మెడిసన్ చదివేందుకు ఫారిన్ వెళ్లి ఇతగాడు నేర్చుకున్నది ఇదీ.. డాక్టర్ కావాల్సిన వాడు జైలుకు వెళ్లాడు..

ప్రతీకాత్మక చిత్రం

Crime: అలా మెడిసన్ చదువుతానని విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు.. వైద్యవిద్య నేర్చుకోకుండా మాయదారి పనులు నేర్చొని వచ్చాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

 • Share this:
  Anna Raghu, Guntur, News18

  పిల్లల్ని ప్రయోజకులను చేసేందుకు తల్లిదండ్రులు చాలా కష్టాలు పడతారు. రూపాయి రూపాయి కూడబెట్టి ఉన్నత చదువులు చదివిస్తారు. వాళ్లకు అప్పగించిన బాధ్యతలకు, చదువులకు న్యాయం చేస్తారని గుడ్డిగా నమ్ముతారు. కానీ కొందరు సుపుత్రులు తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేస్తుంటారు. అలా మెడిసన్ చదువుతానని విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు.. వైద్యవిద్య నేర్చుకోకుండా మాయదారి పనులు నేర్చొని వచ్చాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గంజాయి అక్రమ రవాణా పెరిగిపోయింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో (Guntur District) తరచూ గంజాయీ స్మగ్లింగ్ జరుగుతోంది. అప్పడప్పుడూ వీరు పోలీసులకు చిక్కుతున్నారు. అలా డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ ఓ యువకుడి గురించి ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. కొడుకు చేసిన నిర్వాకానికి తల్లిదండ్రులు కూడా విస్తుపోయారు.

  వివరాల్లోకి వెళ్తే... గుంటూరు నగరానికి చెందిన ఓ యువకుడు ఫిలిప్పైన్స్ లో వైద్యవిద్యను పూర్తి చేసి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఐతే ఇంటికొచ్చిన తర్వాత డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడమో లేక పీజీకి అప్లై చేస్తాడో తల్లిదండ్రులు భావించారు. కానీ మనోడు ఇవేమీ చేయకుండా తప్పుడుదారిలో వెళ్లాడు. చదువుకోవడానికి ఫిలిప్పైన్స్ వెళ్లిన సమయంలో డ్రగ్స్ కు అలవాటుపడిన యువకుడు ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేశాడు.

  ఇది చదవండి: ఆ అమ్మాయిని ప్రేమించడమే ఈ కుర్రాడు చేసిన తప్పు... మరీ అంత కిరాతకమా..?


  అప్పులు చేసి సైడ్ బిజినెస్..
  తాను డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ పెడ్లర్స్ తో పరిచయాలు పెంచుకున్నాడు. కొడుకు డ్రగ్స్ కు బానిసవడంతో ఇంట్లోవాళ్లు డబ్బులివ్వకుండా కట్టడి చేశాడు. దీంతో బయట అప్పులు చేసి లీటర్ల లెక్కన లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసి వాటిని 15గ్రాముల చొప్పున చిన్నచిన్న సీసాల్లో నింపి విక్రయించడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన లాభాలతో మళ్లీ డ్రగ్స్ కొని తీసుకుంటున్నాడు. ఇలా విక్రయిస్తూనే పోలీసులకు పట్టుబడ్డాడు.

  ఇది చదవండి: పోసాని నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకు జనసేన కార్యకర్త కంప్లైంట్..


  అలాగే గుంటూరుకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు జల్సాలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో గంజాయికి బానిసయ్యారు. గంజాయిని లిక్విడ్ రూపంలో వారు సేవిస్తూ డ్రగ్స్ పెడ్లర్స్ గా మారారు. సిటీలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో నిఘా ఉంచారు. దీంతో వీళ్లిద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

  ఇది చదవండి: పద్ధతి మార్చుకోమంటే ఇంత దారుణానికి ఒడిగడతావా..? నీకు చేతులెలా వచ్చాయి తల్లీ..  గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గంజాయి మాత్రం ఇతర రాష్ట్రాలకు వివిధ రూపాలలో రవాణా అవుతోంది. ముఖ్యంగా ఏఓబీ నుంచి టన్నుల కొద్దీ గంజాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా అవుతోంది. నగరాల్లో విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న స్మగ్లింగ్ ముఠాలు, గంజాయి అక్రమ రవాణాకు సైతం విద్యార్థులనే ప్రోత్సహిస్తున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి యువత పక్కదారి పట్టకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
  Published by:Purna Chandra
  First published: