Home /News /andhra-pradesh /

GUNTUR WIFE KILLED HUSBAND FOR EXTRAMARITAL AFFAIR IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Extramarital Affair: ఎనిమిదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. కానీ అతడితో పరిచయం ఆమె జీవితాన్ని మార్చెేసింది.. చివరికి భర్తను కూడా..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Affair: భార్యాభర్తల బంధం అంటే చాలా పవిత్రమైనది. ఈ బంధానికి ప్రేమ, నమ్మకాలే పునాదులు. ఇద్దర్లో ఏ ఒక్కరు తప్పుచేసినా జీవితం సర్వనాశనమవుతుంది. మూడుముళ్ల బంధాన్ని అపహాస్యం చేస్తున్న కొందరు.. తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతూ జీవిత భాగస్వామిని బలితీసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  భార్యాభర్తల బంధం అంటే చాలా పవిత్రమైనది. ఈ బంధానికి ప్రేమ, నమ్మకాలే పునాదులు. ఇద్దర్లో ఏ ఒక్కరు తప్పుచేసినా జీవితం సర్వనాశనమవుతుంది. మూడుముళ్ల బంధాన్ని అపహాస్యం చేస్తున్న కొందరు.. తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతూ జీవిత భాగస్వామిని బలితీసుకుంటున్నారు. అక్రమ సంబంధాల (Extramarital affair) మోజులో పడి దేవుడి ముడివేసిన బంధాన్ని మంటగలుపుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. ప్రేమకు గుర్తుగా పుట్టిన పిల్లలున్న ఓ వివాహిత.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడిని కడతేర్చింది. పాపం పండి ప్రియుడితో సహా పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) మంగళగిరి మండలం తాడేపల్లికి చెందిన నాగరాజు నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన షెమా సోనీని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల దంపతులిద్దరూ పొన్నూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో వీరు నివశిస్తున్న కాలనీలో ఉండే ఓ యువకుడితో సోనీకి పరిచయం ఏర్పడింది.

  ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఐతే తమ సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సోనీ.. ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. ఈ నెల ఏడవ తేదీన నాగరాజును సోని, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలోని కాలువలో పడేశారు.

  ఇది చదవండి: లోన్ కోసం అన్నాచెల్లెల్లుగా మారిన భార్యాభర్తలు.. ఈ కిలాడీ కపుల్ మామూలోళ్లు కాదు..


  అనంతరం ఇంటికి వచ్చిన సోనీ తన భర్త కనిపించడం లేదంటూ హడావిడి చేసింది. ఐతే నాగరాజు బంధువులు మాత్రం తొలి నుంచీ సోనీపైనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రియుడి మోజులోనే నాగరాజును సోనీనే హత్య చేసిందని వారు ఆరోపించారు. దీంతో పోలీసులు కూడా అక్రమ సంబంధం కోణంలోనే దర్యాప్తు చేసి సోనీని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. హత్య చేసిన తీరు.. బాడీని మాయం చేసిన విషయాన్ని వివరించగా పోలీసులు కాలువలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  ఇది చదవండి: అల్లుడి తమ్ముడితో అక్రమ సంబంధం..ఇద్దరి మధ్య గొడవ.. ఇంతలోనే అనూహ్య ఘటన..


  ఇటీవల గుంటూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమెతో పెళ్లికి అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా గుడిలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప జన్మించింది. ఈ క్రమంలో భార్య తమ్ముడి వ్యాపారనికి రూ.48 లక్షల అప్పుకు షూరిటీ ఇచ్చాడు. అతడు డబ్బులు చెల్లించకపోవడంతో ఒత్తిడికి గురవడంతో పక్షవాతం వచ్చింది.

  ఇది చదవండి: ఆమెకు భర్త లేడు.. అతడికి భార్యలేదు.. ఇద్దరికీ మిస్డ్ కాల్ పరిచయం.. ఓ అర్ధరాత్రి షాకింగ్ ఘటన  దీంతో వ్యాపారం కూడా మూలనబడింది. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన భార్య.. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాదు మంచాన ఉన్న భర్తను వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోంది. ప్రేమ పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా చేరదీయడం మానేశారు. దీంతో అతడు ఒంటరివాడయ్యాడు. షూరిటీగా ఉన్న అప్పు చెల్లించకపోగా, తనకు అన్యాయం చేసి కుమార్తెను తీసుకొని వెళ్లిపోయిన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు