హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Affair: భర్తకంటే వాడే ఎక్కువనుకున్నావ్.. కానీ వాడు నిన్నే లేకుండా చేశాడు కదమ్మా..!

Affair: భర్తకంటే వాడే ఎక్కువనుకున్నావ్.. కానీ వాడు నిన్నే లేకుండా చేశాడు కదమ్మా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guntur Woman: వివాహ బంధాలను అపహాస్యం చేస్తూ ఏర్పడుతున్న అక్రమ సంబంధాలు ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. హాయిగా భర్త పిల్లలతో జీవించకుండా క్షణిక సుఖాలకు అలవాటు పడిన ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది.

Anna Raghu, News18, Amaravati

వివాహ బంధాలను అపహాస్యం చేస్తూ ఏర్పడుతున్న అక్రమ సంబంధాలు ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. హాయిగా భర్త పిల్లలతో జీవించకుండా క్షణిక సుఖాలకు అలవాటు పడిన ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. వాలంటీర్ గా పనిచేస్తూ వేరే వ్యక్తికి దగ్గరైంది. చివరికి అతడికే బలైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని బాపట్ల జిల్లా (Bapatla District) వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద (27)ను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2008లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద స్థానికంగా వాలంటీర్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన ఎం.పద్మారావు అనే వ్యక్తితో ఆమెకు నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది.

ఐతే శారద వ్యవహారం ఆరు నెలల క్రితం భర్తకు తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో శారద పద్మారావుకు దూరంగా ఉంటోంది. ఐతే శారద కోపంతో ఉన్న పద్మారావు గ్రామ సచివాలయం వద్దనే ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ విషయంపై అప్పట్లో సచివాలయం మహిళా పోలీసు వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని మందలించి వదిలేశారు. అప్పచి నుంచి శారదపై ద్వేషం పెంచుకున్న పద్మారావు ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు శుభ్రం చేస్తున్న సమయంలో కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. తప్పించుకోబోయిన శారదను కొద్ది దూరం వెంబడించి.. మెడను కత్తితో కోసి పరారయ్యాడు.

ఇది చదవండి: పెన్షన్ కోసం ఎంత నాటకమాడింది..? భర్తకే డెత్ సర్టిఫికెట్ ఇచ్చింది మహాతల్లి..!


తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన శారద.. ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నడిరోడ్డుపైనే హత్య జరిగిన విషయం తెలుసుకున్న వేమూరు పోలీసులు, చుండూరు సీఐ కల్యాణ్‌రాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. శారద, పద్మారావు మధ్య వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో ఆమె దూరంగా ఉంచడం, శారద ప్రవర్తనపై అనుమానంతోనే పద్మారావు హత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది చదవండి: వీడిన అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ.. గోడదూకి ఎక్కడికెళ్లారంటే..!


ఇదిలా ఉంటే ఇటీవల తెనాలి సమీపంలో ఇలాంటి ఘటనే జరిగింది. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఐతే అతడ్ని దూరంపెట్టి.. మరో యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. చివరికి రెండో వ్యక్తితోనూ విభేదించి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. దీంతో ఇద్దరు ప్రియులు కలిసి ఆమె మర్డర్ కు స్కెచ్ వేశారు. లంక పొల్లాల్లో పనికి వెళ్లిన సమయంలో వెంటాడి కత్తితో దాడి చేసి ఆమెను దారుణంగా హత్య చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur

ఉత్తమ కథలు