హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Young Farmer: వ్యసాయంలో నష్టాలొస్తాయని ఎవరన్నారు..? ఈ యువరైతును ఫాలో అయితే లాభాలే లాభాలు..!

Young Farmer: వ్యసాయంలో నష్టాలొస్తాయని ఎవరన్నారు..? ఈ యువరైతును ఫాలో అయితే లాభాలే లాభాలు..!

రైతు మధు (ఫైల్)

రైతు మధు (ఫైల్)

ఈ రోజుల్లో వ్యవసాయం (Agriculture) అంటే నష్టాల సాగేనన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, ఎరువులు, పురుగుమందుల రేట్లు పెరగడం, కూలీలు, పెట్టుబడి ఖర్చులు అధికం కావడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ఈ రోజుల్లో వ్యవసాయం (Agriculture) అంటే నష్టాల సాగేనన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, ఎరువులు, పురుగుమందుల రేట్లు పెరగడం, కూలీలు, పెట్టుబడి ఖర్చులు అధికం కావడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఐతే అదే సమయంలో వినూత్న పద్ధతుల్లో సాగుచేస్తూ లాభాలు ఆర్జించే రైతులు కూడా ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ.. మంచి పద్ధతులు పాటిస్తూ వ్యావసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నారు. ఆధునిక పూలరకాలు ఎన్ని వచ్చినా... సంప్రదాయ పూలకు ఏమాత్రం ఆదరణ తగ్గటం లేదు. ముఖ్యంగా గులాబీ, చామంతి, బంతి, కనకాంబరం, మల్లె వంటి పూలసాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది. వ్యవసాయంలో రోజురోజుకీ పెరుగుతున్న ఒడిదుడుకులను అధిగమించేందుకు రైతులు తమకున్న కమతంలోనే కొంత విస్తీర్ణంలో పూలసాగును చేపడుతున్నారు.

    పూలలో రాణి ఈ గులాబీని మన ప్రాంతంలో రైతులు ఎప్పటినుంచో ఆరుబయట సాగుచేస్తున్నా, మహారాష్ర్ట, కర్ణాటక రైతులు మాత్రం  హైటెక్‌ సాగు పద్దతుల్లో పాలీహౌస్‌లలో పూయిస్తూ, విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తూ.. విరుల సిరులను ఒడిసిపట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆధునికతను అందిపుచ్చుకుంటున్న తెలుగు రైతులకు ఈ విరుల సాగును మరింత  చేరువుతున్నాయి. మంచి పూల దిగుబడితో ఎక్కువకాలం పాటు నిల్వగుణం కలిగిన హైబ్రిడ్  రకాలను నియంత్రిత వాతావరణంలో సాగుచేసేటపుడు, కొన్ని ప్రత్యేక యాజమాన్యపు మెలకువలను పాటించటం ద్వారా అధిక లాభాలను సొంతం చేసుకునే అవకాశం వుంది.

    ఇది చదవండి: బాబు పుట్టగానే తట్టిన ఐడియా.. ఇప్పుడో పెద్ద బిజినెస్ అయింది.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..!

    ఈ అంశాన్నే తన వ్యాపారానికి సూత్రంగా భావించి తన ఐఐఎం లో నేర్చుకున్న వ్యాపారా మెళుకువలను వ్యవసాయం లో చొప్పించి అధికలాభాలను సొంతం చేసుకున్నాడు.ఈ యువ రైతు. రైతులే వ్యవసాయాన్ని వదిలి వేసి పట్టణాలకు వలసపోతుంటే  ప్రముఖ సంస్ధలో జాబ్, లక్షల జీతం వదిలివేసి సేద్యం చేస్తున్నాడు పల్నాడు జిల్లా (Palanadu District) బొల్లాపల్లి మండలంలోని పెరూరుపాడు గ్రామ యువరైతు మధు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దిగుబడులను సాధిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు.

    మధు తమకున్న ఒక ఎకర పొలంలో పోలీ హౌస్ ను నిర్మించి, దానిలో హైబ్రిడ్ బొకే లకు ఉపయోగించే గులాబీలను పండిస్తూ కార్పొరేట్ కంపెనీ జీతాన్ని కంటే  ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఉద్యానశాఖ సూచనలు పాటిస్తూ  తనకున్న పరిజ్ఞానంతో  మంచి దిగుబడులు సాదిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు.  మూములు గూలాబీలు కంటే బొకే లో వాడే గులాబీలు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. అందుకే యువరైతు ఈస్యేదాన్ని ఎంచుకున్నాడు. అందరిచూపు ఇతని వైపు ఉండేలా దిగుబడిని సాధించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. వ్యవసాయం దండగ అనుకుంటున్న తరుణంలో పండుగ అనే రీతిలో  న్యూనూత సేద్యాన్ని ఆచరించాడు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Agriculture, Andhra Pradesh, Guntur

    ఉత్తమ కథలు