బాలిక చదుల్లో టాపర్. పదోతరగతిలో 10కి 10 జీపీఏ సాధించింది. అంతేకాదు ప్రతిష్టాత్మక సంస్థలో సీటు సాధించింది. కాలేజీలో చేరి బాగా చదువుకొని జీవితంలో పైకి ఎదగాలని కలలు కనింది. కానీ ఊహించని రీతిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లికి ఉన్న వివాహేతర సంబంధమే దీనికి కారణంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) లింగసముద్రంకు చెందిన మాధవికి తమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిచేతోంది. కొంతకాలం క్రితం భర్తతో విడిపోయి కుమార్తె ప్రశాంతితో కలిసి ఒంటరిగా నివాసముంటోంది. ప్రశాంతి ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదోతరగతి చదివింది. చదువులో చురుగ్గా ఉండే ప్రశాంతి టెన్త్ తో 10/10 జీపీఏ సాధించింది. ఆమెకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు కూడా వచ్చింది. గురువారం ట్రిపుల్ ఐటీలో చేరాల్సి ఉంది.
ఇంతలో ఏం జరిగిందో ఏమో మూడు రోజుల క్రితం ప్రశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐతే కూతురు మృతిని రహస్యంగా ఉంచిన తల్లి మాధవి.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఓ రోజంతా ఉంచింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గుట్టుగా దహనం చేసింది. ఇందుకు ఆమె ఇంటికింద పోర్షన్లో నివసించే ఓ వ్యక్తితో పాటు మరికొందరు సహకరించినట్లు తెలుస్తోంది.
అతడితో సంబంధమే కారణమా..?
ప్రశాంతి మృతిపై పలు అనుమానాలు రేకెత్తతున్నాయి. మాధవికి జంగంరెడ్డిపాలెంకు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం(Extramarital Affair) ఉన్నట్లు తెలుస్తోంది. అతడు వీరు ఉంటున్న ఇంటి కింద పోర్షన్లోనే ఉంటున్నాడు. తమ బంధానికి ప్రశాంతి అడ్డుగా ఉందని భావించి హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రశాంతి మృతిపై ప్రశ్నిస్తే.. అటు మాధవిగానీ, ఇటు యువకుడు గానీ పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తొలుత ప్రశాంతి మెట్లపై జారిపడిందని.., కంగారుపడి ఇంట్లోనే ఉంచానని ఒకసారి.., గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కారులోనే చనిపోయిందని మరోసారి సమాధానం ఇచ్చింది.
ఐతే కన్నకూతురు మెట్లపైనుంచి పడిపోతే ఎన్ఎన్ఎం అయిన తల్లి ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని.. ఒక వేళ నిజంగా ఆస్పత్రికి తీసుకెళ్తుంటే చనిపోతే తమకు ఎందుకు చెప్పలేదని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాధవితో పాటు ఆ యువకుడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వాళ్లిద్దరితో పాటు వారికి సహకరించిన మరోవ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది హత్య, సజహ మరణణా అనే తేల్చే పనిలో పోలీసులున్నారు. మాధవి, ఆమెతో సంబంధమున్న యువకుడి సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. బాలికను దహనం చేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Death, Extramarital affairs, Minor girl