హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: రైతులకు బిగ్ అలర్ట్.. ఆ పథకాలు పొందాలి అంటే.. ఈ నెల 12 వరకే గడువు.. కేవైసీ ఇలా చేసుకోండి

Good News: రైతులకు బిగ్ అలర్ట్.. ఆ పథకాలు పొందాలి అంటే.. ఈ నెల 12 వరకే గడువు.. కేవైసీ ఇలా చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Good News: ఏపీ సర్కార్ రైతుల కోసం అనేక పథకాలు అందిస్తోంది. అయితే ఆ పథకాలకు అర్హత ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఇకపై పథకాలు సక్రమంగా మీకు అందాలి అంటే..? తప్పనిసరిగా కేవైసీపీ పూర్తి చేయాలి.. అందుకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు విధించారు..? కేవైసీపీ ఎలా పూర్తి చేయాలి అంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రైతులకు (Farmers) బిగ్ అలర్ట్.. ఇకపై పంటల బీమా, లేక ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ (E Kyc) కోసం 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ (Harikiran) ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ–కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ వరకు పరిశీలిస్తారు. తరువాత ఆ జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని అధికారులు స్ప్టష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖరీఫ్‌ సీజన్‌లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్‌వో కలిపి 90 శాతం ఈ–క్రాప్‌ను ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. రైతులందరికీ తమ మొబైల్‌ నంబర్‌కు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్‌ రూపంలో పంపుతున్నామని వివరించారు.

  ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా వారికి వెంటనే అందిస్తారు. మరోవైపు ఏపీలో రైతుల కోసం రబీ విత్తనాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను సీజన్‌కు ముందే రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) సిద్ధంచేశారు. వీటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు.

  కర్నూలు , నంద్యాల ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు శనగ, చిరుధాన్యాల విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ రెండు జిల్లాల్లో 1,600 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధంచేశారు. మిగిలిన జిల్లాల్లో 15వ తేదీ నుంచి అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేస్తారు. రబీలో 58.67 లక్షల ఎకరాల్లో సాగు చేయాల ని లక్ష్యంగా నిర్దేశించారు.

  ఇదీ చదవండి : 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టమన్నారు.. కోటి డిమాండ్ చేశారు.. చివరకు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఏం జరిగింది అంటే?

  రైతన్నలకు రాయితీలు..

  రబీ సీజన్‌లో పచ్చిరొట్ట, చిరుధాన్యాలు, ఉలవలు 50శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం, మినుము, పెసలు, కందులు, అలసందలు విత్తనాలను 30 శాతం, శనగలు 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. వరి ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున, వర్తించని జిల్లాల్లో రూ.500చొప్పున విత్తనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు.

  ఇదీ చదవండి : నేడు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావం..? ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అంటే..?

  మరోవైపు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) వలంటీర్ల సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా రైతుల సేవలో భాగస్వాములు కానున్నారు. ఆర్బీకే సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే సమయంలో రైతుల సేవల్లో అంతరాయం కలగకుండా గ్రామాల్లో చురుగ్గా పని చేసే వలంటీర్లను ఆర్బీకేలకు ప్రభుత్వం అనుసంధానించింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ap welfare schemes, Farmer, Ysr rythu bharosa

  ఉత్తమ కథలు