Anna Raghu, Guntur, News18
ఎక్కడ పనిచేసినా.. ఎంత మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా క్రశిక్షణ అవసరం. వ్యక్తిగతంగా దారితప్పినా వృత్తిలో మాత్రం సిన్సియర్ గా పనిచేయాలి. అలాంటిది జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. అధికారులు, పోలీసులే ఆశ్చర్యపోయేలా స్కెచ్ వేసి పక్కాగా అమలు చేశాడు. ఆన్ లైన్ రమ్మీకి అలవాటు పడి లక్షకాదు రెండు లక్షలుకాదు ఏకంగా ఆరు కిలోల బంగారాన్ని బ్యాంక్ నుంచి సైడ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) గుంటూరు జిల్లా (Gunur District) బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో (Bank of Baroda) వెలుగు చూసిన గోల్డ్ స్కామ్ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే... బాపట్ల ప్రశాంతి నగర్ కు చెందిన పేర్లి సుమంత్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల గోల్డ్ లోన్ కు సంబంధించి ఆడిట్ నిర్వహించగా అందులో నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించారు.
మొత్తం 48 గోల్డ్ బ్యాగ్స్ కి కానూ.. 5.80 కేజీల 17 ప్యాకెట్ల అసలు బంగారానికి బదులు రోల్డ్ గోల్డ్ ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు అదే బ్యాంకులో పనిచేసే పేర్లి సుమంత్ పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేర్లి సుమంత్ అను అతను 2017 లో బ్యాంక్ ఆఫ్ బరోడా బాపట్ల బ్రాంచ్ లో సబ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. దురలవాట్లు కలిగి, షేర్ మార్కెట్ మరియు ఆన్ లైన్లో రమ్మీ ఆడే అలవాటు ఉంది.
బ్యాంక్ లో గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతా దారుల బంగారాన్ని ఎవరికి తెలియకుండా చోరీ చేయడం మొదలుపెట్టాడు. సిబ్బంది వారి పనుల్లో ఉండగా స్ట్రాంగ్ రూములో ప్రవేశించి 48 గోల్డ్ బ్యాగుల్లో అప్పుడప్పుడూ కొంత బంగారం తీసి స్నేహితులకు ఇస్తూ వచ్చాడు. ఇలా 5.8 కేజీల బంగారాన్ని తీసి అతని స్నేహితు లైన బాపట్ల పట్టణం జమేదార్ పేటకు చెందిన ఉన్నం అశోక్ కుమార్ అతని తమ్ముడు కిశోర్ కుమార్ కు ఇచ్చాడు. అసలైన బంగారం స్థానంలో నకిలీ బంగారాన్ని ఉంచారు.
ఇలా దొంగిలించిన బంగారాన్ని బాపట్ల సూర్యలంక రోడ్డులోని మణప్పురం గోల్డ్ లోన్ (Manappuram Gold Loan) లో సుమంత్ పేరమీద 1350.07 గ్రాములు, ఉన్నం అశోక్ కుమార్ పేరమీద 1146.65 గ్రాములు , ఉన్నం కిశోర్ కుమార్ పేరు మీద 1541.83 గ్రాములు మరియు ఉన్నం అశోక్ కుమార్, కిశోర్ కుమార్ తల్లి పేరు మీద 799.09 గ్రాములు. బాపట్ల ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) లో 4837.64 గ్రాములు బంగారు అబరణాలు పెట్టాలోన్ 1 కోటి 87 లక్షలు, 1141.40 గ్రాముల బంగారంతో రూ.34,00,000 లక్షలు లోన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమంత్ దగ్గర మరో 129 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. ఈ కేసులో మొత్తం 2.36 కోట్లు విలువ చేసే 6.10కేజీల బంగారాన్ని దొంగిలించినట్లు నిర్ధారించారు. పోలీసులు సమంత్ తో పాటు అతడికి సహకరించిన అశోక్, కిషోర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bank, Bank of Baroda, Crime news, Gold loans