Home /News /andhra-pradesh /

Missing Story: 38 ఏళ్ల తర్వాత అయిన వాళ్లను చేరిన మహిళ.. అత్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అల్లుడు..

Missing Story: 38 ఏళ్ల తర్వాత అయిన వాళ్లను చేరిన మహిళ.. అత్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అల్లుడు..

కుటుంబ సభ్యులతో మంగమ్మ

కుటుంబ సభ్యులతో మంగమ్మ

ఓ మహిళ చిన్నప్పుడు తప్పిపోయి దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరింది. చిన్నారిగా తప్పిపోయిన అక్క.. పెళ్లై, పిల్లల్ని కని.. వారికి పెళ్లిళ్లు చేసిన తర్వాత ఇంటికి తిరిగిరావడంతో ఆ తమ్ముళ్లు సంతోషంలో మునిగిపోయారు.

  Anna Raghu, Guntur, News18

  చిన్నవయసులో తప్పిపోవడం.. కొన్నేళ్ల తర్వాత యుక్తవయసులో తిరిగి ఇంటికి చేరడం వంటివి సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి స్టోరీలు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సాధారణంగా చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్లు పెద్దై తెలివిరాగానే ఇళ్లకు చేరుతారు. కానీ ఓ మహిళ మాత్రం చిన్నప్పుడు తప్పిపోయి దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరింది. చిన్నారిగా తప్పిపోయిన అక్క.. పెళ్లై, పిల్లల్ని కని.. వారికి పెళ్లిళ్లు చేసిన తర్వాత ఇంటికి తిరిగిరావడంతో ఆ తమ్ముళ్లు సంతోషంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.., ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రస్తుత వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం నెలివేడి గ్రామానికి చెందిన నాగన్న తారకమ్మ కు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె పేరు మంగమ్మ. మంగమ్మ చిన్నతనంలో ఆమె తండ్రి ఓ శుభకార్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడే మూడు రోజులు ఉన్నారు.

  ఐతే తల్లి తారకమ్మపై బెంగపెట్టుకున్న మంగమ్మ ఆ దిగులుతో తండ్రికి చెప్పకుండా బయటకు వచ్చేసింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో రోడ్లపై తిరుగుతున్న మంగమ్మను చూసిన ఓ యాచకుడు మీ అమ్మదగ్గరకు చేరుస్తానని చెప్పి విజయవాడ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా (Guntur District) వేమూరు మండలం జంపని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తన మాట వినడం లేదని కొట్టడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆ పాపను ఎత్తుకొచ్చాడని తెలిసి మంగమ్మను రక్షించి అతడ్ని తరిమేశారు.

  ఇది చదవండి: పెళ్లైన నెలరోజుల తర్వాత మాజీ ప్రియుడి ఫోన్... యువతి చేసిన పనికి అంతా షాక్..


  పాపను బాధ్యతను గ్రామానికి చెందిన సామేలు అనే వ్యక్తి ముందుకొచ్చాడు. తనకున్న ఆరుగురు సంతానంతో కలిపి మంగమ్మను పెంచి పెద్దచేశాడు. దాలువూరుకి చెందిన దాసు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లికూడా చేశాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఐతే చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు, తమ్ముళ్లను తలుచుకుంటూ బాధపడుతుండేది. తన కష్టాన్ని అందరికీ చెప్పుకునేది.

  ఇది చదవండి: ఇదే లాస్ట్ అండ్ ఫైనల్..! 2,500 మంది నేరస్ధులను కూర్చొబెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ...


  ఈ క్రమంలో పెద్దకుమార్తె శాంతకుమారిని యలవర్రు గ్రామానికి చెందిన కొండసీమ క్రిస్టోఫర్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లిచేసింది. ఐతే అత్త మంగమ్మ గతం తెలుసుకున్న క్రిస్టోఫర్.. ఆమెను ఎలాగైనా తనవారితో కలపాలని నిర్ణయించాడు. అనుకున్నదేతడవుగా అత్తగారు చెప్పిన వివరాలన్నీ తెలంగాణలోని తన మిత్రుడు భాస్కర్ కు చెప్పాడు. అతడి సాయంతో సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రుల వివరాలు సేకరించాడు. ఆమె తమ్ముళ్ల ఫోన్ నెంబర్లు సంపాదించాడు. వారికి ఫోన్ చేసి వివరాలు చెప్పడంతో అక్కకోసం ఆమె తమ్ముళ్లు వెంకటేష్, కృష్ణ పరుగులు పెట్టుకుంటూ యలవర్రు వచ్చారు.

  ఇది చదవండి: వీళ్లకు 20ఏళ్లుగా ఒకే శాలరీ.., జీతాలపెంపు అంటేనే వీళ్లకు తెలియదు..!


  38ఏళ్ల తర్వాత తన తమ్ముళ్లను చూసిన మంగమ్మ బోరున విలపించింది. తాను మరణించేలోపు తన తమ్ముళ్లను కలుస్తానో లేదోనని నిత్యం బాధపడే మంగమ్మకు తన అల్లుడు ఊహించని బహుమతి ఇవ్వడంతో ఆనందం పట్టలేకపోతోంది. తమ్ముళ్లకు అప్యాయంగా స్వీట్ తినిపించింది.

  మీ నగరం నుండి (​గుంటూరు)

  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Missing person

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు