హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala: ఒక కులంపై హింసాత్మక ముద్ర వేయడమే వారి లక్ష్యం.. ప్రతిపక్షాలపై సజ్జల సెటైర్లు..

Sajjala: ఒక కులంపై హింసాత్మక ముద్ర వేయడమే వారి లక్ష్యం.. ప్రతిపక్షాలపై సజ్జల సెటైర్లు..

సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala: మాచర్లలో పరిస్థితి సద్దుమణిగినా.. రాజకీయంగా వివాదం ముదురుతూనే ఉంది. తాజాగా విపక్షాల తీరుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఒక కులంపై హింసాత్మక ముద్ర వేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.. ఇంకా ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Macherla, India

Sajjala: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని మాచర్ల ఘటనపై రాజకీయ దుమారం ఆగడం లేదు. తాజాగా ఆ ఘటనపైనా.. విపక్షాల తీరుపైనే ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఒక కులంపై హింసాత్మక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది అన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అధికారంలోకి రాకుండా చూసేది పవన్ కల్యాణ్, చంద్రబాబు (Chandrababu) లు కాదన్నారు. రైతులు, వృద్ధులు, మహిళలు వద్దనుకుంటే జగన్  అధికారంలోకి రాకుండా ఆపగలుగుతారని.. కానీ వారంతా జగన్ కు అండగా ఉన్నారన్నారు. పవన్ మాట్లాడే స్క్రిప్ట్ బయట ఎక్కడో తయారవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఆంధ్రప్రదేశ్ కు రోజూ రావద్దని ఎవరు చెప్పారన్నారు. కేఏ పాల్ కూడా రావచ్చని ప్రజా శాంతి పార్టీని ఉద్దేశించి చెప్పారు.

ఎవరు ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చారు.. వారానికి ఎన్ని రోజులు ఉంటారనేది ప్రశ్న కాదన్న సజ్జల.. వచ్చి ఏమి చేస్తారనేదే ప్రశ్నగా మారుతోందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎప్పుడూ తగలబెట్టాలనే ఆలోచనలోనే ఉంటారని విమర్శించారు. మాచర్లలో చంద్రబాబు నిజ స్వరూపం బయటపడిందన్నారు.

ఇప్పటికే 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? అని ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు.. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నా ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు లేవన్న ఆయన.. మాచర్ల చంబల్ లోయ అయిందని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.. వైసీపీ కార్యకర్తలే తగుల బెట్టారని ఎలా అనుకుంటారు? నిజాలు విచారణలో తేలుతాయని స్పష్టం చేశారు. అసలు పిన్నెల్లి ఆ రోజు సీఎంవోలోనే ఉన్నారు.. గడప గడపకు కార్యక్రమంలో ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : నోరుజారారా.. కావాలనే అన్నారా.. మహానటిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న నెటిజన్లు

మాచర్లలో గొడవలను టీడీపీ వారే రెచ్చగొట్టారని ఆరోపించారు సజ్జల.. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలే ప్రధాన లబ్దిదారులుగా తెలిపారు.. టీడీపీ హయాంలో ట్రైబల్ కమిటీ కూడా వేయలేదని విమర్శించిన ఆయన.. దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్న పథకాలు రద్దు చేసే ఉండొచ్చు అన్నారు. ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించారని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యాలయానికి ఆర్టీసీ స్థలం తీసుకుంటే అవసరమైతే ఆర్టీసికి పరిహారం ఇవ్వవచ్చా అనేది చూస్తామన్న ఆయన.. ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.. పెండింగ్ లో ఉన్న సమస్యలనూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.

ఇదీ చదవండి : 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా..? అసలు తారక్ మనసులో ఏముంది..?

తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పవన్ కల్యాణ్‌ పల్లెత్తు మాట అనడంలేదని.. సినిమా అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టు పవన్ చదువుతున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా సీఎం సాయం అందిస్తున్నారని స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు