హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vidadala Rajini: నేటి నుంచి డాక్టర్లకు కొత్త నిబంధనలు.. ఆస్పత్రుల్లో తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఫ్యామిలీ డాక్టర్ పైనా క్లారిటీ

Vidadala Rajini: నేటి నుంచి డాక్టర్లకు కొత్త నిబంధనలు.. ఆస్పత్రుల్లో తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఫ్యామిలీ డాక్టర్ పైనా క్లారిటీ

మంత్రి విడదల రజనీ

మంత్రి విడదల రజనీ

Vidadala Rajini: వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో బయో మెట్రిక్ తప్పని సరి చేసింది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ విధి విధాలు ఎలా ఉంటాయి.. ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నదానిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యా, వైద్య రంగాల ప్రక్షాళనపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఇప్పటికే.. వైద్యానికి సంబంధించి అనే మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు నేడు (Nadu Nedu) పేరుతో పాఠశాలల (Government Schools) రూపు రేఖలు మార్చారు. పేద విద్యార్థుల ( Poor Students) కోసం పలు విద్యారంగానికి సంబంధించి పలు సంక్షేమ పథకాలు (AP Welfare Scheme) ప్రవేశ పెట్టిన ఆయన.. ఇంగ్లీష్ మీడియం (English Medium) ను తప్పని సరి చేశారు. ఇప్పుడు వైద్య రంగంలోనూ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి విడదల రజినీ. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకొచ్చినట్టు ఆమె ప్రకటించారు. అలాగే అన్ని స్థాయిల సిబ్బందికి ప్రత్యేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హులైన ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూడాలని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి విడదల రజినీ (Vidala Rajani) ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఆయుష్ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆమె సూచించారు.ముఖ్యంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ డాక్టర్ విధి విధానాలపైనా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఫ్యామిలీ డాక్టర్ సేవలు తెచ్చి ఇంటింటికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి విడదల రజినీ అన్నారు. కుటుంబ వైద్యుల విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంటింటికీ వైద్య సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 176 మంది వైద్యాధికారులు, 1,681 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమిస్తున్నట్లు మంత్రి విడదల రజినీ తెలిపారు.


  వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల మందులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అటు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కోసం కసరత్తు చేస్తున్నామని, ప్రత్యేకించి ఫీల్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ యాప్ ద్వారా అటెండెన్స్ అవకాశం కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలియజేశారు.
  ఇదీ చదవండి : ఇకపై ఇంటిదగ్గరే వినాయక నిమజ్జనం.. ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు.. ఎలా అనుకుంటున్నారా?
  ఈ ఫ్యామిలీ డాక్టర్ లో భాగంగా ప్రతి ఐదు లేదా ఏడు గ్రామాలకు ఒక డాక్టర్ ను కేటాయించనున్నారు. ఆయా డాక్టర్లు తమకు కేటాయించిన గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యాన్ని దగ్గర చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.. అలాగే ప్రతి గ్రామానికి నెలలో రెండు సార్లు 104 అంబులెన్స్ లను పంపించనున్నారు. కేటాయించిన గ్రామాల్లో ఒక ప్రత్యేక వైద్యులు పీహెచ్ సీలో ఉంటే.. మరో వైద్యుడు గ్రామంలోకి వెళ్లి నేరుగా ప్రజలను పరీక్షిస్తారు. అయితే ఏ రోజు నుంచి ప్రారంభమవుతాయి అన్నదానిపై మంత్రి క్లారిటీ ఇవ్వలేదు.. త్వరలో అని చెప్పారు.. అంటే సెప్టెంబర్ లోనే ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Guntur, Vidadala Rajani

  ఉత్తమ కథలు