Telugu Heroine Sensational Post: వాడ్ని చంపినవాడితో పడుకుంటా..! రమ్య కేసుపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!

రమ్య హత్యపై రేఖ బోజ్ పోస్ట్

టాలీవుడ్ (Tollywood) లో పలు సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన తెలుగు నటి రేఖ భోజ్ (Rekha Boj) తన ఫేస్ బుక్ పేజీలో రమ్య హత్యోదంతంపై చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రమ్యను పొట్టనబెట్టుకున్న శశికిరణ్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి నిందితుడ్ని అరెస్ట్ చేసింది. అతడ్ని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ప్రకటించారు. రమ్యను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నవాడిని నడిరోడ్డుపై ఉరితీయాలని విద్యార్ధి సంఘాలతో పాటు అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాంతాలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా రమ్య కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా రమ్య హత్యను ఖండించారు. ఐతే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం రమ్య హత్యపై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. రమ్య హత్య జరిగిన తీరుపై ఆవేదనతో ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది.

    టాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన తెలుగు నటి రేఖ భోజ్ తన ఫేస్ బుక్ పేజీలో రమ్య హత్యోదంతంపై చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. “వాడ్ని కూడా అలానే ఎవరైనా నరికేస్తే, ఆ నరికిన వాడితో పడుకుంటా.im sry. ఆ వీడియో చూసాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అంత నిస్సహాయతలో వున్నాము మేము ఈ రోజు. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి. రమ్యా నీకు న్యాయం జరగాలి...Rest in peace Sister.” తన పోస్ట్ లో ఊసరవెల్లి సినిమాలో తమన్నా తనకు సాయం చేస్తే పడుకుంటా అంటూ ఆవేదనతో చేసిన ఫోటోను జత చేశారు. రమ్య జరిగిన తీరును చూసిన ఆవేదనతోనే తాను ఇలా పోస్ట్ చేసినట్లు ఆమె వివరణ ఇచ్చారు.


    ఇది చదవండి: సిలిండర్లో గ్యాస్ కు బదులు నీళ్లు.., ఇదేం విచిత్రమో...!


    కాగా గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన శశికృష్ణ ఇన్ స్టాగ్రామ్ ద్వారా రమ్యతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఐతే అతడి తీరు నచ్చని రమ్య.. శశికృష్ణను దూరంపెట్టింది. తన ప్రేమను కాదన్న కోపంతో రమ్యపై కక్ష పెంచుకున్న శశికృష్ణ.. ఆమెను నడిరోడ్డుపై కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాడు. అతడి కుటుంబ నేపథ్యం కూడా శశికృష్ణ ఇలా అవడానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం రమ్య కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఆమె తల్లిదండ్రులకు రూ.10లక్షల ఆర్ధిక సాయం అందించింది.
    Published by:Purna Chandra
    First published: