Home /News /andhra-pradesh /

GUNTUR TWO PAKISTANI TERRORISTS GUNNED DOWN IN RAJOURI DISTRICT JAMMU KASHMIR AP JAWAN JASHWANTH REDDY MARTYRED SK

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో తెలుగు జవాన్ మృతి.. ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టులు హతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు కూడా అమరవీరులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మరుప్రోలు జశ్వంత్ రెడ్డితో పాటు మరో సైనికుడు శ్రీజిత్ మరణించారు.

    జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలుగు జవాన్ అమరుడయ్యాడు. గురువారం రాజౌరి జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఎల్‌వోసీ మీదుగా భారత్‌లోకి చొరబడుతున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో.. భారత ఆర్మీ రంగంలోకి దిగింది. దాదల్ అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించాయి. ఈ క్రమంలోనే వారికి పాకిస్తాన్ ఉగ్రవాదులు తారసపడ్డారు. జవాన్లకు చూడగానే వారు కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసిరారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  ఇద్దరు జవాన్లు కూడా అమరవీరులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మరుప్రోలు జశ్వంత్ రెడ్డితో పాటు మరో సైనికుడు శ్రీజిత్ మరణించారు.

    ఉగ్రవాదుల వద్ద భారీగా మారణాయుధాలు లభ్యమయ్యాయి. రెండు ఏకే 47 రైఫిల్స్‌తో పాటు నాలుగు మేగజైన్లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

    జమ్మూ కాశ్మీర్‌లో గత నాలుగైదు రోజులుగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఎల్‌వోసీ మీదుగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కాశ్మీర్‌కు చెందిన కొందరు ఉగ్రవాదులు సైతం విధ్వంసానికి కుట్రలు చేస్తున్నారు. ఐతే నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో భారత ఆర్మీ రంగంలోకి దిగి.. ఉగ్రవాదులను ఏరివేస్తోంది. అనంత్‌నాగ్‌లో ఇద్దరు, పుల్వామాలో ఇద్దరు, ఉత్తర కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతను మట్టుబెట్టారు. ఇక శుక్రవారం ఉదయం కూడ కుల్గాంలో ఎన్‌కౌంటర్ జరిగింది. రెడ్వాని ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

    మీ నగరం నుండి (​గుంటూరు)

    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    ఆంధ్రప్రదేశ్
    ​గుంటూరు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Encounter, Jammu and Kashmir, Jammu kashmir, Terrorists

    తదుపరి వార్తలు