హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Hanuman Temple: చిలుకూరు బాలాజీనే కాదు.. ఏపీలోనూ ప్రదక్షిణలతోనే కోర్కెలు తీరుస్తున్న హనుమంతుడు? ఎక్కడో తెలుసా?

Hanuman Temple: చిలుకూరు బాలాజీనే కాదు.. ఏపీలోనూ ప్రదక్షిణలతోనే కోర్కెలు తీరుస్తున్న హనుమంతుడు? ఎక్కడో తెలుసా?

పొన్నూరు వీరాంజూనేయ స్వామి ఆలయం

పొన్నూరు వీరాంజూనేయ స్వామి ఆలయం

Hanuman Temple: తెలుగు రాష్ట్రాల్లో హిందువులకు చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం అక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే చాలు.. కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. అయితే ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి ఆలయం ఉందని మీకు తెలుసా.. అక్కడ వెలసిన ఆంజనేయ స్వామి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే చాలు ఏ కోరికైనా తీరుతుంది అంటున్నారు. మరి ఆలయం ప్రత్యేకత ఏంటంటే..?

ఇంకా చదవండి ...

  Hanuman Temple: చిలుకూరు బాలాజీ స్వామి ఆలయం (Chilukur Balaji Temple) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ల్లో భక్తులకు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. హుండీలేని దేవుడు.. అంతేకాదు.. ముఖ్యంగా ప్రదక్షిణలతోనే ఆలయం చాలా ఫేమస్ అయ్యింది. ఎవరికైనా కష్టాలు ఉన్నా.. కోరికలు ఉన్నా.. అక్కడి స్వామిని దర్శించుకుని 11 ప్రదక్షిణలు చేసుకుని మొక్కు మెక్కితే.. వారి కోరికలు నెరవేరుతాయని.. కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.. తమ కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. నిత్యం చిలుకూరి బాలాజీ ఆలయం రద్దీగానే ఉంటుంది. ఇప్పటి వరకు ప్రదక్షిణలు చేస్తే చాలు కోరికలు దేవుడు తీరుస్తాడు అని నమ్మే ఆలయం అది ఒక్కటే అని అందరికీ తెలుసు.. కానీ ఆంధ్రప్రదేశ్ లోనూ కేవలం ప్రదక్షిణలు చేస్తే చాలు.. భక్తులకు వరాలు ఇచ్చే దేవుడు ఉన్నాడని తెలుసా..? అయితే బాలజీ దేవుడు మాత్రం కాదు.. ఏపీలో ప్రదక్షిణలతోనే భక్తులకు వరాలు ఇస్తున్న దేవుడు ఆంజనేయ స్వామి. సాధారణంగా రామభక్తుడైన హనుమంతుడికి (Jai Hanuman) గ్రామానికో గుడి ఉంటుందంటే అతిశయోక్తికాదు.. భారీ సంఖ్యలో భక్తులుంటారు. నమ్మి కొలిస్తే.. పిలిచే దైవముగా భావిస్తారు. హనుమంతుడి ఆలయాల్లో ఒకొక్క ఆలయం ఒకొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అలా ఒక గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి మనస్సులోని కోరికను.. హనుమంతుడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు.

  కేవలం ప్రదక్షిణలతోనే భక్తులను ఆదుకుంటున్న ఈ హనుమంతుడు గుంటూరు జిల్లాలో కొలువై ఉన్నాడు. పొన్నూరులోని 24 అడుగుల ఎత్తులో ఏకశిలావిగ్రహంపై వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఈ అంజనీ పుత్రుడని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువైన చిన కాశి అయిన పొన్నూరు ఒక్కసారైన దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.

  ఇంకా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1940లో తయారు చేసిన ఏకశిలా విగ్రహాన్ని అత్యంత్య వ్యయ ప్రయాసల కోర్చి 1950 నాటికి 24 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారు. స్వామి వారిని ప్రతిష్టించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవటంతో 1969 వరకూ స్వామి వారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు. 1969లో జగన్నాధ స్వామి వారి అమృత హస్తాల మీదుగా స్వామి ప్రతిష్ట జరిగింది అంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ హనుమంతుణ్ని సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామి వారి ముందు నిలబడి తిలకించాలంటూ తలపైకెత్తి చూడాల్సిందే.. మెట్ల మార్గం ద్వారా పైకెళ్లి స్వామి వారికి నిత్య పూజలు చేస్తుంటారు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళ, శని, ఆది వారాల్లో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు.

  ఈ వీరాంజనేయ స్వామి వారి ఆయలంలోనే ఆరు ఉపాలయాలున్నాయి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, కాలభైరవ గుడి, దశావతారల విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేవ్వర స్వామి దేవాలయంతో పాటు గరుత్మంతుని గుడి కూడా ఇక్కడ ఉంది. దీంతో శివ, కేశవల బేధం లేకుండా భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో అన్నిటికంటే ప్రత్యేకమైంది ఏంటంటే..? ఇక్కడ పదకొండు ప్రదక్షణలు చేసి తమ కోర్కెలను స్వామి వారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు. తమ కోరిన నెరవేరిన వెంటనే 108 ప్రదక్షణలు చేసి స్వామి వారిని సేవిస్తారు. అనేక పర్వ దినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరగుతాయి. స్వామి వారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది. అనేక విశిష్టతులున్న స్వామి ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే మనస్సుకు ఎక్కడాలేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Hindu Temples, Lord Hanuman

  ఉత్తమ కథలు