హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur Woman: భర్త చనిపోవడంతో ఒంటరైన మహిళ.. తోడుకోసం అతడితో వెళ్లింది.. కానీ ఓ రోజు..!

Guntur Woman: భర్త చనిపోవడంతో ఒంటరైన మహిళ.. తోడుకోసం అతడితో వెళ్లింది.. కానీ ఓ రోజు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guntur News: తెనాలి మండలం కఠివరం గ్రామానికి చెందిన రత్తమ్మ భర్త చనిపోవటంతో బ్రతుకుతెరువుకి తెనాలి ఆటోనగర్ ప్రాంతంలోని ఒక ఫర్నిచర్ షాపులో పనిచేస్తోంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని దాచుకోవాలనే ఉద్దేశంతో చిట్టీ కట్టింది.

ధనం మూలం ఇదం జగత్ అనే మాటను ఈ సమాజంలో ముమ్మాటికీ నిజం. అన్నింటికీ డబ్బే ప్రదానం డబ్బే మూలం.. డబ్బుంటే చాలు అతడే కింగ్. డబ్బు సంపాందించేందుకు కొందరు సన్మార్గంలో కాసులు సంపాదిస్తున్నారు . మరికొందరు దురాశకు పోయి చేయకూడని పనులు చేస్తున్నారు. డబ్బు ముందు బంధాలు బంధుత్వాలు బలాదూర్ అవుతున్నాయి. దాని ముందు అయినవాళ్లు లేదు.. కానివాళ్లు లేదు.. నమ్మినవారిని కడతేర్చేవరకు వెళ్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) లో ఇలాంటి ఘటనే జరిగింది. తెనాలి మండలం కఠివరం గ్రామానికి చెందిన రత్తమ్మ భర్త చనిపోవటంతో బ్రతుకుతెరువుకి తెనాలి ఆటోనగర్ ప్రాంతంలోని ఒక ఫర్నిచర్ షాపులో పనిచేస్తోంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని దాచుకోవాలనే ఉద్దేశంతో చిట్టీ కట్టింది.

గత నెల 17న చిట్టీ పాడిన రత్తమ్మ ఆ డబ్బు తెచ్చుకునేందుకు వెళ్లింది. ఐతే ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రత్తమ్మ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా.. చివరిసారిగా సాంబయ్య అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. అతడి గురించి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రత్తమ్మకు సంగం జాగర్లమూడికి చెందిన సాంబయ్యతో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. సాంబయ్యకు గతంలో భార్య చనిపోవటంతో రెండవ వివాహం చేసుకున్నాడు చేసుకున్నాడు.

ఇది చదవండి: ఇద్దరివీ ప్రభుత్వ ఉద్యోగాలే.. చక్కగా కాపురాలు చేసుకోకుండా ఇదేం పాడుబుద్ధి..?


ఆమెపై అనుమానంతో రెండు నెలలకే ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశాడు. కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత రత్తమ్మతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ఇద్దరి మధ్య సంబంధానికి దారితీసింది. దీంతో సాంబయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. రత్తమ్మ డబ్బు తీసుకొని ఇంటికెళ్లే సమయంలో సాంబయ్య ఆమెకు ఫోన్ చేశాడు. తాను అంగలకుదురు వద్ద కౌలు పొలం వద్ద ఉన్నానని.. అక్కడి రావాలని కోరాడు. అక్కడికెళ్లిన ఆమెను దారుణంగా హతమార్చిన సాంబయ్య.. రత్తమ్మ మృతదేహాన్ని పొలంలోనే పూడ్చిపెట్టాడు. ఆమె వద్ద ఉన్న డబ్బు, హబంగారం తీసుకొని పరారయ్యాడు.

ఇది చదవండి: భర్తను అడ్డుతొలగిస్తే ఉద్యోగంతో పాటు పెన్షన్.. ప్రియుడితో కలిసి భార్య స్కెచ్.. కానీ చివర్లో ఊహించని ట్విస్ట్..


భర్త లేకపోవడంతో మరో వ్యక్తిని నమ్మిన రత్తమన్ను అతగాడు దారణంగా హతమార్చాడు. ఓ హత్య కేసులో జైలుకెళ్లొచ్చిన వాడిని నమ్మి అన్యాయంగా బలైపోయిందని రత్తమ్మ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిందితుడ్ని అదుపులోకీ తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టంకు తరలించారు. హంతకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur

ఉత్తమ కథలు