హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Very Sad: తిరుపతికి మళ్లెప్పుడైనా వెళ్లేవాళ్లు కద తల్లీ.. క్షణికావేశంలో ఎంతపని చేశావమ్మా..

Very Sad: తిరుపతికి మళ్లెప్పుడైనా వెళ్లేవాళ్లు కద తల్లీ.. క్షణికావేశంలో ఎంతపని చేశావమ్మా..

శ్రావణ్‌కుమార్, మానస కుటుంబం

శ్రావణ్‌కుమార్, మానస కుటుంబం

భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవ మూడు నిండు జీవితాలను బలితీసుకుంది. క్షణికావేశంలో భార్య తీసుకున్న నిర్ణయం ఆమెతో పాటు ఇద్దరు బిడ్డల ప్రాణాలను తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలోని మిలటరీ కాలనీలో మానస, శ్రావణ్‌కుమార్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.

ఇంకా చదవండి ...

  పిడుగురాళ్ల: భార్యాభర్తల మధ్య ఏదో ఒక సందర్భంలో మనస్పర్థలు రావడం సహజం. అయితే.. ఆ మనస్పర్థలు, అలకలుబుజ్జగింపులతో సమసిపోవాలి తప్ప అంతకు మించి పరిస్థితి శృతిమించకుడదు. మనస్పర్థలు ముదిరితే కాపురాలు కూలిపోయే ప్రమాదముంది. క్షణికావేశంలో జరగరాని ఘోరం జరిగే అవకాశం కూడా ఉంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో అదే జరిగింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవ మూడు నిండు జీవితాలను బలితీసుకుంది. క్షణికావేశంలో భార్య తీసుకున్న నిర్ణయం ఆమెతో పాటు ఇద్దరు బిడ్డల ప్రాణాలను తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలోని మిలటరీ కాలనీలో మానస, శ్రావణ్‌కుమార్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లైంది. జ్యోతి(2), షర్మిల(4) అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. శ్రావణ్‌కుమార్ సిమెంట్ వరల పనులకు, మిల్లర్లు బాగు చేసేందుకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్నేళ్ల నుంచి ఎంతో సాఫీగా సాగిపోయిన ఈ జంట వైవాహిక జీవితంలో ఇటీవల చిన్నచిన్న మనస్పర్థలు వచ్చాయి. అంతేతప్ప పెద్దగా గొడవ పడిన సందర్భాలు లేవని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు. ఈ జంట మధ్య తిరుమల వెళ్లే విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. తిరుమల వెంకన్న దర్శనానికి భర్త, పిల్లలతో కలిసి వెళ్దామని ఎప్పటి నుంచో మానస అనుకుంది. అయితే.. కరోనా కారణంగా వెంకన్న దర్శనానికి అంతరాయం కలగడంతో అప్పటి నుంచి ఆ ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్య కరోనా కాస్త తగ్గడం, దర్శనానికి సామాన్య భక్తులను అనుమతిస్తుండటంతో మానస తిరుపతి వెళ్దామని భర్త శ్రావణ్‌కుమార్‌తో చెప్పింది.

  సరే.. వెళ్దామని శ్రావణ్ చెప్పినప్పటికీ తీరా బయల్దేరే సమయానికి పని పడటంతో తిరుపతికి రావడం కుదరదని.. మా అమ్మానాన్నలతో కలిసి పిల్లలను తీసుకుని వెళ్లాలని భార్య మానసకు చెప్పాడు. ఈ పరిణామం మానసను తీవ్రంగా బాధించింది. భర్త రావడం కుదరదని చెప్పడంతో ఆమె కూడా తిరుపతి ప్రయాణాన్ని రద్దు చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి మానస ముభావంగా ఉంటోంది. చిన్నచిన్న సంతోషాలు కూడా తీర్చలేకపోతున్నాడని సన్నిహితులతో చెప్పుకుని బాధపడేది. తీవ్ర మనస్తాపంతో మానసిక ఒత్తిడికి గురైన మానస శనివారం అర్ధరాత్రి దాటాక క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. భర్త పక్క గదిలో నిద్రిస్తున్నాడు. పిల్లలతో కలిసి మానస మరో గదిలో పడుకుంది. శనివారం అర్ధరాత్రి దాటాక మానస తన ఇద్దరు కూతుర్ల మెడకు చున్నీ బిగించి దివాన్‌కాట్‌కు వేసి బలంగా లాగింది. ఊపిరాడక కొంతసేపటికే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

  ఇది కూడా చదవండి: Etela Rajender: పోలీస్ స్టేషన్‌లు, స్కూల్స్ సరిపోవడం లేదు.. హుజురాబాద్‌లో కాకరేపుతున్న ఈటల కామెంట్స్

  పిల్లలు చనిపోయాక మానస కూడా అదే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మానస భర్త శ్రావణ్ కుమార్ ఉదయాన్నే నిద్రలేచి భార్యాపిల్లలను నిద్ర లేపేందుకు వెళ్లగా ఫ్యాన్‌కు వేలాడుతూ మానస, విగతజీవులుగా ఇద్దరు పిల్లలు కనిపించారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా షాకైన శ్రావణ్ బిగ్గరగా కేకలేస్తూ రోదించాడు. ఇరుగుపొరుగు వాళ్లు ఏం జరిగిందోనని వచ్చి చూశారు. ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మానస ఎప్పుడూ ఏదో పరధ్యానంలో ఉండేదని.. భార్యాభర్తలు గతంలో పెద్దగా గొడవ పడిన సందర్భాలు కూడా లేవని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: AP News, Crime news, Husband, Wife suicide

  ఉత్తమ కథలు