హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: పెదకూరపాడులో పొలిటికల్‌ వార్‌..! ఎస్‌ టాక్స్‌ నీదంటే నీదంటూ రగడ

Guntur: పెదకూరపాడులో పొలిటికల్‌ వార్‌..! ఎస్‌ టాక్స్‌ నీదంటే నీదంటూ రగడ

పెదకూరపాడులో రాజకీయ వేడి

పెదకూరపాడులో రాజకీయ వేడి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా (Guntur District) లో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతుంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Sumanth, News18, Guntur

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా (Guntur District) లో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతుంటుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొద్ది రోజుల క్రితం ఇసుక అమ్మకాల్లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్‌ టాక్స్‌ వేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. పల్నాడు జిల్లాలో అత్యధిక ఇసుక రీచ్‌లున్న నియోజకవర్గం పెదకూరపాడే. గత ప్రభుత్వ హాయాంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు. అయితే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు అధికారంలో ఉండి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక రీచ్‌లను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని రీచ్‌లలో జేపి సంస్థే ఇసుక తవ్వకాలు చేపట్టింది. అయితే ఈ ఏడాది కృష్ణా నదికి అధికంగా వరదలు వచ్చాయి. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఇసుక రీచ్‌ల నుండి ఇసుక డంపింగ్ యార్డ్‌కు తీసుకొచ్చి డంప్ చేశారు. రీచ్ నుండి డంపింగ్ యార్డుకు ఇసుకు తరలించినందుకు కొద్దీ మొత్తంలో ధరను పెంచారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఇసుకపై ఎస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆరోపించారు. ఎస్ ట్యాక్స్ అంటే ఎమ్మెల్యే శంకర్ రావు అనే అర్ధం వచ్చేలా రాజకీయ విమర్శలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు ఇసుక అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇది చదవండి: యోగి వేమ‌నకు గుడికట్టి పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు..? ఎక్కడో తెలుసా..!


అయితే ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎస్ ట్యాక్స్ అంటే శ్రీధర్ ట్యాక్సే అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో ఉచిత ఇసుక విధానాన్ని అడ్డంపెట్టుకొని కోట్లాది రూపాయలను టిడిపి నేతలు దండుకున్నారని గట్టిగా కౌంటర్‌ వేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాలను ధర్డ్ పార్టీకి అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌కు గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదని అందుకే ఆయన ఎస్ ట్యాక్స్‌ను గుర్తు చేసుకుంటున్నారన్నారు.

ఇది చదవండి: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్


శ్రీధర్డ్ పార్టీ ఇసుక తవ్వకం చేసి విక్రయిస్తున్న విషయం కూడా మాజీ ఎమ్మెల్యేకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. వీరిద్దరి మద్య సాగిన మాటల యుద్దం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. రెండు పార్టీల కార్యకర్తలు తమ నేతలకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెట్టుకున్నారు. తమ ప్రభుత్వంలోనే మెరుగైన ఇసుక విధానం అమలయిందంటూ ఎవరికి వారే చెప్పుకుంటారు. ఈ పొలిటికల్ టంగ్‌ వార్‌ ఏ టర్న్‌ తీసుకుంటుందో అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Published by:Purna Chandra
First published:

Tags: Andhra Pradesh, Guntur, Local News

ఉత్తమ కథలు