Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరుస ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. తాజాగా సత్తెనపల్లిలో మూడు కుటుంబాల్లో పెను విషాదం నెలకొనేలా చేసింది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న సమయంలో.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.. క్లీనింగ్ సమయంలో ఆ ట్యాంక్ లోనే ముగ్గురూ పడిపోయారు. చనిపోయిన వారిని కొండలు, అనిల్, బ్రహ్మం గా గుర్తించారు. గుంటూరు జిల్లా (Guntur District) లోని సత్తెనపల్లిలో న్యూవినాయక రెస్టారెంట్ లో.. సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేసేందుకు ఈ ముగ్గురు వచ్చారు. క్లీన్ చేస్తున్న సమయంలోనే ఊహించని విధంగా ఒక్కసారిగా గుంతలో ముగ్గురూ పడిపోయారు. ఈ ప్రమాద ఘటనలో ఓనర్ తో పాటు ఇద్దరు కూలీలు సైతం మృతి చెందారు. ఈ ముగ్గురి మరణంతో మూడు కుటుంబాల్లో విషాదం (Tragedy in Three families) నెలకొంది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా కుటుంబాల వారికి సమాచారం అందించారు.
స్థానికులు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి బస్టాండ్ దగ్గర వినాయక రెస్టారెంట్ కి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న సమయంలో.. ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు. సరిగ్గా డ్రైనేజ్ క్లీన్ చేస్తున్న సమయంలో సమీపంలో గుంత గమనించక పోవడంతో అందులో కూరుకుపోయారని హోటల్ యజమాని అంటున్నారు. ఇందులో ఎవని నిర్లక్ష్యం లేదు అంటున్నారు. కారణం ఏదైనా.. ముగ్గురు ప్రాణాలను బలితీసుకున్న ఆ సెప్టిక్ ట్యాంక్.. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
సమాచారం అందుకున్న పోలసులు ఘటనా స్థలానికిచేరుకున్నారు. పోలీసులతో పాటుగా ఫైర్ సిబ్బంది కూడా రంగంలో దిగారు. మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసి సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని 20 ఏళ్ల అనిల్, 18 ఏళ్ల పల్లపు బ్రహ్మ్మం, 65 ఏళ్ల కందకుంట్ల కొండలరావులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.దర్యాప్తు సాగుతోందని, ఎవరి నిర్లక్ష్యం ఉందని తేలినా చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఇవేం మిడతలురా బాబూ.. కన్నీరు పెడుతున్న అన్నదాతలు.. పంట కాపాడేదెలా..?
మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారి బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆ హోటల్ యజమానే నిర్లక్ష్యం కారణమని వారు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయని.. ఇకపైనైనా అలాంటి ప్రమాదాలు జరగకుండా.. మెలుకలు నేర్చుకోవాలని లేదంటే ఇలాంటి ప్రమాదాలు తప్పవని పోలీసులు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Gunturu