హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vegetables: ఇంట్లో ఉంటూనే ఆదాయం.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి..

Vegetables: ఇంట్లో ఉంటూనే ఆదాయం.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి..

ఇంటి దగ్గర నుండే ఇలా ట్రై చేయండి

ఇంటి దగ్గర నుండే ఇలా ట్రై చేయండి

Vegetables: ఇంట్లోనే ఉంటూ.. ఆహ్లాదం. ఆరోగ్యం.. ఆదాయం కావాలి అనుకుంటున్నారా.? అయితే ఇలా చేయొచ్చు.. ముఖ్యంగా మిద్దె తోట పెంపాకాలపై ఫోకస్ చేస్తే.. ఆ మూడు మీ ఇంట ఉన్నట్టే..

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

   Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Best Idea:  ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం (Health).. ఆదాయం (Income) పొందే ఐడియా ఉంటే ఎవరు కాదనుకుంటారు.. అలాంటి వారు ఇలా ట్రై చేస్తే.. కచ్చితంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా సేంద్రియ  ఆకు కూరలు , కూరగాయలు తమ ఇంట్లో పెరటిలో పెంచుకుంటే ఆ రెండు మీతోనే ఉంటాయి.  ఎందుకంటే తమ చేత్తో పండించినవి కాబట్టి తమకు ఎంతో రుచినిస్తాయి.. ఆరోగ్యం కూడా వస్తుంది. అధిక పంటపై ఫోకస్ చేస్తే.. నాలుగు రాళ్లు కూడా సంపాదించవచ్చు.. అని అంటారు గృహస్థులు. ముఖ్యంగా కరోనా వైరస్ (Corona Virus ) పరిస్థితుల దరువాత..  ప్రజల జీవన విధానం మారింది ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ధవహించటం మొదలు పెట్టారు సేంద్రీయంగా పండించే ఆకుకూరలు కూరగాయలు (Vegetables) వైపు  ఎక్కువమంది  మళ్లారు.

  ఎందు కంటే తాజా ఆకు కూరలు కూరగాయలలో ఎక్కువ మోతాదు లో పోషకాలు ఉంటాయి.. ఖనిజాలు విటమిన్లు  పిండి పదార్థాలు పీచు పదార్థాలు వంటి ఆరోగ్యాంచే పోషకాలు లభిస్తుండటంతో పెరటి, మీద్దె తోటలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు చాలామంది.. ఈ మిద్దె పెరటి తోటల పెంపకంతో చాలా లాభాలు ఉన్నాయి.

  ముఖ్యంగా మనస్సుకు ఆహ్లాదం ఇస్తుంది. శారీరక శ్రమ కూడా ఉంటుంది. అన్నింటికన్నా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే వాళ్లం అవుతాం..  ఇన్ని ప్రయోజనాలు ఉండడంతో అందరూ పెరటి మిద్దె తోటలా వైపు చూస్తున్నారు. ఐతే చిన్న మొక్కలు విత్తనాలు నాటటం వల్ల మొక్క ఫల సాయాన్ని ఇవ్వటానికి కొంత సమయం పడుతుంది.

  ఇదీ చదవండి : సింహ వాహనంపై యోగ నరిసింహుడు.. ముత్యపు పందిరిలో కళా నీరాజనం.. స్వామి దర్శనంతో భక్తులకు తన్మయత్వం

  ఫలసాయం రావటానికి ఆలస్యం అవుతుండటంతో  కొంత కాలం తరువాత  ఆసక్తి తగ్గిపోతుండటం తో మధ్యలో పెంపకం ఆపేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం గా కొంతమంది ఒత్సాహికులు ఆకు కూరలు, కూరగాయలు మొక్కలను పూత దశ పిందె దశ లో ఉన్న మొక్కలను అమ్మే ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఐతే ఈ మొక్కలను కొన్న వారు ఆ మొక్కలను అలాగే తీసుకువెళ్లి పోర్టికోలోనో గోడల మీదో  పెట్టుకొని.. రోజూ ఫలసాయాన్ని పొందవచ్చు.

  ఇదీ చదవండి : శ్రీవారికి ప్రకృతి సొబగులు.. స్నపనం కోసం జపాన్ ఆపిల్స్.. మస్కట్ గ్రేప్స్.. కొరియన్ పియర్స్

  దింతో మొక్కలు పెంచాలనే అభిరుచి వున్నవాళ్ళు ఈ మొక్కలను కొనటానికి ఆసక్తి చూపుతున్నారు . దింతో ఈ మొక్కలను విక్రయించేవారు పిక్ అండ్ గ్రో పేరుతో ఒక పెద్ద కవర్ లో మట్టి కోళ్ల ఎరువు వేప పిండి కోకో పిట్ వంటి మిశ్రమాన్ని కలిపి సంచిలో నింపి మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలు కొన్నవారు రోజువారీ మొక్కలకు నీళ్లు పోసి రోజుల వ్యవధిలో ఫల సాయాన్ని పొందవచ్చు.

  ఇదీ చదవండి : కొడాలి నానికి ఏమైంది..? అలా ఎందుకు చేశారు..? మనస్థాపం చెందారా..?

  అంతే కాకుండా ఈ మొక్కలను పూర్తి సేంద్రియ పద్దతులలో పెంచటం వల్ల ఈ ఆకు కూరలు కూరగాయలలో ఎక్కువ పోషకాలు ఉండటం తో పటు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. వీరు టమోటో వంగా బెండ చిక్కుడు మిరప గోంగూర పాల కూర తోట కూర వంటి మొక్కలను అందుబాటులోకి తెస్తున్నారు. కాస్త విశాలమైన పెరడు ఉన్నా.. మిద్దెపై వేసుకునే అవకాశం ఉన్నా.. చుట్టుపక్కల వారికి విక్రయించి ఆదాయం కూడా పొందొచ్చు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Business Ideas, Gunturu, Vegetables

  ఉత్తమ కథలు