GUNTUR WOMAN CUTS PRIVATE PARTS OF HER MOTHERS LOVER IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Guntur Woman: తల్లి ప్రియుడి మర్మాంగం కోసిన యువతి.. ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇలా..
ప్రతీకాత్మకచిత్రం
Guntur News: అక్రమ సంబంధాలు ఖచ్చితంగా క్రైమ్ స్టోరీలుగా మారుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తల్లి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యవహారం నచ్చని కూతురు తల్లిని, ఆమెప్రియుడ్ని వ్యతిరేకించింది. ఎంత చెప్పినా తల్లి తన మాట వినకపోవడంతో ఊహించని నిర్ణయం తీసుకుంది.
అక్రమ సంబంధాలు ఖచ్చితంగా క్రైమ్ స్టోరీలుగా మారుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తల్లి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యవహారం నచ్చని కూతురు తల్లిని, ఆమెప్రియుడ్ని వ్యతిరేకించింది. ఎంత చెప్పినా తల్లి తన మాట వినకపోవడంతో ఊహించని నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని బాపట్ల జిల్లా తుమ్మలపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా (Guntur District) తెనాలికి వచ్చి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఐతనగర్ కు చెందిన ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉంటూ కూలిపనులు చేసుకుంటున్న రామచందారెడ్డి తరచూ మహిళ ఇంటికెళ్లి వస్తున్నాడు. అక్కడే ఇద్దరూ కలిసి మద్యం తాగి తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఐతే ఈ వ్యవహారం సదరు మహిళ కుమార్తెకు నచ్చలేదు.
దీనిపై తల్లితో తరచూ గొడవ పడుతుండేది. కూతురు మాట లెక్కచేయని తల్లి రామచంద్రారెడ్డితో ఎఫైర్ కొనసాగిస్తోంది. దీంతో రామచంద్రారెడ్డిపై కక్షగట్టింది. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి మహిళతో పాటు ఆమె ప్రియుడు ఫుల్లుగా మందుకొట్టి పడుకున్నారు. అదే సమయంలో ప్రియుడితో కలిసి ఇంటికొచ్చిన మహిళ కుమార్తె.. బ్లేడుతో రామచంద్రారెడ్డి మర్మాంగాన్ని కోసింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లారు. సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల తెనాలి ప్రాంతంలో ఇలాంటి నేరాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తెనాలికి చెందిన ఓ రవికిరణ్ అనే వ్యక్తి.. తన భార్య స్నేహితురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే ఓ రౌడీషీటర్ తో ఎఫైర్ నడపుతున్న ఆమె.. ఒకేసారి ఇద్దరితో రాసలీలలు సాగించింది. ఐతే తన సీక్రెట్ ప్రియుడికి తెలిస్తే చంపేస్తాడని భయపడి.. రవికిరణ్ తనను వేధిస్తున్నట్లు ప్రియుడితో చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి రవికిరణ్ ను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఫోన్ కాల్స్, ఇతర టెక్నికల్ ఆధారాలను సేకరించి మర్డర్ కేసును ఛేదించారు.
అంతకుముందు ఓ మహిళ పెళ్లికు ముందే బావతో వ్యవహారం నడపింది. తమ సుఖానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఐతే మృతుడి కాలికి ఒకే చెప్పు ఉండటంతో అనుమానించిన పోలీసులు అన్ని కోణాల్లో అరాతీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.