హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Neem Tree: వేపచెట్టుకు వందేళ్లు..! గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్.. ఆ వేడుకను మీరూ చూడండి..!

Neem Tree: వేపచెట్టుకు వందేళ్లు..! గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్.. ఆ వేడుకను మీరూ చూడండి..!

బాపట్ల జిల్లాలో వేపచెట్టుకు పుట్టినరోజు

బాపట్ల జిల్లాలో వేపచెట్టుకు పుట్టినరోజు

AP News: మనం ప్రతిఏటా పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటాం. అందులోనూ షష్టిపూర్తి అంటే దాదాపు జీవితాన్ని పరిపూర్ణంగా చూసిన వాళ్లంటూ ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. మరి 100ఏళ్ల పుట్టినరోజు అంటే.., బాబోయ్‌ శతదినోత్సవ వేడుకలు.. కోట్లలో ఒకరు చేసుకుంటారు. మరి అదే శతదినోత్సవవేడుకలు ఓ చెట్టుకు జరిపితే..!

ఇంకా చదవండి ...

Sumanth, News18, Guntur

మనం ప్రతిఏటా పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటాం. అందులోనూ షష్టిపూర్తి అంటే దాదాపు జీవితాన్ని పరిపూర్ణంగా చూసిన వాళ్లంటూ ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. మరి 100ఏళ్ల పుట్టినరోజు అంటే.., బాబోయ్‌ శతదినోత్సవ వేడుకలు.. కోట్లలో ఒకరు చేసుకుంటారు. మరి అదే శతదినోత్సవవేడుకలు ఓ చెట్టుకు జరిపితే ఎలా ఉంటుందో తెలుసా..! వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని బాపట్ల జిల్లా (Bapatla District) నగరం మండలం దూళిపూడిలోని శ్రీ రాజగోపాలస్వామి ఆలయం ఎదురు 1923 మే21న నూతి సత్యనారాయణ అనే వ్యక్తి వేపచెట్టును నాటారు. అంతేకాదు నాటిన చెట్టును కాపాడేందుకు గుర్తుగా తన సొంత ఖర్చుతో ఆ రోజుల్లో రూ.50 వెచ్చించి చెట్టు చుట్టూ రచ్చ బండ కట్టించారు. అప్పటి తేదిని నాపరాయిపై శిలాఫలకంగా చెక్కించారు. అప్పటి నుంచి గ్రామస్థులు ఆ చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తూ వస్తున్నారు.

వందేళ్లు పూర్తిచేసుకున్న వేపచెట్టు

ఇప్పుడు ఆ చెట్టు.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఏకంగా వందేళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో వృక్ష ప్రేమికుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. శతాధిక వృద్దులకు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నప్పుడు చెట్టుకు మాత్రం ఎందుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించకూడదని ఆ ఊరి ప్రజలు అనుకున్నారు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా ఆ వేపచెట్టుకు గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్‌ చేశారు. చెట్టు నాటిన నూతి సత్యన్నారాయణ చనిపోయినా.. ఆయన వారసులు చెట్టు నాటి వందేళ్ళు అయినట్లు గుర్తించి శత వసంతాల వేడుక నిర్వహించారు.

ఇది చదవండి: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..


అమ్మవారికి సారె

అమ్మవారి ప్రతిరూపంగా భావించే వేప చెట్టుకు కొత్త చీర కట్టి... పొంగళ్లు వండి నైవేద్యం పెట్టారు. చెట్టుకు పూలమాల వేశారు. చెట్టు చుట్టూ ఉన్న రచ్చబండకు కొత్త సొగబులు అద్దారు. రచ్చబండకు రంగులు వేశారు. ముగ్గులు పెట్టారు. ఊరంతా కదిలొచ్చి వేప చెట్టుని లక్ష్మీదేవిలా భావించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ విధంగా ఆ చెట్టుకు వందేళ్ళ వేడుకలను పూర్తి చేశారు. ఈ వేడుకలను చూసేందుకు దూళిపూడివాసులతో పాటు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


ఇది చదవండి: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!


పచ్చని అడవులు సైతం కాంక్రీట్ ఆడివిగా మారుతున్న రోజులివి. ఏడాదికి మూడుపంటలు పండే వ్యవసాయ భూములు సైతం రియల్‌ ఎస్టేట్‌ భూతానికి బలైపోతున్న రోజుల్లో.. ఒక చెట్టును ఎలాంటి ఇబ్బంది లేకుండా వందేళ్లు కాపాడుకోవడం అంటే గొప్ప విషయమే అంటూ పలువురు కొనియాడారు. ప్రతి ఏడాది ఇలానే ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని సత్యనారాయణ వారసులు వెంకటరామ శర్మ, శివ ప్రసాద్, సాయి బాబు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur

ఉత్తమ కథలు