Home /News /andhra-pradesh /

GUNTUR TWO MEN BOOKED FOR MORTGAGED THEIR VILLAGE FOR BANK LOAN IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Bank loan on Village: అప్పుకోసం గ్రామాన్నే తాకట్టుపెట్టిన ఘనులు.. అదెలా సాధ్యమైందబ్బా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Cheating: అప్పుకోసం చాలా మంది బంగారం, వాహనాలు, కొన్ని విలువైన వస్తువులను తాకట్టుపెడతారు. పొలాలు, ఇళ్లు, స్థలాలుంటే వాటిని కూడా తకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటారు. కానీ ఎక్కడా లేని విధంగా కొందరు ప్రబుద్ధులు ఏకంగా గ్రామాన్నే తాకట్టుపెట్టేశారు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  ఎవరికైనా డబ్బులు అత్యవసరం అయితే బంగారాన్ని తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. కొందరు వాహనాలు, కొన్ని విలువైన వస్తువులను తాకట్టుపెడతారు. పొలాలు, ఇళ్లు, స్థలాలుంటే వాటిని కూడా తకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటారు. కానీ ఎక్కడా లేని విధంగా కొందరు ప్రబుద్ధులు ఏకంగా గ్రామాన్నే తాకట్టుపెట్టేశారు. ఎవరి ఎలా మాయ చేశారో తెలియదుగానీ గ్రామాన్ని తాకట్టుపెట్టారని తెలిసి షాక్ తినడం జనం వంతైంది. అసలు గ్రామాన్ని ఎలా తాకట్టు పెట్టారు.. అదెలా సాధ్యమైందనేదాని మాత్రం అందరికీ ఆశ్చర్యం తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం రెవెన్యూ పరిధిలోని సిద్దినపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా గ్రామాన్నే తాకట్టుపెట్టేసి లోన్ తీసుకున్నారు.

  సిద్ధినపాలెం గ్రామం మొత్తం సర్వే నంబర్ 296లో ఉంది. మొత్తం విస్తీర్ణం ఎనిమిదెకరాల్లో ఉంది. సర్వే నెంబర్లోని భూమి తమపేరు మీదే ఉందంటూ గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తితో పాటు మరొకరు కలిసి చెరో నాలుగు ఎకరాల భూమిని ఆన్ లైన్ చేయించారు. డాక్యుమెంట్స్, పాస్ పుస్తకాలు సృష్టించి ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో తనఖాపెట్టి లోన్ తీసుకున్నారు.

  ఇది చదవండి: భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపి ప్రియుడికి ఫోన్.., ఆ తర్వాత ఇద్దరూ కలిసి..


  అసలు గ్రామాన్ని ఇద్దరు వ్యక్తుల పేరిట ఎలా ఆన్ లైన్ చేశారు. వీరికి ఎవరు సహకరించారనేది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే లోన్ ఇచ్చిన అధికారులు ఎలాంటి పరిశీలన చేయకుండా ఎలా మంజూరు చేశారనేది కూడా అనుమానాలకు తావిస్తోంది. గ్రామాన్ని తమపేరిట రిజిస్టర్ చేయించుకున్న ఇద్దరు వ్యక్తులతో పాటు వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలంటూ సిద్ధినపాలెంకు చెందిన మహిళను పుల్లల చెరవు డిప్యూటీ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: రూ.100 పెడితే 5లక్షలు మీ సొంతం.. నెంబర్ గేమ్ లో చిక్కుకుంటే అంతే సంగతులు.. ఎక్కడో తెలుసా.‌.!


  ఇటీవల ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన పవన్, ప్రభావతి దంపతులు ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. బ్యాంక్ లోన్ కోసం తనఖా పెట్టేందుకు ఎలాంటి ఆస్తి లేకపోవడంతో రూటు మార్చారు. ఏదో సినిమాలో చూసినట్లు భార్యాభర్తలు కాస్తా.. అన్నాచెల్లెళ్లుగా మారిపోయారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వచ్చి అన్నాచెల్లెళ్లుగా చెప్పుకొని నివాసముంటున్నారు. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం కొప్పరంలో భూముల విషయం తెలుసుకున్నారు. గ్రామంలోని రెండు సర్వే నెంబర్లలో 4.73 ఎకరాలు, 4.62 ఎకరాల భూములు తమ పూర్వీకుల నుంచి వచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. అంతేకాదు తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టాదార్ పాసుపుస్తకాలు కూడా పొందారు.

  ఇది చదవండి: ఆ న్యూడ్ వీడియో కాల్ విలువ రూ.10లక్షలు... డేటింగ్ యాప్ పేరుతో సర్వం దోచేసిన యువతి..


  ఈ భూములు చూపించి నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలోని చైతన్య గోదావరి బ్యాంకులో గత ఏడాదిలో ఒక్కొక్కరు రూ.4.50 లక్షల చొప్పున లోన్ తీసుకున్నారు. రుణానికి సంబంధి నెలసరి వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అదికారులు విచారణ చేసి మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు అసలు వాళ్లు అన్నాచెల్లెల్లు కాదని.. భార్యాభర్తలని తేల్చారు. వారితో పాటు వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bank loan, Cheating, Prakasham dist

  తదుపరి వార్తలు