Good News: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. నేడు జగనన్న చేదోడు విడుదల.. నగదు రాకుంటే ఇలా చేయండి
Good News: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. నేడు జగనన్న చేదోడు విడుదల.. నగదు రాకుంటే ఇలా చేయండి
చిరు వ్యాపారులకు శుభవార్త
Good News: ఆంధ్రప్రదేశ్ లో చిరు వ్యాపారులకు శుభవార్త.. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి మూడో విడత నగదు విడుదల చేస్తారు. అర్హత ఉండి ఎవరికైనా నగదు రాకుంటే ఏం చేయాలి.. కొత్తగా పథకానికి అర్హత సాధించాలంటే ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఇవే..
Good News: ఆంధ్రప్రదేశ్ లో చిరు వ్యాపారులకు శుభవార్త.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత జగనన్న చేదోడు నిధులు నేడు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద, రాష్ట్రంలోని 3.95 లక్షల మంది చిన్న, చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మెరుగు పరచాలనే లక్ష్యంతో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు వడ్డీ రహిత రుణాన్ని పొందుతారు.
అయితే గతేడాది లబ్ధిదారులు పొందిన రుణానికి ఆరు నెలల వడ్డీకి మొత్తం 15.17 కోట్ల రూపాయలు కాకుండా.. కొత్తగా చేరిన లబ్ధిదారులకు 395 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాన్ని.. ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. తాజాగా చూస్తే.. ఈ మూడో విడత జగనన్న చేదోడుతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.31 లక్షలకు చేరుకుంది..
షాపుల యజమానులు, చేతివృత్తులవారు, ఐదడుగుల వెడల్పు.. ఐదు అడుగుల పొడవుతో తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాల యజమానులు రోడ్ల పక్కన లేదా వారి సొంత భూములలో దుకాణాలు, కూరగాయలు, పండ్లు, పువ్వులు, బట్టలు.. ఇతర వ్యాపారులు కూడా ఈ నగదు పొందేందుకు అర్హులే.
పథకం ప్రయోజనాలు… లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం వారి పేర్లను గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర ప్రదర్శిస్తారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న రుణాలపై విపరీతమైన వడ్డీ భారం నుంచి చిన్న వ్యాపారులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం సూక్ష్మ రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించారు, గతేడాది కూడా అర్హులు ఎవరికైనా డబ్బులు రాకపోతే వారు గ్రామ సచివాలయానికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.. ఇవాళ విడుదల చేసిన నగదు కూడా రాకపోతే.. వారు సచివాలయానికి వెళ్లి.. సరైన వివరాలు అందిస్తే.. వారికి నగదు అందిస్తారు.
కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే తనిఖీ ప్రక్రియ చేసి అర్హత ఉంటే డబ్బులు చెల్లిస్తారు.. అప్లై చేసుకోవాలని భావించే రజక, నాయిబ్రాహ్మణ, టైలరింగ్ చేసే వారికి కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే.. చేదోడు అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ (క్యాస్ట్ సర్టిఫికెట్, సచివాలయం AP సేవా పోర్టల్ నుండి వచ్చిన సర్టిఫికెట్ ఉండాలి.
అలాగే బ్యాంకు పాస్ బుక్ జిరాక్సు, షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సచివాలయం AP సేవా పోర్టల్ నుండి వచ్చింది మాత్రమే) ఉండాలి, ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ (సచివాలయం AP సేవా పోర్టల్ నుండి వచ్చిన సర్టిఫికెట్) ఉండాలి, షాపు తో దరఖాస్తుదారు దిగిన ఫోటో, 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకంలో అర్హులు.
అర్హతలు… ఈ పథకం పొందాలి అనుకున్న వారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి, రైస్ కార్డు కలిగి ఉండాలి, రజక, నాయిబ్రాహ్మణ, టైలరింగ్ వృత్తి చేస్తున్నవారు అయి ఉండాలి.. జగనన్న చేదోడు పథకంలో చేరాలని భావించే వారు సచివాలయం వెళ్లి సంప్రదిస్తే సరిపోతుంది, అవసరమైన డాక్యుమెంట్లును తీసుకెళ్లాలి, సచివాలయం సిబ్బంది స్కీమ్‌లో జాయిన్ అవ్వడానికి మీకు సహాయ పడతారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.