Home /News /andhra-pradesh /

GUNTUR THIS JILEBI WILL GIVE YOU UNIQUE TASTE AS IT BECAME FAMOUS FOOD IN TENALI GUNTUR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GSU NJ

Guntur Special: తేనెలూరే తెనాలి జిలేబి.., ఒక్కసారి రుచిచూస్తే రోజూ కావాలంటారు..

తెనాలి

తెనాలి జిలేబీ వేరీ ఫేమస్..

వింటే భారతమే వినాలి..తింటే మా తెనాలి జిలేబీనే తినాలి అంటుంటారు గుంటూరు వాసులు. ఒక్కసారి ఆ తేనెలూరే జిలేబి తిన్నారంటే మనం కూడా అదే మాట అంటామేమో..! ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో ఈ స్వీట్‌ తినందే రోజు గడవని వాళ్లు కోకొల్లలు.

ఇంకా చదవండి ...
  Sumanth, News18, Guntur

  వింటే భారతమే వినాలి..తింటే మా తెనాలి జిలేబీనే తినాలి అంటుంటారు గుంటూరు వాసులు. ఒక్కసారి ఆ తేనెలూరే జిలేబి తిన్నారంటే మనం కూడా అదే మాట అంటామేమో..! ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో ఈ స్వీట్‌ తినందే రోజు గడవని వాళ్లు కోకొల్లలు. గుంటూరు జిల్లాలో ఏ ఇంట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా.. బర్త్ డే నుంచి పెళ్లి రోజు వరకు అన్నింటా ఈ జిలేబిదే పైచేయి. పెళ్లికొడుకులు తమ పెళ్లి భోజనాల మెనూలో తెనాలి జిలేబి కంపల్సరీ అని… ఆడపెళ్లి వాళ్లను డిమాండ్‌ చేసిన సందర్భాలన్నాయంటే..అర్థం చేసుకోండి ఈ స్వీట్‌ టేస్ట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో…! ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లు. ఎందరో సినీనటులు, శిల్పకళాకారులు ఈ నేల నుంచి వచ్చినవాళ్లే. తెనాలి ప్రాంతం ఒక్క కళాకారులకే కాదు.. కమ్మనైన జిలేబీకి పెట్టింది పేరు. ఇక్కడ తయారయ్యే రుచికరమైన జిలేబీకి ఏళ్ల చరిత్ర ఉంది.

  తెనాలిలో 1965 నుండి జిలేబి వ్యాపారం నడుస్తోంది. చీమకుర్తి సుబ్బయ్య అనే వ్యక్తి మొదట ఈ ప్రాంతంలో జిలేబి తయారీ చేసేవారట. రంగువేయని నల్ల బెల్లంతో జిలేబి తయారీ ప్రారంభించాడు. ఆయన తరువాత బొట్లగుంట రామయ్య… రంగులు కలిపిన బెల్లంతో జిలేబీ తయారీ చేపట్టాడు. ఆ జిలేబీలు బంగారు వర్ణంలో చూడగానే నోరూరిపోయేట్లు ఉండేవి. దీంతో రామయ్య వ్యాపారంలోకి అడుగుపెట్టిన తరువాత.. తెనాలి జిలేబికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ బిజినెస్‌కు బాగా డబ్బులు వస్తుండటంతో.. ఆ ఊరిలో ఒక్కొక్కరుగా ఈ బిలేబి వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక బజారు మొత్తం ఈ జిలేబి దుకాణాలే కనిపిస్తుంటాయి.

  ఇది చదవండి: గోరింటాకుతో ఇన్ని లాభాలున్నాయా..? ఆషాఢంలో ఆడపిల్లల సాంప్రదాయం..!


  తెనాలి సత్యనారాయణపురం టాకీస్‌ రోడ్డు అలియాస్‌ జిలేబి కొట్ల బజారుగా అంతా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆ బజారు మొత్తం జిలేబి తయారీ దుకాణాలే.. ఒకవైపు వేడి వేడిగా జిలేబి తయారవుతుంటే మరోవైపు కొనుగోలు చేసేవాళ్లతో..ఆ సందు అంతా సందడి సందడిగా ఉంటుంది.

  అర్థశతబ్దానికిపైగా బిలేబి వ్యాపారం..!
  తెనాలికి చెందిన కిషోర్ అనే వ్యాపారి తనచిన్నతనం నుండే ఈ జిలేబి వ్యాపారం చేస్తున్నాడు. తన 16వ ఏట నుంచే ఈ వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాడు. పదోతరగతి తప్పడంతో తండ్రి తన దుకాణంలో కూర్చొబెట్టారు. చదువైతే అబ్బలేదేమో కానీ…జిలేబి వ్యాపారంలో మాత్రం మెలుకువలు నేర్చుకున్నాడు. ఆ నాటి నుండి సుమారు 53 ఏళ్లుగా కిషోర్‌ ఈ జిలేబి వ్యాపారం చేస్తున్నారు. తన జిలేబి తయారీలో నాణ్యమైన సామగ్రినే వాడతానని.. కాస్త ప్రత్యేకంగా తయారుచేస్తామని అందుకే కిషోర్‌ జిలేబికి ఒక ప్రత్యేక స్థానం ఉందంటున్నారు. ఈ వ్యాపారంతో మంచి ఆదాయంతో పాటు..మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒక్క తెనాలి మాత్రమే కాదు.., ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా కిషోర్‌ కొట్లో తయారు చేసిన జిలేబి ఎగుమతి అవుతుంది.

  ఇది చదవండి: బెజవాడ బెస్ట్ ఫుడ్ దొరికేది అక్కడే..! అన్నీ రుచులూ ఒకేచోట..!


  ఇలా ఒక్క కిషోర్‌ మాత్రమే కాదు..ఈ బిలేబి సెంటర్‌లో మరెందరో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జిలేబీ తయారుచేస్తూ దానిపైనే జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. బంగారు వర్ణంలో నోరూరిస్తూ ఉండే ఈ రుచికరమైన జిలేబిని తినేందుకు చుట్టుపక్కల ప్రాంత వాసులే కాదు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుండి సరదాగా వాహనాలపై వచ్చి జిలేబి ఆరగించి, ఇంట్లో వాళ్ళకు, స్నేహితులకు కొనుగోలు చేసి తీసుకువెళ్తూంటారు.

  ఇది చదవండి: ఇప్పుడీ రెస్టారెంట్ అందరికీ ఫేవరెట్ స్పాట్.. ఇక్కడ స్పెషాలిటీ ఇదే..!


  అప్పట్లో మద్రాసు కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ ఉన్న రోజుల్లో ప్రతి రోజు తెనాలి నుండి సిని పెద్దలకు తెనాలి జిలేబి వెళ్ళేదంటే ఈ రుచి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అలా అప్పుడు అలవాటు పడ్డ తమిళ తంబీలు ఇప్పటికీ తెనాలి జిలేబిని ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారట. చెన్నైలాంటి ప్రాంతాలకే కాదు. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం తెనాలి జిలేబిని ఇక్కడి వారు పంపిస్తుంటారు.

  ఇది చదవండి: తెలుగోడి పంచ్‌ పవరే వేరప్పా..! బాక్సింగ్‌లో మిర్చిలాంటి కుర్రాడు..!


  జిలేబి తయారీ విధానం:
  మినపప్పు, బియ్యం పిండి, మైదా సమపాళ్ళల్లో కలిపి 8 గంటలపాటు నానపెడతారు. కొద్దిగా గోరు వెచ్చని నీరు కలిపి మెత్తగా జారిపోయేలా పిండిని తయారు చేస్తారు. ఓ చిన్న క్లాత్‌ తీసుకుని…దానికి ఒక చిన్న రంధ్రం చేసి రెడీగా ఉంచుకుంటారు. స్టవ్‌ మీద్‌ బాండీ పెట్టి..నూనె పోస్తారు. ఆ వస్త్రంలోకి కాస్త పిండిని తీసుకుని…బాగా మరిగిన నూనెలో గుండ్రటి వలయాలుగా వేస్తారు. అవి కాస్త వేగిన అనంతరం…వేడిగా ఉన్న బెల్లం పాకంలో ఈ జిలేబీ చుట్టలను వేస్తారు.ఆ వేడికి బెల్లం ఆ జిలేబిలకు బాగా పట్టుకుంటుంది. అలా ఒక ఐదునిమిషాల తర్వాత వాటిని బయటకు తీస్తారు.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  జిలేబి చేసే విధానం ఒక్కటే. ఒక్క బెల్లం పాకంలో మాత్రమే కొన్ని మార్పులు చేస్తుంటారు. కొన్ని నల్లబెల్లంతోనూ, మరికొన్ని తెల్లబెల్లంతోనూ తయారుచేస్తుంటారు. చక్కెరతో తయారు చేసిన స్వీట్లకంటే బెల్లంతో తయారైన జిలేబీలో మంచి పోషకవిలువలు ఉంటాయి. అందులోనూ నల్లబెల్లంతో చేసిన జిలేబిలు మరింత శ్రేష్ఠం.  ప్రస్తుతం అక్కడ కేజీ జిలేబి ధర. రూ.180 ఉంది. ఈ తెనెలూరే జిలేబిని ఒక్కసారి మీరు టేస్ట్‌ చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అటుగా వెళ్లినప్పుడైతే తప్పకుండా రుచిచూడండి. అడ్రస్: తెనాలి సత్యన్నారాయణ టాకీస్ సెంటర్, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 522201.
  ఫోన్ నెంబర్‌ :9182614636

  Tenali Jilebi Center

  ఎలా వెళ్లాలి..?
  తెనాలికి బస్సు మార్గం, రైలు మార్గం అందుబాటులో ఉన్నాయి. రైల్వేస్టేషన్ నుండి అయినా, బస్టాండ్‌ నుంచి అయినా … ఆటోలో సత్యన్నారాయణ టాకీస్, జిలిబి సందు అని చెపితే చాలు నేరుగా అక్కడకు తీసుకెళ్లి దింపుతారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు