Home /News /andhra-pradesh /

GUNTUR WOMAN KILLED HER LOVER WITH THE HELP OF ANOTHER TWO LOVERS IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Affair: అమ్మో ఈమె మామూలు మహిళ కాదు.. ఒకేసారి ముగ్గురితో ఎఫైర్.. అందులో ఒకడ్ని దారుణంగా..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Affair: చాంద్ బాషా.. నిత్యం తాగొచ్చి నాగమల్లేశ్వరిని కొట్టడమే కాకుండా.. ఆమెకున్న వివాహేతర సంబంధాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి అడ్డుతొలగించుకోవాలని మల్లేశ్వరి భావించింది. వెంటనే ఆమెతో వివాహేతర సంబంధమున్న రెంటచింతల గ్రామానికి చెందిన అమరయ్య, దూళిపాళ్లకు చెందిన సుబ్బారావు సహకారాన్ని కోరింది. దీంతో ముగ్గురూ కలిసి మర్డర్ స్కెచ్ వేశారు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  వివాహబంధం ఎంతో పవిత్రమైనది కానీ నేటి సమాజం లో ప్రతి నిత్యం వివాహేతర సంబంధాల (Extramarital affair) మూలంగా అనర్థాలు తప్పవని రుజువు చేసే ఘటనలు వెలుగుచూస్తున్నా కొందరి తీరు మారడం లేదు. తాత్కాలిక సుఖాల కోసం పరాయివాళ్ల మోజులో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నవారు చాలా మందే ఉంటున్నారు. భర్త చనిపోవడంతో ఒంటరైన ఓ మహిళ.. వేరే పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని గడపాల్సింది పోయి.., దారి తప్పింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకేసారి వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిలో ఒకర్ని అంతమొందించేందుకు మరో ఇద్దరు ప్రియులతో కలిసి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణాజిల్లా జిల్లా (Krishna District) వీరులపాడుకు చెందిన నాగమల్లేశ్వరికి గుంటూరు జిల్లా (Guntur District) గురజాల మండలం అంబాపురానికి చెందిన వ్యక్తితో వివాహమైంది.

  పెళ్లైన కొన్ని రోజులకే భర్త మృతి చెందాడు. దీంతో ఆమె సత్తెనపల్లికి బంధువుల వద్దకు వచ్చి ఉపాధి నిమిత్తం హోటల్ లో పనిచేస్తుండేది. కడప జిల్లా  (Kadapa District) మైదుకూరు చెందిన చెందిన చాంద్ బాషా లారీ క్లీనర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని వదిలేసి తిరుగుతుండేవాడు. ఆలా మొదటి లాక్ డౌన్ టైంలో సత్తెనపల్లి వచ్చాడు. జీవనాధారం కోసం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లో పనికి కుదిరాడు. ఈ క్రమంలో అదే హోటల్లో పనిచేస్తున్న నాగ మల్లేశ్వరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి వాళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఐతే చాంద్ బాషాతో సహజీవనం చేస్తూనే.. మల్లేశ్వరి మాత్రం మరో ఇద్దరితో ఎఫైర్ నడుపుతోంది.

  ఇది చదవండి: పెళ్లై 9ఏళ్లైనా ప్రియుడ్ని వదలని భార్య.. భర్త నచ్చజెప్పినా వినలేదు.. చివరకి..


  ఈ క్రమంలో చాంద్ బాషా.. నిత్యం తాగొచ్చి నాగమల్లేశ్వరిని కొట్టడమే కాకుండా.. ఆమెకున్న వివాహేతర సంబంధాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి అడ్డుతొలగించుకోవాలని మల్లేశ్వరి భావించింది. వెంటనే ఆమెతో వివాహేతర సంబంధమున్న రెంటచింతల గ్రామానికి చెందిన అమరయ్య, దూళిపాళ్లకు చెందిన సుబ్బారావు సహకారాన్ని కోరింది. దీంతో ముగ్గురూ కలిసి మర్డర్ స్కెచ్ వేశారు.

  ఇది చదవండి: కూతురి పెళ్లికి అన్ని ఏర్పాటు చేసిన తండ్రి.. కానీ ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు..


  ఈ నెల 3న చాంద్ బాషాను మద్యం తాగేందుకు రైల్వేస్టేషన్ రోడ్డులోని స్టేడియం గ్రౌండ్ కు తీసుకెళ్లారు. అక్కడ చాంద్ బాషాకు బాగా మద్యం తాగించి ఆతడి గొంతు నులమడంతో పాటు చాతీపై బలంగా గుద్ది హత్య చేశారు. ఐతే స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అప్పటికే నాగమల్లేశ్వరి పరారీలో ఉండటంతో ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా చేసిన నేరం ఒప్పుకుంది. హత్యలో పాల్గొన్న మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur, Murder

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు