MLC Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) క్షణ క్షణం ఉత్కంఠ పెంచుతున్నాయి. ఉగాది పండగ (Ugadi Festival) రోజు సైతం రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. రేపు అసెంబ్లీ (AP Assembly) లో ఏం జరగనుంది..? అధికార వైసీపీ (YCP) పట్టు నిలుపుకుంటుందా..? ప్రతిపక్ష తెలుగు దేశం (Telugu Desam) సంచలన క్రియేట్ చేస్తుందా..? అనే అంశాలు క్షణ క్షణం రెండు పార్టీల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అయితే మొన్నటి వరకు వార్ వన్ సైడ్ అన్నట్టే ఉండేది వైసీపీ పరిస్థితి.. కానీ ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (Graduate MLC Elections Result) తర్వాత డూ ఆర్ డై అనే విధంగా లెక్కలు మారాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గిన టీడీపీ.. ఇప్పుడు అదే జోష్ తో తమకు నైతికంగా పూర్తి బలం లేదు అని తెలిసినా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలిపింది. గురువారం రోజు దీనికి సంబంధించిన పోలింగ్ నిర్వహించడంతో పాటు సాయంత్రం ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. వైసీపీ అసమ్మతి నేతలు కొందరు టీడీపీకి ఓటేస్తారనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీ అలర్ట్ అయ్యింది.
వైసీపీ ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టేసింది.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా..? అని జిల్లాల్లో ఆరా తీసింది.. కొందరిపై అనుమానాలు రావడం.. టీడీపీ ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉందనే సమాచారంతో.. అధిష్టానం మరింత ఫోకస్ చేస్తోంది. ఒక్క ఓటు కూడా చేజారకూడదని లెక్కలు వేసుకుంటోంది.. అందులో భాగంగానే విందు రాజకీయాలకు తెరలేపింది. ఉగాది రోజు రాత్రి మంత్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు విడివిడిగా హోటల్స్ విడిది ఏర్పాటు చేసి.. విందు ఇస్తున్నారు. ఎన్నిక సమయంలో పొరాపాటు జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం రెండు పార్టీల బలాబాలాలు చూసుకుంటే.. 8 మంది అభ్యర్థులు ఉండడంతో ఒక్కొక్కరికి 22 ఓట్లు తప్పని సరిగా రావాలి. అయితే సాంకేతికంగా చూస్తే టీడీపీ బలం 23 మంది ఎమ్మెల్యేలు.. వారంతా ఓటు వేస్తే పంచుమర్తి అనురాధ విజయం ఖాయం. కానీ టీడీపీ నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. వారంతా వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో టీడీపీ బలం 19కి పడిపోయింది. అయితే ఆ నాలుగు ఓట్లు తమకు రావాలి లేదా.. ఆ నలుగురిపై అనర్హత వేటు అయినా పడాలి అనే లెక్కతో టీడీపీ విప్ జారీ చేసింది. అయితే 4 ఎమ్మెల్యేలు లేకున్నా.. వైసీపీ నుంచి రెబల్స్ గా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ ఓటు వేస్తారని ప్రచారం జరుగుతోంది. వారు సైతం తాము ఆత్మ ప్రభోదాను సారమే ఓట్లు వేస్తామని చెప్పి.. అధిష్టానానికి షాక్ ఇచ్చారు.
ఇదీ చదవండి : చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? లోకేష్ భవష్యత్తు ఏంటి..? టీడీపీ పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..?
ఒకవేళ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం చూసుకుంటే.. ఆ రెబల్ ఎమ్మెల్యేల ఇద్దరి ఓట్లు టీడీపీకి పడితే.. అప్పుడు బలం 21కి చేరుతుంది. అయినా మరో ఓటు అవసరం ఉంటుంది. ఆ ఒక్క ఓటు వేసేది ఎవరు అన్నదే ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ నుంచి వెళ్లిన నలుగురిలో ఒకరు లేద ఇద్దరు మళ్లీ వెనక్కు వచ్చే ఆలోచనలో ఉన్నారని.. ఆ ఓటు టీడీపీకే పడుతుంది అనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు.. వైసీపీ లో ఉన్న ఒకరిద్దరు.. ఇప్పటికే టీడీపీ ఓటు వేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరగుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల ఇద్దరి ఓటు కాకుండా.. మరొక్క ఎమ్మెల్యే ఓటు క్రాస్ అయితే.. టీడీపీ సంచలనం క్రియేట్ చేసినట్టే అవుతుంది. అధికార పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ అవుతుంది. మరి ఈ వ్యూహాన్ని వైసీపీ ఎలా తిప్పి కొడుతుందో చూడాలి..
ఇదీ చదవండి : ఈ ఏడాది సీఎం జగన్ జాతకం ఎలా ఉంది? రాజకీయంగా కలిసి వస్తుందా? రాజపూజ్యం ఎంత? అవమానం ఎంత?
మొత్తంగా రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్ హాల్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, AP Politics