హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Clashes: శ్రీదేవిని త్వరలోనే కలుస్తా.. తాడికొండ విబేధాలపై క్లారిటీ.. అందుకే నియమించారన్న డొక్కా మాణిక్య ప్రసాద్

YCP Clashes: శ్రీదేవిని త్వరలోనే కలుస్తా.. తాడికొండ విబేధాలపై క్లారిటీ.. అందుకే నియమించారన్న డొక్కా మాణిక్య ప్రసాద్

సీఎం జగన్ ప్రక్షాళణ చేస్తున్నారా..?

సీఎం జగన్ ప్రక్షాళణ చేస్తున్నారా..?

YCP Clashes: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని ప్రధాన పార్టీలకు వర్గ పోరు తప్పడం లేదు.. ఇప్పుడు తాడికొండ వంతు వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే బహిరంగంగానే కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. ఆ వివాదంపై డొక్కా మాణిక్య వరప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తన నియామకానికి కారణం ఏంటో చెప్పారు. అయితే ప్రక్షాళణలో భాగంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  YCP Clashes: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం, వైసీపీ (YCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Janag Mohan ReddY) ముందునుంచి ఒకటే మాట్ చెబుతున్నారు.. ప్రోగ్రస్ రిపోర్ట్ పెంచుకోని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడతాని.. పని చేసిన వారికే పదవులు అంటూ చెబుతూ ఉన్నారు. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) ద్వారా ప్రోగ్రస్ రిపోర్ట్ మెరుగు పరుచుకోవాలని అవకాశం ఇచ్చారు.. అయినా కొందరిలో మార్పు కనపించలేదని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రక్షాళన మొదలెట్టారని సమాచారం. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District) తాడికొండకు అదనపు సమన్వయకర్తను నియమించడం హాట్ టాపిక్ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Undavalli Sridevi) ఉండగా.. ఎమ్మల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Varaprasad) ను అదనపు సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె వర్గం ఆగ్రహంగా ఉన్నారు. డొక్కా నియామకాన్ని వెనక్కు తీసుకోవాలని ఆందోళనలు చేపడుతున్నారు.

  ప్రక్షాళనలో భాగంగానే తాడికొండ నియోజకవర్గంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిపై అనేక వివాదాల్లో ఉన్నారు. మళ్లీ ఆమెకు టికెట్ ఇస్తే కష్టాలు తప్పవని.. ఆయన తెప్పించుకున్న నివేధికల్లో తేలినట్టు టాక్. అందుకే జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అదే నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఈ మార్పుతో.. వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ లేదనే క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది అంటున్నారు.

  సీఎం జగన్ తీరుపై నేరుగానే అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీదేవి.. కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డొక్కా పెత్తనాన్ని ఆంగీకరించేది లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ విబేధాలు.. తాజా పరిణామాలపై డొక్కా స్పందించారు.. తనకు ఎమ్మెల్యే శ్రీదేవితో ఎలాంటి విబేధాలు లేవన్నారు. కేవలం అక్కడ ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. ఆ కారణంతోనే తనకు అదనపు బాధ్యతలు ఇచ్చారని ఆయన వెల్లడించారు..

  ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా విందు.. రాజకీయమేనా? టీడీపీలో మొదలైన కలవరం

  అయితే ఈ ప్రక్షాళన ఒక్క తాడికొండకు మాత్రమే కాదు అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయని పార్టీలో ఉన్న కీలక నేతలు చెబుతున్నారు. దానికి సంబంధించి ప్రక్షాళన ప్రారంభమైందని అభిప్రాయ పడుతున్నారు. సుమారు 20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి సీఎం జగన్ అవకాశం ఇవ్వబోతున్నారని సమాచారం.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Sridevi, Ycp

  ఉత్తమ కథలు