Police Case on Lokesh: టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ట్విస్ట్.. లోకేష్ పై హత్యాయత్నం కేసు..

నారా లోకేష్ (File/Photo)

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో నారా లోకేష్ సహా టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదైంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి (Attack on TDP Office) ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడి జరిగిన తర్వాత అక్కడికి వచ్చి సీఐ నాయక్ పై దాడి చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో కేసులో ఏ-1గా లోకేష్, ఏ-2గా అశోక్ బాబు, ఏ-3 ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రావణ్ కుమార్ ను చేర్చారు. వీరిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 70మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. టీడీపీ ఆఫీసులో తనపై దాడి చేసినట్లు సీఐ నాయక్ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  మంగళవారం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత ఓ వ్యక్తి కంగారుగా కనిపించి రూములో దాక్కోవడంతో బయటకు తీసుకొచ్చి విచారించినట్లు టీడీపీ నేత అశోక్ బాబు తెలిపారు. అతడ్ని ఎవరని ప్రశ్నించగా సీఐనని చెప్పినట్లు వెల్లడించారు. ఐడీ కార్డ్, మొబైల్ ఫోన్ గురించి ఆరాతీయగా పోయాయని చెప్పారని వివరించారు. ఆయన్ను మీడియా సమావేశంలో మాస్క్ తీసి చూపించారు అశోక్ బాబు.

  ఇది చదవండి: పట్టాభి వ్యాఖ్యలు సరికాదు.. చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేశా.. డీజీపీ సవాంగ్ కామెంట్స్..


  మీడియా సమావేశం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన సీఐ నాయక్.. తనపై టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో లోకేష్, అశోక్ బాబు, అలపాటి రాజా, తెనాలి శ్రావణ్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరీపై ఎఫ్ఆఆర్ కూడా రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న ట్విస్టుతో వాతావరణం మరింత వేడెక్కింది.

  ఇది చదవండి: టీడీపీని నిషేధించాలి... ఈసీని కోరతామన్న బొత్స... ఏపీలో హైవోల్టేజ్ పొలిటికల్ వార్..


  మరోవైపు లోకేష్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఘటన జరిగిన సమయంలో లోకేష్ అక్కడ లేరని.. అలాంటి వ్యక్తిపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన చాలాసేపటి తర్వాత ఆయన ఇక్కడికి వచ్చారని.. అప్పటికే సీఐ నాయక్ వెళ్లిపోయారని చెబుతున్నారు. ఇది పూర్తిగా కక్షపూరితంగా నమోదు చేసిన కేసని మండిపడుతున్నారు.

  ఇది చదవండి: "డైరెక్ట్ గా రా తేల్చుకుందాం..!" సీఎం జగన్ కు లోకేష్ సవాల్..!


  ఇక ఏపీలో చోటు చేసుకుంటున్న ఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన కామెంట్స్ దారుణంగా ఉన్నాయని.., రాజ్యాంగబద్ధమైన పదవిలో ముఖ్యమంత్రిపై ఓ పార్టీ కార్యాలయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించినందున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు పొరబాటున నోరు జారి అన్నవి కావని.. కావలనే పదేపదే అలా మాట్లాడరన్నారు. పట్టాభి వాడిన భాష గతంలో ఎప్పుడూ చూడలేదని డీజీపీ అన్నారు.

  ఇది చదవండి: ఏపీలో టెన్షన్... టెన్షన్... వైసీపీ వర్సెస్ టీడీపీ... పేలుతున్న మాటల తూటాలు..


  చంద్రబాబు ఫోన్ కాల్ పై వివరణ..
  ఇక తన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదన్న చంద్రబాబు ఆరోపణలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మంగళవారం సాయంత్రం 7గంటల 3 నిముషాలకు గుర్తుతెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తాను పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నానని.., పోలీస్ బ్యాండ్ దగ్గర ఉండటంతో సౌండ్ వల్ల సరిగా వినిపించడం లేదని.. తర్వాత మాట్లాతానని ఫోన్ పెట్టేశానినట్లు వివరించారు.
  Published by:Purna Chandra
  First published: