హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR: 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా..? అసలు తారక్ మనసులో ఏముంది..?

Jr NTR: 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా..? అసలు తారక్ మనసులో ఏముంది..?

జూనియర్ ఎన్టీఆర్ కు కమలం గాలం

జూనియర్ ఎన్టీఆర్ కు కమలం గాలం

Jr NTR: జూనయర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఆయనను వదలడం లేదు. మరోసారి ఆయన చుట్టూ చర్చ జరుగుతోంది. అందుకు ప్రధాన కారణంగా తారకరత్న చేసిన వ్యాఖ్యలే.. తమ్ముడు వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నాడని ఆయన చెప్పడంతో ఈ చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ మనసులో ఏముంది..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Jr NTR: తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పదే పదే చెబుతున్నారు. అయినా నిత్యం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశగానే ఉంటున్నారు. ఆయన సెంట్రిక్ గానే రాజకీయాలు జరుగుతున్నాయి.  చాలా రోజుల నుంచి ఇటు తెలుగు దేశం పార్టీ (Telugud Desam Party) నాయకులు.. కేడర్ ను.. అటు నందమూరి అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. తారక్ (Tarak) టీడీపీ (TDP) కి మద్దతుగా ఉన్నారా..? తాత పెట్టిన పార్టీని ఎప్పటికీ వదిలేదు అన్న యంగ్ టైగర్.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సైతం ఇటువైపు చూడడం లేదు. అంతెందుకు తాత ఎన్టీఆర్ పైనా.. మామ చంద్రబాబు (Chandrababu) పైనా.. బాబాయ్ బాలయ్య (Balayya) పైనా విపక్షాలు ఘాటు విమర్శలు చేస్తుంటే జూనియర్ చాలా లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయనకు టీడీపీ పెద్దలకు మనస్పర్థలు ఉన్నాయని.. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీకి ప్రచారం చేసే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తారక్ ప్రచార బరిలో దిగేందుకు సిద్ధమయ్యారా..?

2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్…రాజకీయాలకు దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ప్రచారం చేశారు.. యాక్సిడెంట్ అయినా సరే హాస్పిటల్ బెడ్ మీద నుంచి పార్టీ కోసం ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ రాజకీయాలకు దూరమయ్యారు. మళ్ళీ టీడీపీ వైపు రాలేదు. ఇటు చంద్రబాబు సైతం ఎన్టీఆర్‌ని దూరం పెట్టారనే టాక్ ఉంది.

మరోవైపు ఆయనకు రాజకీయాల్లో అత్యంత సన్నిహితులు కొడాలి నాని , వల్లభనేని వంశీలు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో జూనియర్ పరోక్షంగా చంద్రబాబుని దెబ్బకొట్టడం కోసం జగన్‌కు మద్ధతు ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. కానీ ఏదేమైనా గాని మెజారిటీ ఎన్టీఆర్ అభిమానులు జగన్ వైపే ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక..పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. టీడీపీలోనే ఈ వాదన గట్టిగానే వినపడింది. చంద్రబాబు ముందే కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలి అంటూ డిమాండ్ చేశారు. కానీ బాబు ఎలాగోలా మళ్ళీ పార్టీని గాడిలో పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు వినిపించడం లేదు.

ఇదీ చదవండి : నోరుజారారా.. కావాలనే అన్నారా.. మహానటిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న నెటిజన్లు

అయితే అప్పుడప్పుడు కొడాలి నాని, వంశీలు మాత్రం ఎన్టీఆర్ పేరు తీస్తున్నారు. బాబు కావాలని ఎన్టీఆర్‌ని తోక్కేస్తున్నారని మాట్లాడుతూ…ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు వైసీపీకి పడేలా చేయడానికి చూస్తున్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ సైతం.. టీడీపీకి అనుకూలంగా ఏమీ మాట్లాడడం లేదు. కీలక అంశాల విషయంలోనూ ఘాటుగా స్పందించడం లేదు. నారా భువనేశ్వరిని అవమానించిన విషయంలో కానీ.. హెల్త్ యూనివర్శిటికీ ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో కానీ ఎన్టీఆర్ ఘాటుగా స్పందిస్తారని చూసినా.. నిరాశే ఎదురైంది. జగన్ కు కానీ.. ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడడం లేదు. దీంతో ఆయన 2024 ఎన్నికలకు దూరంగా ఉంటారనే ప్రచారం ఉంది..

ఇదీ చదవండి : అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్.. పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన కేంద్రం

కానీ ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తారక రత్న.. తమ్ముడే సరైన సమయంలో టీడీపీ కోసం పని చేస్తాడని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేస్తారని.. తాను బరిలో దిగుతున్నా అంటూ మాట్లాడారు.. అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడిన తరువాతే ఈ వ్యాఖ్యలు చేశారా.. లేదా మీడియా అడిగిందని సమాధానం దాట వేయలేక అలా మాట్లాడారా అన్నది తెలియాల్సి ఉంది. నిజంగా తారక్ ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చి ఉంటే కచ్చితంగా బరిలో దిగుతారు.. కానీ ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం.. ఇప్పట్లో జూనియర్ రాజకీయాలవైపు చూసే అవకాశం లేదనే చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Jr ntr, Taraka Ratna, TDP

ఉత్తమ కథలు