(అన్నా రఘు Sr.కరస్పాండెంట్ న్యూస్ 18 అమరావతి)
WPL 2023 Auction : సోమవారం ముంబై (mumbai) వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL Auction 2023) వేలం ముగిసింది. 90 స్థానాలకు కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా.. ఐదు ఫ్రాంచైజీలు కలిసి 87 మందిని కొనుగోలు చేసింది. టీమిండియా (Team India) స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana)ను అత్యధికంగా రూ. 3.40 కోట్ల ధర పలికింది. ఆమెను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్ నర్ ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్.. అంతే మొత్తానికి ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్ ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. జెమీమా రోడ్రింగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లకు) ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
అయితే గుంటూరుకు చెందిన ఝాన్సీ లక్ష్మీకి నిరాశ ఎదురైంది. ఈమెను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు అయిష్టతను వ్యక్తం చేశాయి. దాంతో ఆమె అన్ సోల్డ్ గా నిలిచింది. ఝాన్సీ తండ్రి తండ్రి భవన నిర్మాణ కూలీ. అయినా కూతురు ఝాన్సీ లక్ష్మీ టీ20 వేలం వరకు వెళ్లిందంటే గ్రేట్ అనే చెప్పాలి.
చల్లా ఝాన్సీ లక్ష్మీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. టీ20 క్రికెట్ ఆక్షన్ అర్హత సాధించింది ఝాన్సీ లక్ష్మి . దీంతో ఆమె పేరు మీడియాలో మారుమోగి పోయింది. ఏపీ తరపున ఎంపికైన లక్ష్మీ తండ్రి ఓ సాధారణ భవన నిర్మాణ కూలీ. ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ T20 ట్రోఫీలో ఆడనుంది. ఝాన్సీ లక్ష్మి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. ఆమె తండ్రి ఓ సాధారణ భవన నిర్మాణ కార్మికుడు . కుటుంబ పోషణ కోసం ఆమె ఇంటి పనులు చేయాల్సి కూడా చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆటను కొనసాగించమని తండ్రి ప్రోత్సహించాడు. ఏడు సంవత్సరాల వయస్సులో, ఆమె సమీపంలోని అకాడమీలో చేరింది. ఇక ఆ తరవాత వెనుతిరిగి చూడలేదు. 2011 వరకు, ఝాన్సీ లక్ష్మి ఎడమచేతి వాటం స్పిన్నర్. ఆమె జట్టుకు అవసరం ఉన్నందున ఆమె కుడి చేతికి మారవలసి వచ్చింది.
నేను 2011లో ఆంధ్రా తరఫున అండర్-16 ఆడుతున్నప్పుడు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్లు లేరు. కాబట్టి, నా బౌలింగ్ చేయి మార్చుకోవాలని నా కోచ్ మస్తాన్ రెడ్డి సలహా ఇచ్చారు. ఇది అంత సులభమైన ప్రక్రియ కాదని లక్ష్మి గుర్తు చేశారు. నేను గత 9 సంవత్సరాలుగా ప్రతి ఉదయం, సాయంత్రం నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసినట్టు ఆమె తెలిపారు. మెరుగైన శిక్షణ కోసం లక్ష్మీ కుటుంబం నరసరావుపేట నుంచి గుంటూరు చేరుకుంది. బాలికల హాస్టల్‌లో ఉంటూ క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించింది. తండ్రి కూతరు ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. తండ్రి 66 ఏళ్ల వృద్దుడు కావడంతో, ఇంటి పనులన్నీ లక్ష్మీ చూసుకోవాల్సి వస్తోంది. కరోనా లాక్‌డౌన్ ప్రకటించిచే ముందు సీనియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లు ఆడేందుకు లక్ష్మీ బరోడా వెళ్లారు. లాక్ డౌన్ ప్రకటనతో మరలా గుంటూరు చేరుకున్నారు. తరువాత ఒకటిన్నర సంవత్సరాలు కూలీ పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డినట్టు లక్ష్మీ తెలిపారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లక్ష్మికి కొంత సహకారం అందించింది. ధ్యానం, వ్యాయామాలు ,క్రికెట్ వ్యూహాల కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహించింది. కానీ అది అంత సులభం కాదు. మేము మా ఇళ్ల వద్ద మా ఫిట్‌నెస్ ట్రైనర్ చెప్పిన షెడ్యూల్‌ను అనుసరించేవాళ్లమని లక్ష్మీ గుర్తు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో, ఎక్కువగా ప్రభావితమైన ప్రదేశాల్లో గుంటూరు కూడా ఒకటి. దీంతో ఆమె క్రికెట్ శిక్షణ కూడా కొంత కాలం నిలిచిపోయింది. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.
ఛాలెంజర్ ట్రోఫీ, సీనియర్ T20 ట్రోఫీ
మహిళల టీ20 ట్రోఫీ సాగిన తీరు తనను నిరాశపరిచిందని లక్ష్మి తెలిపారు. అందులో లక్ష్మీ ఆట తీరు పెద్దగా ఆకట్టు కోలేదు. గెలిచినా ఓడినా లక్ష్యం కోసం నిరంతర సాధన చేయాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే మహిళల కోసం ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ని ప్రవేశపెట్టింది. ఝాన్సీ లక్ష్మి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఎంఎస్ ధోనీని అభిమానించే ఝాన్సీ.. భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గర్వంగా చెబుతోంది. కష్ట పడితే సాధ్యం కానిది ఏ ముంటుంది చెప్పండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gunturu, Sports, Team India, WPL 2023