హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: మీరు మారిపోయారు.. అవును నిజమే.. ఆయన ఈయనేనా అంటూ ఆశ్చర్యం..

Kodali Nani: మీరు మారిపోయారు.. అవును నిజమే.. ఆయన ఈయనేనా అంటూ ఆశ్చర్యం..

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

Kodali Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని మారిపోయారా.? మరి ఈ మార్పుకు కారణం ఏంటి..? అసలు మైక్ ముందుకు వస్తే.. చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్..లపై ఓ రేంజ్ లో విరుచుకుపడడం ఆయన స్టైల్.. బూతులు కూడా ప్రాసల్లా వచ్చేస్తాయి.. అలాంటి నేత తాజాగా మాట్లాడిన తీరు చూసి.. ఆయన ఈయనేనా.. మీరు మారిపోయార్ సార్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP) లో ఎందరు నేతలు ఉన్నా..? కొడాలి నాని (Nani)ది ప్రత్యేక గుర్తింపు.. మంత్రిగా ఉన్నప్పుడే కాదు.. మాజీ మంత్రి అయినా.. అదే దూకుడు కనిపించే వారు. చాలామంది మాజీలు అయిన తరువాత.. సైలెంట్ అయితే.. కొడాలి నాని (Kodali Nani) మాత్రం ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేవారు. మైక్ ముందుకు వస్తే చాలు తిట్ల దండకం అందుకోవడం ఆయన స్టైల్.. అదే ఆయన్ను వైసీపీ (YCP) లో హీరోలా చేసింది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఇద్దరి పేర్లు ఎత్తితే బూతుల దండకం మొదలెటడతారు.. అన్‌స్టాపబుల్ గా పంచ్ లు.. ప్రాసలతో విరుచుకుపడుతూ ఉంటారు.

  గత పది రోజు ముందు వరకు ఆయన తీరు అదే.. సందర్భం ఏదైనా.. సమయం ఎప్పుడైనా.. స్పాట్ ఎక్కడైనా.. మైక్ ముందుకు వచ్చారు అంటే చంద్రబాబు, లోకేషల్ లపై ఓ రేంజ్ లో విరుచుకుపడడమే ఆయన నైజం.. అలాంటి నాని ఇప్పుడు మారిపోయారా..? సాధు జంతువు అయ్యారా..? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చిన దగ్గర నుంచి.. నిన్నటి దసరా వరకు అసలు మౌనం పాటించారు. ఆయన వాయిస్ ఎక్కడా వినిపించ లేదు. దీంతో ఆయన కామెంట్ల కోసం అంతా ఎదరు చూస్తున్న సమయంలో షాక్ ఇచ్చారనే చెప్పాలి..

  ద‌స‌రా సందర్భంగా కృష్ణా జిల్లా గుడ్లవ‌ల్లేరు మండ‌లం వేమ‌వరంలోని కొండాల‌మ్మ అమ్మ వారి ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నాని.. దాదాపు రెండు వారాల తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడారు.. కానీ ఎప్పుడు లేనంతగా చాలా సాఫ్ట్ గా మాట్లాడారు.. ఒక్క నేతపైనా విమర్శలు చేయలేదు. ఆయన మాటల్లో దూకుడు కనిపించ లేదు.. మాట్లాడాలి కదా అని మాట్లాడినట్టు వేదంత ధోరణిలో మాట్లాడారు.. ఒక్క తిట్టు లేదు.. ఒక్క పంచ్ డైలాగ్ లేదు. దీంతో ఆయన మాటలు విన్నవారంతా మీరు మారిపోయారు అంటున్నారు.

  ఇదీ చదవండి : సీఎం సీఎం అంటూ కోలాహలం.. సందడిగా బావతో బాలయ్య టాక్ షో.. మంత్రుల సెటైర్లు.. ఏమన్నారంటే?

  ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? త‌మ ప్రభుత్వం తీసుకున్న 3 రాజ‌ధానుల నిర్ణయానికి అమ్మవారి ఆశీస్సులు దక్కాలని మొక్కుకున్నట్టుగా తెలిపారు. హైద‌రాబాద్‌ను కోల్పోయి తామంతా అనాథలమయ్యామని.. శ్రమంతా కేవలం అమరావతిపైనే పెడితే, మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆ దుస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

  ఇదీ చదవండి : వర్షంలోనూ రక్తసిక్తంగా దేవరగట్టు.. కర్రల సమరంలో 70 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

  రెక్కాడితే గానీ డొక్కాడ‌ని ప‌రిస్థితుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలు ఉన్నాయని.. ఆ ప్రాంతాల ప్రజల కోసమే సీఎం వైఎస్ జగన్ ఎంతో ఆలోచించి, మూడు రాజధానులు నిర్మించాలని డిసైడ్ అయ్యారని కొడాలి నాని తెలిపారు. ఇదే సమయంలో.. అమరావతి ఉద్యమాన్ని తప్పుపట్టారు. ఆ ఉద్యమాన్ని ప్రజలతో పాటు దేవుళ్లు కూడా హర్షించరని వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోస‌మో కాకుండా… రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్ర ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేయకూడదన్న భావనతోనే సీఎం జ‌గ‌న్ 3 రాజ‌ధానుల నిర్ణయం అన్నారు.

  ఇదీ చదవండి : ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.. ఈ సారి ఎన్ని లడ్డూలు విక్రయించారు?

  అయితే ఇదే విషయంలో గతంలో ఎన్నాసార్లు ఆయన మాట్లాడారు.. కానీ అప్పుడు అమరావతి రైతులను.. టీడీపీ నేతలను ఓ రేంజ్ లో తిట్టారు.. నాన్ స్టాప్ గా.. వారిపై పంచ్ లు వేశారు.. సన్నాసి.. దద్దమ్మ అని ఆగకుండా వాడలేని భాష కూడా వాడారు. కానీ ఇప్పుడు ఆ ఫైర్ కనిపించలేదు.. చాలా సాఫ్ట్ గా మాట్లాడారు.. అయితే దేవుడి సన్నిధి నుంచి వచ్చారు కాబట్టి అలా మాట్లాడరేమో అనుకోవడానికి లేదు.. ఎందుకంటే గతంలో తిరుమల శ్రీవారి దర్శనం చేసకున్న తరువాత..? విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధి నుంచి బయటకు వచ్చిన తరువాత.. చంద్రబాబును తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి..

  ఇదీ చదవండి : సీఎం సీఎం అంటూ కోలాహలం.. సందడిగా బావతో బాలయ్య టాక్ షో.. మంత్రుల సెటైర్లు.. ఏమన్నారంటే?

  అయితే ఆయనలో ఈ మార్పుకు కారణం ఏంటనే చర్చ మొదలైంది.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయం ఆయనకు నచ్చలేదని.. అప్పటి నుంచే ఆయన సైలెంట్ అయ్యారన్నది బహిరంగ రహస్యమే.. ఆయన ఆయనకు ఓట్లు వేసి గెలిపించే వారిలో ఎన్టీఆర్ అభిమానులు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు సైతం భారీగా నే ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. ఇది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే భయంతోనే ఆయన సైలెంట్ అయ్యారని.. ఇలా మారినట్టు కనిపిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Kodali Nani, Ycp

  ఉత్తమ కథలు