Home /News /andhra-pradesh /

GUNTUR WASTE MANAGEMENT PLANT IN GUNTUR IS PRODUCING POWER SPECIFICATIONS HERE PRN GSU NJ

వ్యర్థాల నుంచి విద్యుత్‌... ఏపీలో తొలి ప్లాంట్‌ అక్కడే..! ప్రత్యేకతలవే..!

గుంటూరులో

గుంటూరులో చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో గుంటూరు ఒకటి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉండటంతో నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఐతే చాన్నాళ్లుగా గుంటూరు (Guntur) ను చెత్తసమస్య వేధిస్తోంది. తాజాగా చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది.

ఇంకా చదవండి ...
  Sumanth, News18, Guntur

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ నగరాల్లో గుంటూరు ఒకటి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉండటంతో నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఐతే చాన్నాళ్లుగా గుంటూరు (Guntur) ను చెత్తసమస్య వేధిస్తోంది. తాజాగా చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో 340 కోట్ల రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ప్రారంభమైంది. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు మరో ఏడు మున్సిపాలిటీల్లో వచ్చే చెత్తను ఇక్కడకు తరలించి విద్యుత్ తయారు చేయనున్నారు. డంపింగ్ యార్డుల్లో కొండల్లా పేరుకుపోతున్న చెత్త... పరిసరాల్లో దుర్గంధం... పర్యావరణానికి హానికరం... భూగర్భ జలాలు కలుషితం. దేశంలో ఎక్కడైనా నగరాలు, పట్టణాల్లో చెత్తను సరిగా ప్రాసెసింగ్ చేయకపోవటం వల్ల వస్తున్న సమస్యలివి. అందుకే చెత్తను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ఇందులో ఓ విధానం.

  15మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌
  ఇలాంటి విధానాన్ని రాజధాని ప్రాంతంలో అమలు చేయాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. గుంటూరు శివార్లలోని నాయుడుపేట వద్ద 15మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుకు 2016లో శంకుస్థాపన చేశారు. జిందాల్ సంస్థ ఈ ప్రాజెక్టుని చేపట్టింది. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు సమీపంలో ఉన్న తెనాలి, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని చెత్తను ఇక్కడకు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేయటం ప్రాజెక్టు లక్ష్యం.

  ఇది చదవండి: ఏపీలో కరోనా ఫోర్త్ వేవ్..? క్రమంగా పెరుగుతున్న కేసులు.. ముప్పు తప్పదా..?


  ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ స్థలం కేటాయించింది. 2018కల్లా పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. అయితే వేర్వేరు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఇటీవలే ప్లాంటు నిర్మాణం పూర్తయింది. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. పనితీరుపై నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..!


  చెత్త నుంచి విద్యుత్‌ ఎలా?
  ఈ ప్లాంట్ లోని డంపుల్లో చెత్తను కుళ్లబెట్టడం ద్వారా బయో గ్యాస్ వస్తుంది. అందులోని మీథేన్ ను మండించటం ద్వారా నీటి ఆవిరి ఉత్పత్తి అవుతుంది. నీటి ఆవిరి సాయంతో టర్బైన్లు తిరిగేలా చేసి విద్యుత్ ఉత్పత్తి చేయటం ఇందులో ఉన్న సాంకేతికత.

  ఇది చదవండి: మన ఇండియా గొప్పతనం అదే.. అందుకే ఈమె సప్తసముద్రాలు దాటి వచ్చేసింది..!  ప్లాంట్‌ నిర్వహణకు 1200 టన్నుల చెత్త అవసరం
  ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ ప్లాంటు నిర్వహణకు రోజూ 12వందల టన్నుల చెత్త అవసరం. ఆ చెత్తను సరఫరా చేసే బాధ్యత రెండు కార్పోరేషన్లు, ఏడు మున్సిపాలిటిలదే. తడి చెత్త, పొడి చెత్త రెండూ కూడా ఈ ప్లాంట్ నిర్వహణకు ఉపయోగపడుతుంది.

  ఇది చదవండి: తిమింగలం మ్యూజియం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడండి..! ఆసక్తికర విశేషాలివే..!  చెత్త సేకరణలో జాగ్రత్తలు
  అయితే ఆ చెత్తలో భవన నిర్మాణ వ్యర్థాలు, బయో వేస్ట్, గాజు పెంకులు, కార్బోనేటెడ్ ప్లాస్టిక్ ఉండకూడదు. చెత్త సేకరించే సమయంలో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. జిందాల్ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను యూనిట్‌కు రూ. 6.20 చొప్పున ఏపీసిపిడీసీఎల్ కు విక్రయిస్తారు. అయితే యూనిట్ తయారి ఖర్చు మాత్రం రూ. 7 అవుతుందని జిందాల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకే ఈ ప్లాంట్‌ను విద్యుత్ తయారీ కోసం అని కాకుండా... చెత్తకు పరిష్కార మార్గంగా చూడాలని వారు చెబుతున్నారు.

  ఇది చదవండి: హాట్ సమ్మర్లో ఇక్కడికి వెళ్తే కూల్ అవుతారు.. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు  ప్లాంట్‌ నుంచి వచ్చే వ్యర్థాలతో కూడా..!
  ప్లాంట్‌లో తయారయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించేందుకు సమీపంలోని సబ్ స్టేషన్ వరకూ 4.2 కిలోమీటర్ల లైన్ వేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ క్రమంలో 25శాతం మేర బూడిద వస్తుంది. బూడిద నిల్వ కోసం ప్లాంట్ సమీపంలోనే భూమి కేటాయించారు. అయితే ఆ బూడిద ద్వారా ఇటుకలు, కంకరరాళ్లు వంటివి తయారు చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అవి కార్యరూపం దాలిస్తే ప్లాంట్ ద్వారా వచ్చే వ్యర్థాలు కూడా కనుమరుగవుతాయి.

  అడ్రస్‌ : జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, సర్వే నెంబర్‌ - 933,938, కొండవీడు, నాయుడుపేట, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌- 520006
  ఫోన్‌ నెంబర్‌: ‭91002 60360 / 9100260360.

  Zindal Uban Waste Management Plant Guntur

  ఎలా వెళ్లాలి?
  గుంటూరు నగర శివారులో ఈ ప్లాంట్‌ ఉంది. గుంటూరు బస్టాండ్‌ నుంచి చిలకలూరిపేట బస్సు ఎక్కి..బోయపాలెంలో దిగాలి. అక్కడ నుంచి రోడ్డుమార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News

  తదుపరి వార్తలు