హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అమరావతి టు అరసవల్లి..! రాజధాని రైతుల పాదయాత్ర2కు బీజేపీ మద్దతిస్తుందా..?

అమరావతి టు అరసవల్లి..! రాజధాని రైతుల పాదయాత్ర2కు బీజేపీ మద్దతిస్తుందా..?

అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ సపోర్ట్ ఇస్తుంది..

అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ సపోర్ట్ ఇస్తుంది..

గత కొంతకాలంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రాష్ట్ర రాజధాని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. మరి ఈతరుణంగా బీజేపీ (BJP) స్టాండ్‌ ఎటువైపు ఉండనుంది. అమరావతి రాజధాని (AP Capital Amaravathi) రైతులు చేపట్టబోతున్న పాదయాత్రకు మద్దతిస్తుందా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Sumanth, News18, Guntur

  గత కొంతకాలంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రాష్ట్ర రాజధాని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. మరి ఈతరుణంగా బీజేపీ (BJP) స్టాండ్‌ ఎటువైపు ఉండనుంది. అమరావతి రాజధాని (AP Capital Amaravathi) రైతులు చేపట్టబోతున్న పాదయాత్రకు మద్దతిస్తుందా? రాజధాని గ్రామాల్లో పాదయత్ర చేసి అమరావతికి మద్దతిచ్చిన పార్టీ పాదయాత్ర-2కు ఏ మేరకు మద్దతిస్తుందనేది చర్చనీయాంశమైంది..! అమరావతి రాజధాని అంశం అత్యంత్య కీలకంగా మారింది. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకు జై కొట్టింది. దీంతో అప్పటినుంచి అమరావతినే రాజధానిగా ప్రకటించాలంటూ ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో కూడా న్యాయస్థానం టు దేవస్థానం అంటూ తిరుమలకు అమరావతి రైతులు పాదయాత్ర చేశారు.

  రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఈ పాదయత్రకు మద్దతిచ్చి యాత్రలో పాల్గొన్నాయి. అయితే బిజెపి రైతులు మాత్రం పాదయాత్రను చూసి చూడనట్లుగా వదిలేసింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. అమరావతికే మద్దతివ్వాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అందుకే అప్పటి నుంచి బీజేపీ నేతలు అమరావతి రాజధానిగా ఉండాలనే అంశం వచ్చినప్పుడల్లా ముందుంటున్నారు. కావలిలో రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు.

  ఇది చదవండి: మా ఇంట వేడుక‌.. మీరంతా జ‌న‌సేన‌కు అండ‌గా. ! అభిమాని ఆలోచనకు జనసైనికులు ఫిదా..!

  అయితే తమకు మద్ధతిస్తున్న బీజేపీని మాత్రం రాజధాని ప్రాంత రైతులు అంతగా విశ్వసించడం లేదట. ఈ నేపథ్యంలోనే గత నెలలో వారం రోజుల పాటు జిల్లా బిజెపి నాయకత్వం రాజధాని గ్రామాల్లో పాదయాత్ర చేసినా రైతులు చూసిచూడనట్లు వ్యవహరించారు. కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తం అయినా బీజేపీ నాయకులు మాత్రం అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మరోసారి పాదయాత్ర చేసేందుకు అమరావతి రైతులు సిద్దమయ్యారు.

  ఇది చదవండి: వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్ చదువుకున్నది ఇక్కడే..! ఆ విద్యాలయం ఇప్పుడెలా ఉందంటే..!

  అమరావతి టు అరసవల్లి పేరుతో సెప్టెంబర్‌ 12 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అరవై రోజుల పాటు ఆరు జిల్లాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ పాదయాత్రకు బిజెపి మద్దతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రకటనతోనే సరిపెడతారా లేక ముఖ్య నేతలెవరైనా రైతుల పాదయాత్రలో పాల్గొని మద్ధతిస్తారా? అని రైతులు చర్చించుకుంటున్న పరిస్థితి రాజధానిలో నెలకొంది.

  ఇది చదవండి: ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

  కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటే రాజధాని తరలింపు నిలిచిపోతుందనే ఆలోచనలో రాజధాని రైతులున్నారు. మరోవైపు రాజధాని పాదయాత్ర2కు అండగా ఉండటం ద్వారా బిజెపి తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర సమావేశాల్లో మద్దతివ్వాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా పార్టీ నేత బిట్ర శివన్నారాయణను పాదయాత్రకు కోఆర్డినేటర్‌గా నియమించారు. ఆయా జిల్లాల్లో పాదయాత్ర ప్రవేశించినప్పుడు స్థానిక బీజేపీ నేతలు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నారట.

  ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ శ్రేణులకు స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి మద్దతివ్వడంపై రైతులు పైకి సంతోషంగా ఉన్నా కేంద్రం జోక్యం చేసుకోవాలని మాత్రం కోరుతున్నారు. పాదయాత్ర-2 తో మరోసారి రాజధాని అంశాన్ని బలంగా చాటాలనుకుంటున్న జేఏసీ నేతలకి బిజెపి ఏమాత్రం మద్దతిస్తుందన్న అంశం త్వరలోనే తేలనుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Amaravathi, Andhra Pradesh, Local News

  ఉత్తమ కథలు