GUNTUR THIS MAN WILL ROB HOUSES WHICH SEEN IN HIS NIGHT DREAMS IN GUNTUR ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Guntur News: ఈ దొంగ స్టైలే వేరు.. కలలో కనిపించిన ఇళ్లలోనే దొంగతనం..
ప్రతీకాత్మక చిత్రం
Guntur News: పూర్వం స్టువర్టుపురం దొంగలు మీ ఇల్లు దొంగతనం చేస్తాం అని చెప్పి చేసేవారట. కానీ ఈ జనరేషన్ దొంగలు అలా కాదు. ఇంటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో రెక్కీ చేసి.. పక్కా స్కెచ్ తో దోపిడీ చేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం అలాంటి ఇలాంటి దొంగకాదు. స్కెచ్ వేయడు, సమాచారం ఇవ్వడు. జస్ట్ నిద్రపోతాడంతే.
పూర్వం స్టువర్టుపురం దొంగలు మీ ఇల్లు దొంగతనం చేస్తాం అని చెప్పి చేసేవారట. కానీ ఈ జనరేషన్ దొంగలు అలా కాదు. ఇంటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో రెక్కీ చేసి.. పక్కా స్కెచ్ తో దోపిడీ చేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం అలాంటి ఇలాంటి దొంగకాదు. స్కెచ్ వేయడు, సమాచారం ఇవ్వడు. జస్ట్ నిద్రపోతాడంతే. అవును ఈ దొంగ.. చోరీ చేయడం కోసం నిద్రపోతాడు. నిద్రలోనే దొంగతనానికి స్కెచ్ వేస్తాడు. మెలకువ రాగానే ఇంటికి కన్నం వేసేస్తాడు. అవును ఈ వింత దొంగ రూటే సపరేటు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) పిడుగురాళ్ల మండలం గాంధీ నగర్ కు చెందిన ముచ్చు అంబేద్కర్ ఓ వింత దొంగ. వృత్తి ఎలక్ట్రీషియన్.. ప్రవృత్తి దొంగతనాలు చేయడం. సొంతూరిలో పనులు చేసుకే ఇతగాడు.. పక్క ఊరు వెళ్తే మాత్రం పేర్లు, ప్రొఫెషన్ రెండూ మార్చేస్తాడు. మనోడి స్కెచ్ లు ఎలా ఉంటాయంటే. రెక్కీ చేయడు. స్కెచ్ గీయడు కానీ నిలువుదోపిడీ చేసేస్తాడు. రాత్రి నిద్రపోయే ముందు ఎక్కడ దొంగతనం చేయాలో ఆలోచిస్తాడు. అంతే కలలో వచ్చిన ప్రాంతాలు, ఇళ్లను గుర్తించి అదే ఏరియాలో తన టాలెంట్ కు పని చెబుతాడు.
ఇలా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దొంగతనం చేసి కాజేసిన సొత్తును తన సొంతూళ్లో దాచుకునేవాడు. అంబేద్కర్ హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించాడు. కానీ ఎన్నిసార్లు జైలుకెళ్లినా పద్ధతి మాత్రం మార్చుకోలేదు. ఇటీవల వనస్థలిపురంలో దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు. రాచకొండ పోలీసులు విచారించగా.. అతడు చెప్పిన సమాధానం విని షాకయ్యారు.
తాను దొంగతనం చేద్దామనుకున్న ప్పుడు కలలో కొన్ని ప్రదేశాలు, ఇళ్లు కనిపిస్తాయని.. ఈ క్రమంలో వాటిని పోల్చుకొని.. అక్కడే దొంగతనం చేస్తానంటూ షాకింగ్ విషయాలు చెప్పాడు. గత 30ఏళ్లలో దాదాపు 43 దొంగతనాలు చేసినట్లు వెల్లడించాడు. అతడి దగ్గర కోటి ముప్పై లక్షలు విలువ చేసే బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ ఇలాంటి వెరైటీ దొంగలు పోలీసులకు చిక్కిన సందర్భాలున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు తోడు దొంగలు.. ఓ కేసులో కోర్టు వాయిదాకు వెళ్లి వచ్చే గ్యాప్ లో టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని రెండు ఇళ్లను దోచేశారు. ఇక విశాఖలో ఓ దొంగ కేవలం దర్వాజాకు కిటీకీ అటాచ్ అయిన ఇళ్లలోనే చోరీలు చేస్తాడు. కిటికీలో నుంచి లాక్ ఓపెన్ చేసి ఇల్లు గుల్లచేయడం అతడి అలవాటు. అతనొక్కడే రికార్డుస్థాయిలో వందల చోరీలకు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.