హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balayya vs YCP MLA: మూడో కన్ను ఉంటుందా? బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్

Balayya vs YCP MLA: మూడో కన్ను ఉంటుందా? బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్

బాలయ్య వర్సెస్ గోపిరెడ్డి

బాలయ్య వర్సెస్ గోపిరెడ్డి

Balayya vs YCP MLA: అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ బాలయ్య వార్ తీవ్రమైంది.. చిటికేస్తే చాలు.. మూడో కన్ను తెరవమంటావా అంటూ.. బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు.. దీనిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.. ఏమన్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Narasaraopet, India

Balayya vs YCP MLA: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే వైసీపీ మంత్రులు (YCP Minister), నేతలు.. ఎక్కువగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన తనయుడు నారా లోకేష్ (Nara Lokesh), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పై విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫైట్ లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎంటర్ అయ్యారు. వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (MLA Gopireddy Srinivasareddy) పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలపై గోపిరెడ్డి అదే స్థాయిలో స్పందించారు. బాలకృష్ణ తనకు వార్నింగ్ ఇచ్చారని తెలిసిందన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. అసలు విషయం తెలుసుకొని మాట్లాడాలని ఆయనకు హితవు పలుకుతున్నాను అన్నారు. ఏదో ఒకటి మాట్లాడి తర్వాత సారీ చెప్పటం బాలకృష్ణకు అలవాటుగా మారిందన్నారు. రామిరెడ్డి పేటలో ప్రభ కట్టారు. వైసీపీ అభిమానుల దగ్గర నుండి చందాలు తీసుకొని భాస్కర్ రెడ్డి ప్రభ కట్టాడని.. మద్యం సేవించి న్యూసెన్స్ చేసి ప్రభను కూడా కోటప్పకొండకు తీసుకెళ్ళలేదన్నారు. ఆ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దానిపై భాస్కర్ రెడ్డిని మందలించాను. అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. బాలకృష్ణ ఒక ఎమ్మెల్యే, టీడీపీ నేత. విషయం తెలుసుకొని మాట్లాడాలి.. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

అసలు.. తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరు? గోపిరెడ్డి ఫైర్ అయ్యారు. బాలకృష్ణ తన వ్యక్తిత్వం దిగజార్చుకోవద్దని ఎమ్మెల్యే అన్నారు. ఏ చర్చకైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకొని వార్నింగ్ లు ఇవ్వొద్దన్నారు. మర్యాదగా మాట్లాడాలని బాలకృష్ణకు హితవు పలికారు. మనుషులకు రెండే కళ్లు ఉంటాయి, మూడో కన్ను ఉండదన్న వాస్తవం బాలయ్య తెలుసుకోవాలన్నారు.

తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు బాలయ్య ఎవరు? ఆయన హీరో అయితే టీడీపీకి గొప్ప కానీ.. తనకు కాదు అన్నారు. బాలయ్య వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. బాలకృష్ణ ఎన్నోసార్లు తప్పుడు మాటలు మాట్లాడారు. ఏదో ఒకటి అనడం, తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం ఆయనకు అలవాటైపోయిందన్నారు. ఓ పనికిమాలిన వెధవకి వత్తాసు పలికి స్థాయి దిగజార్చుకోవద్దని కోరారు.

ఇదీ చదవండి : అసెంబ్లీ వేదికగా సర్కార్ తో ఢీ.. ఎమ్మెల్యే కోటం రెడ్డి వినూత్న నిరసన.. ఆయన డిమాండ్ ఏంటంటే..?

అసలేం జరిగిందంటే..

నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి జరిగిన కోటప్పకొండ తిరునాళ్లలో బాలయ్య సాంగ్ పెట్టి డ్యాన్స్ వేసినందుకు వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని.. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మందలించారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో అతడు ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన బాలకృష్ణ.. ఎమ్మెల్యే పేరు చెప్పకుండానే ఆయనపై సీరియస్ అయ్యారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాను సినిమాగానే చూడాలన్నారు. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకోనన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nandamuri balakrishna, Narasaraopet

ఉత్తమ కథలు