Home /News /andhra-pradesh /

GUNTUR UNIQUE STYLE OF ANNOUNCEMENT ABOUT POWER PAWAN KALYAN VAKEEL SAAB TELEVISION PREMIER ON ZEE TELUGU IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Vakeel Saabh on TV: వకీల్ సాబ్ సినిమా కోసం చాటింపు... మరీ ఇంత అభిమానమా...? వీడియో వైరల్

Vakeel Saab on TV Photo: Twitter

Vakeel Saab on TV Photo: Twitter

మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమా కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

    జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వకీల్ సాబ్. బాలీవుడ్ హిట్ పింక్ రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు అన్నివర్గాల వారిని ఆకట్టుకున్న వకీల్ సాబ్.. భారీ కలెక్షన్లు సాధిచింది. పింక్ వెర్షన్స్ లో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ సత్యదేవ్ గా సత్యదేవ్ గా పవన్ కల్యాణ్.. నందాగా ప్రకాష్ రాజ్ హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్ తో అలరించారు. ఈ సినిమా దాదాపు రూ.80 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన నెలరోజుల్లోనే ఓటీటీలోకి స్ట్రీమ్ అయిన వకీల్ సాబ్ అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

    వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు దక్కించుకుంది. ఆదివారం ఈ సినిమా ప్రసారం కావడంతో రేటింగ్స్ లోనూ దుమ్మురేపుతుందని భావిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా టీవీలో వకీల్ సాబ్ ను చూసేందుకు వెయిట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వకీల్ సాబ్ టీవీలో ప్రసారమవుతుండటంతో ఓ గ్రామంలో ఇంటింటికీ చాటింపు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా ప్రసారమవుతుందని చాటింపు వేయించారు. అందరికీ అర్ధమయ్యేలా ఆ ఊరి కేబుల్ కనెక్షన్లో ఛానల్ నెంబర్ తో సహా డప్పుకొట్టిమరీ చాటింపు వేయడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


    ఇది చదవండి: త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎమ్మెల్యే రోజా..? ఆమె కల నెరవేరబోతోందా..?



    థియేటర్‌లో దుమ్ములేపిన ఈ వకీల్ సాబ్ మరి చిన్నతెరపై ఎలాంటీ రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. టాలీవుడ్‌లో ఉన్న రికార్డ్స్‌ను బద్దలు కొడుతుందా.. రేటింగ్స్ ఏ రేంజ్‌లో వస్తాయి.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.. చూడాలి మరి వకీల్ సాబ్ ఏ మేరకు టీవీ ప్రేక్షకులను అలరిస్తారో... ఎన్ని రేటింగ్స్‌ను తీసుకోస్తారో... ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. ఈ మూవీని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా.. దిల్‌ రాజు నిర్మించారు.

    ఇది చదవండి: ఏపీలో రికార్డుస్థాయిలో పెట్రోల్ ధర.. ఆ ఒక్క ప్రాంతంలోనే ఎందుకు..?


    Published by:Purna Chandra
    First published:

    Tags: Powe star pawan kalyan, Vakeel Saab, Zee telugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు