ఇద్దరు మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. చదువు పూర్తైన తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది.

    ఐటీఐ పూర్తైన తర్వాత ఇద్దరూ నెల్లూరులోని ఓ బైక్ షోరూమ్ లో ఉద్యోగం సంపాదించారు. అక్కడ కూడా ఒకే రూమ్ లో ఉండేవారు. ఇదే సమయంలో దేవా స్నేహితుడు గుంటూరు జిల్లా కొర్నెపాడుకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమికులిద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించి గత నెల7న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఆ యువకుడు తన భార్యతో కలిసి విడిగా ఉంటున్నాడు.

    ఇది చదవండి : ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ భారం.., ఆ చిన్నారి కష్టం ఎవరికీ రాకూడదు..


    ఐతే పెళ్లి తర్వాత స్నేహితుడి ఎడబాటు తట్టుకోలేని ఆ దేవా నీచంగా ఆలోచించాడు. ఎలాగైనా తన ఫ్రెండ్ కు భార్యను దూరం చేయాలనే ఉద్దేశంతో ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆమెకే పంపాడు. ఆమెతో పాటు మరికొందరికి మార్ఫింగ్ చేసిన ఫోటోలను షేర్ చేశాడు. ఇలా చేస్తే తన స్నేహితుడు భార్యకు విడాకులిస్తాడని భావించాడు.

    ఇది చదవండి: తండ్రిలేని వాడని చేరదీసిన మేనత్త.. కానీ వాడు అలా చేస్తాడని ఊహించలేకపోయింది..


    తొలుత తన మార్ఫింగ్ ఫోటోలను (Morphing) ఎవరు పంపుతున్నారో అర్ధం కాక ఆందోళన చెందిన యువతి..అసలు నిజం తెలియడంతో వట్టిచెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా కోర్టు సమీపంలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడే తన భార్యను అసభ్యంగా చిత్రీకరించి వేధించడంతో సదురు యువకుడు షాక్ కు గురయ్యాడు.

    ఇది చదవండి: వాళ్లిద్దరిది లవ్ మ్యారేజ్.. 6 నెలలు అంతా బాగానే ఉంది.. కానీ ఓ రోజు ఇంట్లో షాకింగ్ దృశ్యం...


    ఇటీవల విజయవాడలో (Vijayawada) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ విద్యార్థినికి స్నేహితుడిగా పరిచయమైన బీహార్ కు చెందిన రోహిత్ అనే యువకుడు ఆ తర్వాత ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. అతడ్ని పూర్తిగా నమ్మిన యువతి.. ఓ రోజు రోహిత్ కు తన న్యూడ్ ఫోటోలు పంపింది. కొన్నాళ్లకు అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో బ్రేకప్ చెప్పింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు ఆమె ఫోటోలు, వీడియోలను ఫ్రెండ్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయించాడు. దీంతో బాధిత యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రోహిత్ తో పాటు అతడి స్నేహితుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Guntur, Nude videos blackmails

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు