హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Target BC: వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లే లక్ష్యం.. 8న భారీ ఎత్తున సభ.. మంత్రులు ఏం చెప్పనున్నారు అంటే?

Target BC: వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లే లక్ష్యం.. 8న భారీ ఎత్తున సభ.. మంత్రులు ఏం చెప్పనున్నారు అంటే?

బీసీ ఓట్లపై వైసీపీ ఫోకస్

బీసీ ఓట్లపై వైసీపీ ఫోకస్

Target BC: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఏడాదిన్నర లోపే జరిగే అవకాశాలు ఉన్నాయి.. దీంతో సామాజిక సమీకరణాలపై ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా గెలుపు ఓటములను డిసైడ్ చేసే.. బీసీలను ఆకర్షించే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 8 భారీ ఎత్తున సభకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Target BC: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలు రచిస్తోంది. దూకుడుగా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy).. ఇప్పటి నుంచే అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల టీంను రెడీ చేసుకునే పనిలో పడ్డారు. పలువురు అధికారులను కీలక స్థానాలకు బదిలీ చేస్తున్నారు. అలాగే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పడు జిల్లా అధ్యక్షులను.. రీజనల్ సమన్వయ కర్తల విషయంలో కీలక మార్పు చేశారు. గెలుపు గుర్రాలకు సీట్లు అని తేల్చి చెప్పేశారు. అందుకు గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapa ki Government) లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా వెళ్లారు.. ప్రజల్లో ఎంత వరకు ఉంటున్నారు అన్నదాన్ని కొలమానంగా పెట్టారు. ఇప్పుడు సామాజిక సమీకరణపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ ఓట్లను టార్గెట్ చేస్తునట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు, రెడ్డి సమాజీక ఓట్లు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా కాపు ఓట్లు ఈ సారి వ్యతిరేకంగా పడే అవకాశం ఉందని నివేదికలు అందుతున్నాయి. అదే జరిగితే బీసీ ఓట్లే గెలుపును డిసైడ్ చేసేవిగా ఉంటాయి. కాపులు ఈ సారి దూరమైనా.. బీసీలను దగ్గర చేసుకుంటే గెలుపు ఈజీ అన్నది అధినేత లెక్కగా కనిపిస్తోంది.

ఇందులో భాగంగా అధికార పార్టీ బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా.. బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సైతం హాజరయ్యే అవకాశం ఉందన్నారు.

బీసీల గురించి ఎన్నికల ముందు నుంచే ఆలోచించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని.. బీసీ వర్గాల జీవన విధానంలో మార్పులు తీసుకుని రావటానికి జగన్ ఒక డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి.. 139 బీసీ కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చి సంక్షేమ ఫలాలను అందించారన్న ఆయన.. కాలానుగుణంగా వచ్చే మార్పులను బట్టి ఇంకా ఏం చేయాలన్న అంశాలపై అధ్యయనం చేస్తాం అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటే బీసీల రాష్ట్రం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. 8వ తేదీన విజయవాడలో బీసీల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నామనా.. గ్రామ సర్పంచ్ నుంచి మంత్రుల వరకు ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. అలాగే భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలన్న మేధోమథనం చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : కన్నీరు పెడుతున్న రైతన్న.. తడిసిపోతున్న అన్నదాత కష్టం

బీసీలకు తాము చేశామని చెబుతున్న లెక్కలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.. అంతా ముఖ్యమంత్రి ఒక బటన్ నొక్కగానే వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నారు. చంద్రబాబు తన హయాంలో ఏం చేశారు? అని నిలదీశారు. తొకలు కత్తిరిస్తాం అని చంద్రబాబు అహంభావం ప్రదర్శించిన విషయాన్ని బీసీ వర్గాలు మర్చిపోవన్నారు.. 75 ఏళ్ళ భారత స్వాతంత్ర్య చరిత్రలో రాజమండ్రి ఎంపీ సీటును జగన్ మొదటి సారి ఒక బీసీ వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. దీనికి తానే ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ycp

ఉత్తమ కథలు