GUNTUR YOUNG MAN ARRESTED FOR BLACKMAILING MINOR GIRL WITH NUDE PHOTOS AND VIDEOS IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Blackmailing: ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ కొనిస్తే ఇలా చేసిందేంటీ..! చేజేతులా లైఫ్ రిస్కులో పడేసుకున్నావుగా..!
ప్రతీకాత్మకచిత్రం
సోషల్ మీడియా (Social Media) పరిచయాలు, ప్రేమలు చివరకు వివాదాలు, విషాదాలతో ముగుస్తున్నాయి. ఆన్ లైన్ వేదికగా అమ్మాయిలు, మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి.
సోషల్ మీడియా (Social Media) పరిచయాలు, ప్రేమలు చివరకు వివాదాలు, విషాదాలతో ముగుస్తున్నాయి. ఆన్ లైన్ వేదికగా అమ్మాయిలు, మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. పరిచయాలు పెంచుకొని మరింత దగ్గరై అమ్మాయిల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు కొందరు కామాంధులు. అంతేకాదు వారిపట్ల అసత్య ప్రచారం చేసి పరువుతీస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో చాలా మంది అమ్మాయిలు మానసికక్షోభ అనుభవిస్తున్నారు. కొందరు అయితే ఈ వేధింపుల్ని తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలున్నాయి. ఇటీవల ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు కొనిచ్చిన మొబైల్ ద్వారా ఓ యువకుడి మాయలో పడిన ఓ బాలిక వాడి చేతిలో దారుణంగా మోసపోయింది. ఆ కేటుగాడు బాలికను శారీరకంగా అనుభవించడమే కాకుండా బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోనిగుంటూరు జిల్లా (Guntur District) పెదకూరపాడుకు చెందిన ఒక మైనర్ బాలిక పదవ తరగతి చదువుతోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా స్కూల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆమెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. మొబైల్లో ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతూనే.. ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసింది. అలా ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుండేది. ఓ రోజు పెదకూరపాడు సమీపంలోని 75తాళ్లూరు గ్రామానికి చెందిన ప్రకాశ్ అనే యువకుడు బాలికకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అతడిగురించి తెలియక రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. చాటింగ్ కాస్తా ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకునేవరకు వెళ్లింది. మరోవైపు బాలిక చదవుకు ఇబ్బందికాకుండా తల్లిదండ్రులు మేడపై గదిని కేటాయించారు. అదే అలుసుగా తీసుకొని చదువును పక్కనబెట్టి అతడితో చాటింగ్, ఫోన్లో మాట్లాడటం చేస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి బాలిక ఇంటికి వచ్చిన ప్రకాశ్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా బాలికను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశాడు.
తల్లిదండ్రులు ఏమైనా అంటారేమోనన్న భయంతో వారికి విషయం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న ప్రకాశ్.. డబ్బులివ్వకపోతే న్యూడ్ ఫోటోలను ఆన్ లైన్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాలిక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్ ఫోల్ స్వాధీనం చేసుకొని పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఆన్ లైన్ క్లాసుల పేరుతో మొబైల్స్, ల్యాప్ టాప్ లకు అడిక్ట్ అవుతున్న పిల్లలు ఇలాంటి మాయగాళ్ల వలలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు టీనేజ్ పిల్లలపై దృష్టిపెట్టాలని.. వారు ఏం చేస్తున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారనేదానిపై నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.