Home /News /andhra-pradesh /

GUNTUR VERY BIG SHOCK TO NARA LOKESH IN MANGAGIRI SENIOR LEADER RESIGN TO PARTY NGS GNT

Big shock to Lokesh: టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా.. తప్పు ఒప్పుకున్న లోకేష్.. ఏమన్నారంటే..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Big shock to Lokesh: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి అధికారంలోకి రావాలి అనుకుంటున్న తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. ముఖ్యంగా లోకేష్ పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా చేశారు. దీనిపై స్పందించిన లోకేష్.. తన తప్పు ఒప్పుకుంటూనే.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తాను అని క్లారిటీ ఇచ్చారా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India
    Big shock to Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Prdesh)లో ప్రధాన రాజకీయ పార్టీలకు అదే పార్టీకి చెందిన నేతలే వరుస షాక్ లు ఇస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District)లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి బిగ్ షాక్‌ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు గంజి చిరంజీవి (Ganji Chirnjeevi).. కేవలం రాజీనామా చేయడమే కాదు.. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. పార్టీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్లు తనకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఋణపడి ఉంటాను అన్నారు. టీడీపీలో బీసీగా ఉన్న.. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పదవులు కోసం, పరపతి కోసం టీడీపీ (TDP) కి రాజీనామా చేయడం లేదన్నారు. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

    గత ఎన్నికల్లో చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు నాదే అని చెప్పి మోసం చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి తనను మంగళగిరి ప్రజలకు దూరం చేశారన్నారు. చేనేత, బీసీగా ఉన్న తనను అణగదొక్కారు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదన, బాధ నాయకులకు తెలిసినా తనను పట్టించుకోలేదన్నారు. ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే వారితోనే ముందుకు నడుస్తాను అన్నారు.



    తన వెంట నిలిచిన కార్యకర్తలు శ్రేయోభిలాషుల అందరిని సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. 2014లో టీడీపీ నుంచి మంగళగిరి స్థానానికి బరిలోకి దిగిన గంజి చిరంజీవికి.. 2019 ఎన్నికల్లో మాత్రం సీటు దక్కలేదు.. ఆ స్థానం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పోటీకి దిగారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమైన లోకేష్‌.. పర్యటనలు, కార్యక్రమాలను కూడా పెంచారు.. ఈ నేపథ్యంలో.. మరోసారి తనకు అవకాశం రాదని భావించిన గంజి చిరంజీవి.. టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

    ఇదీ చదవండి : గుక్కెడు నీళ్ల కోసం యుద్ధం చేయాలా? చేతులు జోడించి వేడుకుంటున్న మహిళలు

    తాజా పరిణామాలపై స్పందించిన లోకేష్.. పద్మశాలీలకు తాను న్యాయం చేయలేకపోయనని ఒప్పుకున్నారు. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలను తాను తప్పక గౌరవిస్తాను అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తాను అన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయడం ఎంత అనివార్యమో.. తాను మంగళగిరిలో పోటీ చేయడం కూడా పక్కా అన్నారు.

    ఒకవేళ చంద్రబాబు చేస్తున్న సర్వేలో లోకేష్ కు ప్రజాధారణ లేదని తెలిసినా..? మా పార్టీ నాయకులు నా నాయకత్వాన్ని వ్యతిరేకించినా.. అందిరి కార్యకర్తల్లానే.. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే మంగళగిరిలో ఉన్న పద్మశాలీ కమ్యూనిటీ పెద్దలకు మాత్రం న్యాయం చేయలేకపోయాను అనే ఆవేదన నతకు ఉందన్నారు. కానీ పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు మద్దతుగా నిలిచింది మాత్రం టీడీపీనే అన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Mangalagiri, Nara Lokesh, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు