హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vundavalli Sridevi: మొన్నటి వరకు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంది? ఇప్పుడేమైంది? అసలు సమస్య ఏంటి?

Vundavalli Sridevi: మొన్నటి వరకు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంది? ఇప్పుడేమైంది? అసలు సమస్య ఏంటి?

ఉండవల్లి శ్రీదేవీ (ఫైల్)

ఉండవల్లి శ్రీదేవీ (ఫైల్)

Vundavalli Sridevi: మొన్నటి వరకు ఆమె సీఎం జగన్ కు వీరాభిమాని.. సమయం దొరికతే చాలు జగన్ భజన చేసేవారు.. గుండె కోస్తే జగన్ జగన్ అని కొట్టుకునేది అంటూ వైరల్ కామెంట్లు చేశారు.. కానీ ఇంతలో ఏమైంది.. అధినేత ఆదేశాలను కాదని క్రాస్ ఓటు వేశారా..? అమె భవిష్యత్తు ప్లాన్ ఏంటి..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Vundavalli Sridevi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ఏడాది అధికార పార్టీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. చాలామంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు (YCP Leaders) పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (MLC Elections Result) ఊహించని షాక్ ఇచ్చాయి.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో (Graduate MLC Elections Result) మూడింటికి మూడు టీడీపీ నెగ్గింది అనే షాక్ నుంచి తేరుకునే లోపే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలు రివర్స్ షాక్ ఇచ్చాయి.. టీడీపీ బలం 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే..? 23 ఓట్లు వచ్చాయి. అయితే అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridahar Reddy) లు ఓట్లు టీడీపీకే పడ్డాయి అనే ప్రచారం ఉంది. మరి ఆ మిగిలిన రెండు ఓట్లు వైసీపీ ఎమ్మెల్యేలు వేసినవి.. అది కూడా ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓట్లు కూడా ప్రతిపక్షానికే పడ్డాయి అన్నది వైసీపీ పెద్దల వాదన.. అందుకే ఆ నలుగుర్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మిగిలిన ముగ్గురు రాజకీయంగా చాలా సీనియర్లు.. తమకంటూ ప్రత్యేక బలగం ఉంది.. వ్యక్తిగతంగా కేడర్ బలంగానే ఉంది. పార్టీలు మారినా.. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా..? గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదా చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుగోల స్టామినా ఉన్నవారా.. నియోజకవర్గం మొత్తం వారి ప్రభావం ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ శ్రీదేవి పరిస్థితి వేరు.. ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు.. ఆమె విజయంలో జగన్ ప్రభావం కూడా ఉంది. ఆ విషయం ఆమె పలుసార్లు చెప్పారు. అందుకే నెగ్గిన తరువాత ఆమె జగన్ కు వీరాభిమానిగా మారారు. ఎంతలా అంటే జగన్ భజనం చేయడంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటోంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కూడా..

మరి అంతలా జగన్ ను అభిమానించే ఉండవల్లి శ్రీదేవి.. అధినేత చెప్పిన మాటను ఎందుకు ధిక్కరించారు..? అసలు అధినేతో ఆమెకు వచ్చిన సమస్య ఏంటి..? ఇటీవల సీఎం జగన్ 150 ఆమంది ఎమ్మెల్యేల రిపోర్ట్ ను ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు..? ఎవరిపై వ్యతిరేకత ఉంది.. ఎవరు నెగ్గడం కష్టం అంటూ లెక్కలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటు. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారికి సీటు ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక శ్రీదేవి విషయానికి వస్తే ఆమె నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత ఉంది. వివాదాస్పద ఆడియాలు కూడా బయట పడ్డాయి. సొంత అనుచరులతోనే విబేధాలు వచ్చాయి. వీటన్నంటికీ తోడు ఆ నియోజవర్గం రాజధాని పరిధిలో ఉంది. అక్కడ అధికార పార్టీ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి సమయంలో వచ్చే ఎన్నికల్లో నెగ్గాలి అంటే.. శ్రీదేవికి ఉన్న రాజకీయ అనుభంతో కష్టమే అని అధినేత అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఆమెను ఇంఛార్జ్ గా తప్పించారు. ప్రస్తుతం డొక్కా మాణిక్యరావు అక్కడి బాధ్యతలు చూస్తున్నారు. అప్పటి నుంచి అధినేత నిర్ణయంపై శ్రీదేవి గుర్రుగా ఉన్నారు.

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని అనుమానం రావడంతో.. ఆమెను పిలిపించారు జగన్.. తాడికొండ రాజధాని ప్రాంతంలో ఉండడంతో.. సీటు ఇచ్చేది లేదని.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన హామీని శ్రీదేవి పరిగణలోకి తీసుకోలేదన్నది వైసీపీ వర్గాల మాట.. అందుకే ఆమె పార్టీ లైన్ ను దాటి క్రాస్ ఓటు వేశారని చెబుతున్నారు. ఆమె తాను క్రాస్ ఓటు వేయలేదని చెబుతున్నా.. అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఫిక్స్ అయ్యి.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఆమె ఇప్పటికే టీడీపీ అధినేతతో మాట్లాడరని.. త్వరలో పార్టీలో చేరే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆమెకు సీటుపై చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆమె ఫ్యూచర్ కాస్త డయలమాలో పడింది..

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap mlc elections, AP News, AP Politics, Vundavalli sridevi

ఉత్తమ కథలు