హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cheating Woman: మోసానికి మేకప్ వేస్తే ఈమెలాగే ఉంటుందేమో.. పెళ్లిపేరుతో సర్వం దోచేసింది..

Cheating Woman: మోసానికి మేకప్ వేస్తే ఈమెలాగే ఉంటుందేమో.. పెళ్లిపేరుతో సర్వం దోచేసింది..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) కు చెందిన ఓయవకుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 2017లో పెళ్లి కోసం పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన ఓ యువతి.. సదరు వ్యక్తికి ఫోన్ చేసి ఇష్టపడుతున్నానని చెప్పింది.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Guntur, News18

  పెళ్లి. ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి చేసుకొని భార్య, పిల్లలతో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకన్నాడు. ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొవాలని భావించాడు. ఈ క్రమంలో వధువు కావలెను అని మ్యాట్రిమోనిలో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసి కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు అతడ్ని సంప్రదించారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి కూడా యువకుడ్ని సంప్రదించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత అతడి వద్ద అందినకాడికి దోచేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కు చెందిన ఓయవకుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 2017లో పెళ్లి కోసం పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాడు.

  ఈ ప్రకటన చూసిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి.. సదరు వ్యక్తికి ఫోన్ చేసి ఇష్టపడుతున్నానని చెప్పింది. ఇలా వారి పరిచయం రోజూ ఫోన్లో మాట్లాడుకునేవరకూ వెళ్లింది. ఓ మంచి టైమ్ చూసిన యువతి తనకు అనారోగ్యంగా ఉందని ట్రీట్ మెంట్ కోసం అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగింది. అప్పటికే ఆమె మెత్తని మాటల మాయలో పడ్డ యువకుడు. వెంటనే రూ.12 లక్షలు ఆమె ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఒంగోలులోని తన పిన్నికి అత్యవసరంగా డబ్బు కావాలని రూ.15లక్షలు ఇస్తే మళ్లీ తిరిగిస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను నమ్మిన యువకుడు అడిగినంత ఇచాడు. ఇలా మొత్తం రూ.27లక్షల రూపాయలను అతడి వద్ద నుంచి దోచేశారు. గత ఏడాది జూలై నుంచి అతడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశారు.

  ఇది చదవండి: వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ టాలీవుడ్ నిర్మాత.. బాధితుల్లో మాజీ ఎంపీ బంధువు..?

  అమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో యువకుడు సొంతగా ఎంక్వైరీ చేయగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. తనతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానన్న యువతికి అప్పటికే పెళ్లైపోయినట్లు గుర్తించాడు. తనను మోసం చేసిన విషయంపై ఆమెను నిలదీయగా.. జరిగిన విషయాన్ని భర్తకు చెబితే చంపేస్తానని బెదిరించింది.

  ఇది చదవండి: ప్రియురాలితో 11ఏళ్లు సహజీవనం.. అర్ధరాత్రి తలుపులు మూసి ఆమెతో పాటు ఆమె కూతురిపై..

  ఇలా ఇయితే న్యాయం జరగడం లేదని భావించిన యువకుడు.. తాను మొదట డబ్బులు వేసిన ఎకౌంట్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సంపాదించి యువతి భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అతడు కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో తాను పూర్తిగా మోసపోయానని భావించిన యువకుడు.. డయల్ యువర్ఎస్పీ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ విశాల్ గున్నీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన ఎస్పీ.. సదరు యువతిపై చీటింగ్ కేసు నమోదు చేయడంతో పాటు ఎకౌంట్లను ఫ్రీజ్ చేసి డబ్బులు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Guntur, Love cheating

  ఉత్తమ కథలు