హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Soda: ఇక్కడ సోడా తాగితే బ్రేవ్ అనాల్సిందే..! ఒకేచోట 500 రకాల సోడాలు

Soda: ఇక్కడ సోడా తాగితే బ్రేవ్ అనాల్సిందే..! ఒకేచోట 500 రకాల సోడాలు

గుంటూరు వాసులను ఫిదా చేస్తు్న్న బ్రేవ్ సోడా

గుంటూరు వాసులను ఫిదా చేస్తు్న్న బ్రేవ్ సోడా

సోడా. ఇది తెలియని వారుండరు.  రకరకాల సోడాలు మనం చూస్తూనే ఉంటాం. నిమ్మకాయ సోడా, సాల్డ్ సోడా, సుగర్ లెమన్ సోడా, సుగంధి సోడా ఇలా అనేక రకాల సోడాలు మనం తాగే ఉంటాం. అయితే గుంటూరు (Guntur) సిటీ లోని నల్లకుంటలో బ్రేవ్ సోడా షాప్ గురించి నగర వాసులకు చాలా మందికి తెలుసు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

సోడా. ఇది తెలియని వారుండరు.  రకరకాల సోడాలు మనం చూస్తూనే ఉంటాం. నిమ్మకాయ సోడా, సాల్డ్ సోడా, సుగర్ లెమన్ సోడా, సుగంధి సోడా ఇలా అనేక రకాల సోడాలు మనం తాగే ఉంటాం. అయితే గుంటూరు (Guntur) సిటీ లోని నల్లకుంటలో బ్రేవ్ సోడా షాప్ గురించి నగర వాసులకు చాలా మందికి తెలుసు. ఇక్కడ దాదాపు 500 ప్లేవర్స్ లో సోడాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి సోడా తాగితే బ్రేవ్ వ్ వ్ అనాల్సిందే. గుంటూరుకు చెందిన యువకుడు వలీ ఈ బ్రేవ్ వ్ వ్ సోడాకు రూపకల్పన చేశారు. మొదట్లో సినిమాల్లో చిన్ని చిన్న క్యారెక్టర్లలో నటించిన వలీకి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చింది.

అందుకే సోడా బిజినెస్ ఎంచుకున్నాడు. వ్యాపారం కాస్త వెరైటీగా ఉండాలనే ఆలోచనతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో సోడాలను పరిశీలించాడు. వాటిని గమనించి ఒక కొత్త టేస్ట్ వచ్చేలా బ్రేవ్ వ్ వ్ సోడా తయారు చేశారు. ముందుగా నిమ్మరసం తీసి అందులో అల్లం, పుదీనా, మిర్చి పేస్ట్ తో పాటు, 19 ఇంగ్రీడియంట్స్ ను సోడాలో కలుపుతారు. మినరల్ వాటర్ లో గ్యాస్ నింపి వాటిని ఓ పెద్ద గ్లాసులో పోస్తారు. అప్పటికే  ఓ చిన్న గ్లాసులో సిద్దం చేసుకున్న రసాన్ని గ్లాసుతో సహా పెద్ద గ్లాసులో వేస్తారు. వెంటనే పొంగు వస్తుంది. అది పొంగిపోయేలోపే తాగాల్సి ఉంటుంది.

ఇది చదవండి: అక్కడ అన్నీ పాతకాలపు వంటకాలే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..

అందుబాటు ధరలో బ్రేవ్ వ్ వ్

గుంటూరులో ఇప్పటికే రెండు ప్రాంతాల్లో బ్రేవ్ సోడా అందుబాటులోకి వచ్చింది. ముందుగా నల్లచెరువు సెంటర్లో ప్రారంభించారు. ఇటీవల లక్ష్మీపురంలో కూడా మరో దుకాణం తెరిచారు. 19 రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారయ్యే బ్రేవ్ సోడా రూ.30 నుంచి రూ.50 దాకా రకాలను బట్టి అందుబాటులో ఉంది. ఈ షాపులో ఇలా మొత్తం 80 రకాల ప్లేవర్స్ రూ.30కే అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద 500 రకాల వెరైటీస్ సోడాలు అందిస్తున్నారు.

టేస్ట్ అదిరిపోద్ది, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు

గ్యాస్ సమస్యలు ఉన్నవారు, తిన్నతిండి అరుగుదల లేనప్పుడు ఈ సోడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బ్రేవ్ సోడా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని షాపు యజమాని చెబుతున్నారు. గొంతులో ఇన్ఫెక్షన్ కూడా అదుపులోకి వస్తుందని వెల్లడించారు. చాలా మంది ప్రతి రోజూ తాగే కస్టమర్లు వందల సంఖ్యలో ఉన్నారని వారు చెబుతున్నారు. కావాల్సిన వారికి ప్రాంచైజీస్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే బ్రేవ్ వ్ వ్ బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పేరుతో మరెవరూ సోడా షాపు పెట్టడానికి వీల్లేదు. అలా చేస్తే న్యాయపరమైన నోటీసులు ఇస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Food, Guntur

ఉత్తమ కథలు